https://oktelugu.com/

Vangaveeti Radha Krishna: వంగవీటి రాధాకు గ్రీన్ సిగ్నల్.. ఆ ఇద్దరికీ నో ఛాన్స్.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కొత్త సమీకరణలు!

ఏపీలో మరో ఎన్నికకు నగారా మోగింది. ఈనెల 20న 5 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నిక జరగనుంది. దీంతో ఆశావహులు ఎవరి ప్రయత్నాల్లో వారు ఉన్నారు.

Written By:
  • Dharma
  • , Updated On : March 2, 2025 / 08:58 AM IST
    Vangaveeti Radhakrishna

    Vangaveeti Radhakrishna

    Follow us on

    Vangaveeti Radha Krishna: ఏపీలో( Andhra Pradesh) రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీలతో పాటు ఒక ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి ఇప్పటికే ఎన్నిక జరిగింది. ఈనెల మూడున ఫలితాలు రానున్నాయి. మరోవైపు ఎమ్మెల్యేల కోటా కింద 5 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. దీనికి సంబంధించి షెడ్యూల్ విడుదలైంది. ఈ నెల 20న పోలింగ్ జరగనుంది. కూటమికి ఏకపక్షంగా బలం ఉండడంతో వారికే ఈ 5 ఎమ్మెల్సీ స్థానాలు దక్కనున్నాయి. అయితే ఎమ్మెల్సీ స్థానాలు ఆశించిన వారు మూడు పార్టీల్లోనూ ఉన్నారు. దీంతో ఎంపిక కొంచెం క్లిష్టంగానే మారనుంది.

    Also Read: పరీక్ష లేకుండా ఉద్యోగాలు.. రేపటితో ముగియనున్న దరఖాస్తు గడువు.. వెంటనే అప్లయ్‌ చేయండి!

    * నాగబాబుకు ఖాయం
    అయితే ఈ ఐదు ఎమ్మెల్సీ పదవుల్లో మెగా బ్రదర్ నాగబాబుకు ( Nagababu )ఒకటి ఖాయం అయ్యింది. కొద్ది నెలల కిందట నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకోనున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. దీంతో జనసేనకు ఒక ఎమ్మెల్సీ పదవి ఖాయమని తేలిపోయింది. మరోవైపు బిజెపి సైతం ఒక ఎమ్మెల్సీ పదవి కోరుతోంది. కేంద్ర పెద్దలు అడిగితే చంద్రబాబు తప్పకుండా ఇవ్వాల్సిన అనివార్య పరిస్థితి. ఈ లెక్కన రెండు ఎమ్మెల్సీ సీట్లు అటు వెళ్లిపోతాయి. తెలుగుదేశం పార్టీకి మూడు ఎమ్మెల్సీ పదవులు ఉంటాయి. అయితే ఆ పార్టీలో ఆశావాహులు అధికంగా ఉన్నారు. దీంతో ఎవరి ప్రయత్నాల్లో వారు ఉన్నట్లు తెలుస్తోంది.

    * ఆ సమీకరణల దృష్ట్యా
    అయితే ఈసారి వంగవీటి రాధాకృష్ణకు( vangaveeti Radhakrishna ) తప్పకుండా ఎమ్మెల్సీ పదవి ఇస్తారని తెలుస్తోంది. ఎందుకంటే 2019 ఎన్నికలకు ముందు ఆయన టిడిపిలో చేరారు. అప్పుడు ఆయనకు సీటు సర్ద లేకపోయారు. అటు తర్వాత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఐదేళ్ల పాటు ఎన్ని కష్టాలు ఎదురైనా తెలుగుదేశం పార్టీలోనే కొనసాగారు. 2024 ఎన్నికల్లో కూడా ఆయనకు అవకాశం లేకుండా పోయింది. కూటమి తరపున ఆయన ప్రచారం చేశారు. చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అందుకే రాధాకృష్ణకు తప్పకుండా పదవి దక్కుతుందని తెలుస్తోంది. ఒకవేళ రాధాకృష్ణకు పదవి ఖరారు చేస్తే అదే జిల్లాకు చెందిన దేవినేని ఉమా, బుద్ధ వెంకన్న ఆశలు వదులుకోవాల్సిందే.

    * తెరపైకి కాపు సామాజిక వర్గం..
    అయితే కాపు సామాజిక వర్గానికి( Kapu community ) సంబంధించి ఇప్పటికే నాగబాబుకు అవకాశం ఇవ్వనున్నారు. ఇప్పుడు అదే సామాజిక వర్గానికి చెందిన రాధాకృష్ణకు ఎలా ఇస్తారన్న ప్రశ్న కూడా వినిపిస్తోంది. మరోవైపు పిఠాపురం వర్మ కూడా పదవి ఆశిస్తున్నారు. బీసీ కోటాలో యనమల రామకృష్ణుడు తో పాటు బీద రవిచంద్ర ఉన్నారు. అయితే ఈసారి యనమలకు చాన్స్ లేదని తెలుస్తోంది. అయితే నాగబాబు జనసేన కోటా కిందకు వెళ్తారని.. టిడిపి తరఫున వంగవీటి రాధాకృష్ణకు చాన్స్ దక్కడం ఖాయమని తెలుస్తోంది. అదే జరిగితే సుదీర్ఘకాలం పవర్ పాలిటిక్స్ కు దూరంగా ఉన్న.. వంగవీటి రాధాకృష్ణకు చట్టసభల్లో అడుగుపెట్టే ఛాన్స్ దక్కుతుందన్నమాట.

     

    Also Read: ఏపీ ప్రజలకు వార్నింగ్‌.. వచ్చే మూడు నెలలు మండే ఎండలు.. గూబలు పగిలే వేడి గాలులు.. వాతావరణ శాఖ ముందస్తు అలర్ట్‌!