Homeఆంధ్రప్రదేశ్‌Visakha Steel Plant: విశాఖ స్టీల్ ప్లాంట్ కు వరుసగా రెండోసారి..

Visakha Steel Plant: విశాఖ స్టీల్ ప్లాంట్ కు వరుసగా రెండోసారి..

Visakha Steel Plant: విశాఖ స్టీల్ ప్లాంట్ కు( Visakha steel plant ) కేంద్రం మరో గుడ్ న్యూస్ చెప్పింది. మరోసారి భారీగా నగదు సాయం అందించాలని భావిస్తోంది. కొత్తగా రూ.8097 కోట్ల రూపాయలు అందించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ అనుమతి కోసం ఫైల్ పంపినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఫైల్ క్లియర్ చేసి విశాఖ స్టీల్ ప్లాంట్ కు రావాల్సిన నిధులు విడుదల చేయబోతున్నట్లు సమాచారం. గత ఏడాది కేంద్ర ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ కు 11 వేల కోట్ల రూపాయల ఆర్థిక ప్యాకేజీ అందించింది. తాజాగా ఇప్పుడు ఎనిమిది వేల కోట్లు అందించనుండడంతో.. విశాఖ స్టీల్ ప్లాంట్ ఒక గాడిన పడుతుందని అంచనా వేస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఈ మేరకు కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెచ్డీ కుమారస్వామి రూ.8097 కోట్లకు సంబంధించిన ఫైల్ ను క్లియర్ చేసి ఆర్థిక శాఖ ఆమోదం కోసం పంపినట్లు తెలుస్తోంది.

* ప్రైవేటీకరణ వివాదం..
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు సంబంధించి గత కొద్దిరోజులుగా వివాదం నడుస్తూనే ఉంది. ఒకవైపు కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందిస్తూనే ప్రైవేటీకరణ తప్పదన్న సంకేతాలు అందిస్తూ వచ్చింది. ఒక్కోసారి కేంద్ర ప్రభుత్వం భిన్న ప్రకటనలు చేస్తుండగా.. కేంద్ర మంత్రులు మాత్రం అటువంటిదేమీ లేదని చెబుతూ వచ్చారు. అయితే గత ఏడాది కేంద్ర ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ కు పదకొండు వేల కోట్ల రూపాయల సాయం అందజేసింది. అయితే స్టీల్ ప్లాంట్ కు కావాల్సింది నగదు సాయం కాదని.. సొంత గనులు ఏర్పాటు చేయాలని కార్మిక సంఘాలు కోరుతూ వచ్చాయి. ప్రస్తుతం ప్లాంట్లో మూడు బ్లాస్ట్ ఫర్నేస్ ప్రారంభంతో కార్యకలాపాలు ఇబ్బంది లేకుండా కొనసాగుతున్నాయి. స్టీల్ ఉత్పత్తి తో పాటు అమ్మకాలు కూడా గణనీయంగా పెరిగాయి. ఈ కార్యకలాపాలు ఇలాగే భవిష్యత్తులో సుదీర్ఘంగా కొనసాగేందుకు అవసరమైన చేయూత ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. అందుకే ఇప్పుడు రెండో దశ ప్యాకేజీ లో భాగంగా ఎనిమిది వేల కోట్లు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది.

* రాష్ట్ర ప్రభుత్వ సంప్రదింపులతో..
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వానికి విశాఖ స్టీల్ ప్లాంట్ అంశం గుదిబండగా మారింది. రాజకీయంగా ఇబ్బందులు రాకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు చేస్తోంది. గత ఏడాది తొలివిడతగా రూ.11440 కోట్ల ప్యాకేజీ అందించింది. ఈక్విటీ రూపంలో రూ.10,300 కోట్లు.. వర్కింగ్ క్యాపిటల్ రుణాలను ఏడు శాతం నాన్ క్యూములేటివ్ రీడిమాబుల్ ప్రిఫరెన్స్ షేర్ల రూపంలో 1140 కోట్లను సమకూర్చింది. ఇప్పుడు తాజాగా మరో ఎనిమిది వేల కోట్ల రూపాయలు సమకూర్చాలని నిర్ణయించడం విశేషం. విశాఖ స్టీల్ ప్లాంట్ కు సొంత గనులు కేటాయించే వరకు.. పరిస్థితి ఇలానే కొనసాగనుంది. అందుకే నగదు సాయానికి బదులు.. సొంత గనులు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు కార్మికులు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

AI Impact On Education: ఏఐతో మూలాలే మటాష్.. పరిస్థితి ఎంతకు దిగజారిందంటే..

AI Impact On Education: ఏఐ తో ఇప్పటివరకు కేవలం ఐటీ ఉద్యోగాలు మాత్రమే పోయాయని అనుకున్నాం. ఎంట్రీ లెవెల్.. మిడ్ లెవెల్ ఉద్యోగాలు మాత్రమే మటాష్ అయిపోయాయని మీడియా వార్తల్లో...

Rahul Gandhi Injury: రాహుల్ రక్తం కళ్ళ చూశారు.. మోడీకి ఇది మైనస్సే

Rahul Gandhi Injury: మల్లికార్జున కార్గే నిన్న తన పుట్టినరోజు జరుపుకున్నారు.. ఆయనకు శుభాకాంక్షలు తెలియజేయడానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు వెళ్లారు.. పోలీసులు కూడా వారి కేవలం శుభాకాంక్షలు తెలియజేయడానికి మాత్రమే వెళ్తున్నారని...

Ishan Kishan: ఐపీఎల్ లో పరుగుల వరద పారించాడు.. జాతీయ జట్టులో తేలిపోతున్నాడు.. ఇలా అయితే కష్టమే..

Ishan Kishan: అప్పట్లో దూకుడుగా బ్యాటింగ్ చేసేవాడు. వన్డేలో అతడికి డబుల్ సెంచరీ కూడా ఉంది. ఈ స్థాయిలో ఆడిన అతడు స్థిరత్వాన్ని కొనసాగించలేకపోయాడు. దీనికి తోడు క్రమశిక్షణలోపించడంతో జట్టులో స్థానం...

Vijayendra Prasad: రాజమౌళి కి నచ్చినట్టుగా కథ రాయడం చాలా కష్టం అంటున్న విజయేంద్రప్రసాద్… ఆయన అడిగేవి ఇవే…

Vijayendra Prasad: తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శకుడిగా తన కెరియర్ ను మొదలుపెట్టిన రాజమౌళి ఆ తర్వాత పాన్ ఇండియా పరిధిని టచ్ చేస్తూ ప్రేక్షకులోకాన్ని అలరిస్తున్నాడు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులందరిని...

Mahesh Babu: మహేష్ బాబు కి నచ్చినట్టుగా సినిమాను తీయలేకపోయిన దర్శకులు వీళ్లే…

Mahesh Babu: సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా మారిపోయాడు. తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ యావత్...
Oktelugu Epaper
Exit mobile version