Visakhapatnam Urban Development: ఏపీ ప్రభుత్వం( AP government) సరికొత్త ఆలోచనలు చేస్తోంది. ముఖ్యంగా నగరీకరణ పై దృష్టి పెట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రధాన నగరాలు మరింతగా విస్తరించాలని భావిస్తోంది. నగరాల చుట్టూ కొత్తగా ధీమ్ బేస్డ్ పట్టణాలు, టౌన్ షిప్ లు, సిటీస్ నిర్మించాలన్న ఆలోచన చేస్తోంది. నగర జనాభా పెరుగుతున్న దృష్ట్యా.. వారి అవసరాలకు అనుగుణంగా ముందే సౌకర్యాలు ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ఇప్పటికే నీతి ఆయోగ్ విశాఖను ప్రత్యేక గ్రోత్ సిటీగా గుర్తించింది. నగరానికి అనుసంధానంగా పట్టణాలు నిర్మించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. దాదాపు 1000 ఎకరాల్లో భూమిని సేకరించనుంది. ఈ విధానాన్ని ఇతర నగరాల్లో కూడా అమలు చేయనున్నారు.
Also Read: పవన్ కళ్యాణ్ ను సీఎం చేసేందుకే.. ప్రకాష్ రాజ్ సంచలన ట్వీట్!
నగరీకరణ
విశాఖ నగరం( Vishakha City ) చుట్టూ కొత్త తరహా పట్టణాలు రాబోతున్నాయి. అనకాపల్లి తో పాటు విజయనగరం ప్రాంతాల్లో ధీం బేస్డ్ పట్టణాలను, సిటీలను, టౌన్ షిప్ లను అభివృద్ధి చేయనున్నారు. ఐటి, వైద్యం, పర్యాటక రంగం వంటి వివిధ రంగాల్లో పెట్టుబడులు పెట్టడానికి ప్రైవేట్ సంస్థలను ఆశ్రయిస్తారు. ప్రస్తుతం విశాఖ జనాభా 21 లక్షలకు దాటింది. ఇది మరింత పెరిగే అవకాశం ఉంది. అందుకే చుట్టుపక్కల ప్రాంతాల్లో కొత్త పట్టణాలు నిర్మించాలని ప్రభుత్వం యోచిస్తోంది.
Also Read: ఏపీలో ఆ నగరాల్లో యాచకుల నిషేధం.. ఇక కనిపిస్తే!
1000 ఎకరాల భూ సేకరణ..
విశాఖ పరిసర ప్రాంతాల్లో.. విజయనగరం తో( Vijayanagaram) పాటు అనకాపల్లి జిల్లాలు ఉన్నాయి. అక్కడ దాదాపు 1000 ఎకరాల ప్రభుత్వ, ప్రైవేటు భూములను గుర్తించారు. భూ సమీకరణ పథకం ద్వారా ప్రైవేటు భూములను సమీకరిస్తారు. భూమి యజమానులకు నష్టపరిహారం అందిస్తారు. అయితే ఇలా గుర్తించిన భూముల్లో ఐటి, పర్యాటకం, వైద్యం, వినోదం, వాణిజ్యం, పరిశ్రమలు వంటి విభిన్న రంగాల్లో అభివృద్ధి చేస్తారు. ప్రైవేటు సంస్థలు పెట్టుబడులు పెట్టడానికి ప్రభుత్వం ఆహ్వానం పలుకుతోంది. తద్వారా స్థానికులకు సైతం ఉద్యోగాలు లభిస్తాయి. ఎప్పటికీ నీతి ఆయోగ్ సిఫార్సులలో విశాఖకు చోటు దక్కింది. గ్రోత్ సిటీగా గుర్తింపు సాధించింది. అయితే ఇటువంటి నగరాలలో అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో లక్ష కోట్లు కేటాయించింది. దీని ద్వారా ధీమ్ ఆధారిత నగర నిర్మాణాలు సులువు అవుతాయని అధికారులు భావిస్తున్నారు. మొత్తానికి అయితే విశాఖకు ఈ నిర్ణయంతో మహర్దశ పట్టినట్టే.