Visakhapatnam Railway Zone : ఏపీలో( Andhra Pradesh) కూటమి పాలనకు ఏడాది అవుతోంది. అందుకే మరింత దూకుడుగా ముందుకు సాగాలని నిర్ణయించింది. అందులో భాగంగా కీలక నిర్ణయాలకు సిద్ధమవుతోంది. సంక్షేమ పథకాలతో పాటు పాలనను పరుగులు పెట్టించాలని భావిస్తోంది. పెండింగ్ అంశాలను అమలు చేయాలని చూస్తోంది. గత కంటే ఇప్పుడు కేంద్రం సైతం రాష్ట్రానికి అండగా నిలబడుతోంది. ప్రధాని నరేంద్ర మోడీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఏపీకే అత్యంత ప్రాధాన్యమిస్తున్నారు. ఆర్థిక సాయంతో పాటు ప్రాజెక్టులను మంజూరు చేస్తున్నారు. రాజ్యాగ విశాఖ కేంద్రంగా కీలక ఉత్తర్వులు జారీ చేసింది కేంద్రం. విశాఖ వాసుల చిరకాల కోరిక నెరవేరనుంది. అందుకు కీలక నియామకం సైతం చేపట్టారు. దీంతో విశాఖ కేంద్రముగా రైల్వే జోన్ కార్యకలాపాలు ప్రారంభం అయినట్టే.
* జనరల్ మేనేజర్ పోస్ట్ భర్తీ..
విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్( South coastal railway zone ) ఏర్పాటైన సంగతి తెలిసిందే. జోనుకు తొలి జీఎంను నియమిస్తూ రైల్వే బోర్డు ఆదేశాలు జారీ చేసింది. విభాగాల అధిపతులను నియమించడంతో సహా జోన్ కార్యకలాపాలు మొదలయ్యే తేదీని ప్రకటించాల్సి ఉంది. జూన్ కార్యకలాపాల ప్రారంభ తేదీకి సంబంధించి ప్రకటన మిగిలి ఉంది. రాష్ట్ర విభజన తర్వాత ఏపీకి ప్రత్యేక జోన్ ఏర్పాటు చేసిన ఇప్పటివరకు జనరల్ మేనేజర్ పోస్ట్ భర్తీ కాలేదు. ఇప్పటివరకు జోన్ కు ప్రత్యేక అధికారి మాత్రమే ఉండగా.. సందీప్ మాధుర్ ని దక్షిణ కోస్తా జూన్ మేనేజర్ గా నియమిస్తూ రైల్వే బోర్డు సంయుక్త కార్యదర్శి విక్రమ్ సింగ్ దహీయా ఉత్తర్వులు జారీ చేశారు.
Also Read : సాగరనగరం పై నిఘా.. పోలీసుల జల్లెడ!
* ఏపీకి ప్రాధాన్యం..
ఎన్డీఏ 3 అధికారంలోకి వచ్చేందుకు ఏపీలో తెలుగుదేశం పార్టీ( Telugu Desam Party) కీలకంగా మారింది. ఏపీ లో ఎన్డీఏ సాధించిన సీట్లతోనే కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చింది బిజెపి. అందుకే గతానికి భిన్నంగా బిజెపి పెద్దలు సైతం ఏపీకే అత్యంత ప్రాధాన్యమిస్తున్నారు. ముఖ్యంగా విభజన హామీలతో పాటు అమరావతి రాజధాని నిర్మాణానికి ఎనలేని ప్రాధాన్యం ఇస్తూ వచ్చారు. ఇప్పుడు రైల్వే జోన్ అనేది వేగవంతం చేయాలని భావిస్తున్నారు. కొత్త జోన్ కు ఇప్పటివరకు జనరల్ మేనేజర్ పోస్టు లేదు. కానీ వడోదరా లోని నేషనల్ అకాడమీ ఆఫ్ ఇండియన్ రైల్వే డైరెక్టర్ జనరల్ అనే జిఎం క్యాడర్ కలిగిన పోస్ట్ ఖాళీగా ఉంది. దీంతో ఆ పోస్టులు విశాఖ జోన్ కు బదలాయించారు. జిఎంను నియమిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 2019 ఫిబ్రవరిలో ప్రత్యేక రైల్వే జోన్ ఏర్పాటుకు సంబంధించి కేంద్రం ప్రకటించింది. ఇప్పటికే ఈ జూన్ కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం లభించింది. వాల్తేర్ డివిజన్ స్థానంలో విశాఖపట్నం డివిజన్ ను కొనసాగించేందుకు ఆమోదం తెలిపారు.
* భవన నిర్మాణాలకు టెండర్లు..
దక్షిణ కోస్తా రైల్వే జోన్ కు సంబంధించిన కార్యాలయ భవన నిర్మాణ పనులు కూడా ప్రారంభిస్తున్నారు. ఇప్పటికే టెండర్ల ప్రక్రియ పూర్తయింది. బీసీ బుయాన్ కన్స్ట్రక్షన్ కంపెనీకి టెండర్లు తగ్గాయి. సుమారు 150 కోట్ల రూపాయలతో 9 అంతస్తులతో పాటు గ్రౌండ్ ఫ్లోర్, పార్కింగ్ కోసం మరో రెండు అంతస్తులతో కార్యాలయ భవనాలు నిర్మించనున్నారు. అయితే ప్రస్తుతం జిఎం పోస్టును భర్తీ చేశారు. త్వరలో ఒక సహాయ జీఎం, 10 విభాగాలకు హెచ్ ఓ డి లు, ఇతర సిబ్బందిని 170 మందిని నియమించనున్నారు. దక్షిణ మధ్య రైల్వే జోన్ నుంచి విజయవాడ, గుంటూరు, గుంతకల్లు డివిజన్లు.. తూర్పు కోస్తా రైల్వే జోన్ లో ఉన్న వాల్తేర్ డివిజన్ ఇకపై కొత్త జోన్ పరిధిలోకి వస్తాయి. ఈ నాలుగు డివిజన్లకు చెందిన కొందరు ఉన్నత స్థాయి అధికారులను.. కొత్త జోన్ అయిన విశాఖలో నియామకాలు చేపడతారు. అయితే ఇంకా గెజిట్ ప్రకటన ఉంది. ఆ ప్రకటనతోనే రైల్వే జోన్ అమల్లోకి వస్తుందని రైల్వే వర్గాలు చెబుతున్నాయి. మొత్తానికి అయితే ఏపీ విషయంలో కేంద్రం మాత్రం దూకుడు మీద ఉంది.