Rushikonda Beach: ఏపీ ప్రభుత్వానికి( AP government ) ఊహించని షాక్ తగిలింది. ఏపీలో బ్లూ ఫ్లాగ్ గుర్తింపు పొందిన ఏకైక బీచ్ రుషికొండ. అయితే ఈ గుర్తింపు తాత్కాలికంగా రద్దు అయ్యింది. ఋషికొండ వద్ద ఉన్న 600 మీటర్ల తీర ప్రాంతాన్ని బ్లూ ఫ్లాగ్ బీచ్ గా 2020లో డెన్మార్కు చెందిన ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్ సంస్థ గుర్తించింది. దీంతో ఏపీలో తొలి బ్లూ ఫ్లాగ్ గుర్తింపును సొంతం చేసుకున్న బీచ్ గా రుషికొండ అవతరించింది. అయితే ఇప్పుడు అకస్మాత్తుగా గుర్తింపు రద్దు చేయడంపై తీవ్ర చర్చ కొనసాగుతోంది.
Also Read: జనసేన ప్లీనరీ కుదింపు.. సంచలన నిర్ణయం.. కారణాలు అవే!
* జెండాలు తొలగింపు రుషికొండ( rushikonda ) బీచ్కు బ్లూ ఫ్లాగ్ ఉండడంతో తీరం పొడవునా జెండాలు ఉండేవి. ఇప్పుడు రద్దు కావడంతో ఏపీ పర్యాటక శాఖ అధికారులు వాటిని దించేశారు. బీచ్ లో సరిగ్గా నిర్వహించలేకపోవడంతోనే సదరు సంస్థకు ఫిర్యాదులు వెళ్లినట్లు తెలుస్తోంది. దీంతో రంగంలోకి దిగిన సంస్థ ప్రతినిధులు తాజాగా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. గత కొంతకాలంగా బీచ్ నిర్వహణకు సంబంధించి సరైన నిర్ణయాలు తీసుకోవడం లేదు. కుక్కలు ఎక్కువగా తిరగడం, బీచ్ లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు పనిచేయకపోవడం, తీరంలో భారీగా ఉన్న వ్యర్ధాలు తీయకపోవడం, బీచ్ లో ఉన్న టాయిలెట్స్ ను, డ్రెస్ చేంజింగ్ రూమ్ లను శుభ్రంగా నిర్వహించకపోవడం.. వంటి కారణాలే బ్లూ ఫ్లాగ్ హోదా రద్దు కావడానికి కారణాలుగా తెలుస్తోంది.
* పర్యాటకుల ఫిర్యాదుతోనే
రుషికొండ బీచ్ కు( rushikonda beach ) తరచూ పర్యటకులు వస్తుంటారు. నిత్యం పర్యాటకుల తాకిడి ఉంటుంది. తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎక్కువగా రుషికొండ సందర్శనకు ఆసక్తి చూపుతారు. అటువంటి రుషికొండ గత ప్రభుత్వంలో ఆనవాళ్లను కోల్పోయింది. కొండను తొలగించి భారీ బలవంతులను కట్టింది వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం. ఇంకోవైపు ఇటీవల బీచ్ లో అస్తవ్యస్త వాతావరణం నెలకొంది. దీనిపై పర్యాటకులు కొందరు ఫోటోలు తీసి డెన్మార్క్ సంస్థకు గత నెల 13న ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. అందుకే బ్లూ ఫ్లాగ్ గుర్తింపును తాత్కాలికంగా తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. దీనిపై ఏపీ పర్యాటక శాఖ ఎలా స్పందిస్తుందో చూడాలి.
Also Read: వంగవీటి రాధాకు గ్రీన్ సిగ్నల్.. ఆ ఇద్దరికీ నో ఛాన్స్.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కొత్త సమీకరణలు!