Visakhapatnam Employment: ఏపీకి( Andhra Pradesh) దిగ్గజ ఐటీ పరిశ్రమలు పెద్ద ఎత్తున తరలి వస్తున్నాయి. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున పెట్టుబడుల కోసం అన్వేషిస్తోంది. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్న ఔత్సాహికులకు ప్రోత్సాహం అందిస్తోంది. దీంతో పెద్ద ఎత్తున పారిశ్రామికవేత్తలు తమ సంస్థలను ఏర్పాటు చేసేందుకు ముందుకు వస్తున్నారు. ఇప్పటికే టిసిఎస్, కాగ్నిజెంట్ వంటి ప్రతిష్టాత్మక సంస్థలు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయి. తాజాగా మరో ఐదు కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు అంగీకరించాయి. ఈ ఐదు కంపెనీలు కూడా విశాఖపట్నంలోనే పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపించాయి. దీంతో ఏపీ ప్రభుత్వం వాటికి భూములు కేటాయించింది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డులో తీసుకున్న నిర్ణయం మేరకు ఐదు ఐటి కంపెనీలకు భూములు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీచేసింది ఏపీ ప్రభుత్వం. ఈ ఐదు కంపెనీలు కలిపి రూ.19,223 కోట్లు పెట్టుబడులు పెట్టనుండగా.. సుమారుగా 50వేల మందికి ఉద్యోగ అవకాశాలు కలగనున్నట్లు అధికారులు చెబుతున్నారు.
Also Read: అంతు పట్టని పవన్ వ్యూహం!
ఐటీ హబ్ గా విశాఖ..
విశాఖను ఐటి హబ్( IT hub) గా మార్చాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ప్రధానంగా ఐటీ శాఖ మంత్రిగా ఉన్న నారా లోకేష్ ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధతో ఉన్నారు. మొన్న ఆ మధ్యన దావోస్ పెట్టుబడుల సదస్సుకు వెళ్లారు. అక్కడ ప్రతిష్టాత్మక సంస్థలతో, వాటి ప్రతినిధులతో చర్చించారు. అవి ఇప్పుడు సత్ఫలితాలు ఇచ్చేలా కనిపిస్తున్నాయి.
తాజాగా సిఫీ ఇన్ఫినిటీ స్పేస్ లిమిటెడ్( Cifee Infinity space Limited ) అనే సంస్థ విశాఖలో డేటా సెంటర్ ఏర్పాటు చేయనుంది. రూ.15,226 కోట్లతో ఈ డేటా సెంటర్ ఏర్పాటు కానుంది. పరదేశి పాలెం లో సిఫీ సంస్థకు ఎకరా 50 లక్షల రూపాయల చొప్పున.. 25 ఎకరాలు కేటాయించారు. మధురవాడ ఐటి సెజ్ లో ఎకరా కోటి రూపాయల చొప్పున.. 3.6 ఎకరాలను కేటాయించారు. ఈ పెట్టుబడుల ద్వారా 600 మందికి ఉపాధి దక్కనుంది.
ఇక సత్వ డెవలపర్స్ ( satva developers) అనే సంస్థ విశాఖ రూ.1500 కోట్లు పెట్టుబడులు పెట్టనుంది. ఈ నేపథ్యంలో మధురవాడలో ఎకరా భూమిని కోటిన్నర చొప్పున.. 30 ఎకరాలు కేటాయించారు. సత్వ పెట్టుబడులతో సుమారుగా 25 వేల మందికి ఉపాధి అవకాశాలు కలగనున్నాయి.
ఏఎన్ఎస్ఆర్ గ్లోబల్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ 1000 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. విశాఖ ఐటి సెజ్ లో ఎకరా 99 పైసలు చొప్పున.. 10.29 ఎకరాలను కేటాయించారు. ఈ పెట్టుబడులతో పదివేల మందికి పైగా ఉపాధి అవకాశాలు లభించునున్నాయి.
పేనం పీపుల్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థకు మధురవాడ హిల్ 2 లో 45 సెంట్లు, రిషికొండ ఐటి పార్కులో 4 ఎకరాలు… మొత్తంగా ఎకరా రూ. 4.05 కోట్లతో 4.45 ఎకరాలు కేటాయించారు. ఈ సంస్థ రూ. 207.5 కోట్ల పెట్టుబడి పెడుతోంది. దీని ద్వారా 2500 మందికి ఉద్యోగాలు లభించునున్నాయి.
Also Read: వై నాట్ పులివెందుల.. ఓడిపోతే వైసీపీకి కష్టమే!
బివిఎం ఎనర్జీ అండ్ రెసిడెన్సి ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు ఎండాడ వద్ద ఎకరా రూ. ఒకటి పాయింట్ ఐదు కోట్ల ధరతో పది ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించింది. ఈ సంస్థ రూ.1250 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. 1500 మందికి ఉపాధి అవకాశాలు లభించునున్నాయి.