Visakha Corporation : విశాఖ నగరపాలక సంస్థలో( Visakha Municipal Corporation ) డిప్యూటీ మేయర్ పదవి చిక్కుముడి నెలకొంది. డిప్యూటీ మేయర్ పదవిని సైతం తెలుగుదేశం పార్టీ కోరుతోంది. ఎట్టి పరిస్థితుల్లో జనసేనకు విడిచి పెట్టే అవకాశం లేదని తెలుస్తోంది. దీంతో విశాఖలో కూటమిలో చీలిక వచ్చే ప్రమాదం కనిపిస్తోంది. కొద్ది రోజుల కిందట వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మేయర్ గొలగాని వెంకట హరి కుమారి పై పెట్టిన అవిశ్వాసం నెగ్గిన సంగతి తెలిసిందే. టిడిపికి చెందిన పీలా శ్రీనివాసరావు మేయర్ గా ఎన్నికయ్యారు. ఇప్పుడు డిప్యూటీ మేయర్ ఎన్నిక జరగనుంది. దీంతో ఆ పదవి తమదంటే తమది అని టిడిపి, జనసేన మధ్య పోటీ నెలకొన్నట్లు తెలుస్తోంది.
Also Read : జగన్మోహన్ రెడ్డి అరెస్ట్.. ముహూర్తం ఫిక్స్!
* నెగ్గిన అవిశ్వాసం..
వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress) పార్టీకి చెందిన మేయర్ పదవీకాలం ఇంకా ఏడాది ఉంది. అయితే చాలామంది కార్పొరేటర్లు అధికార కూటమి వైపు మొగ్గు చూపారు. ఎన్నికల కు ముందు కొందరు.. ఫలితాలు వచ్చిన తర్వాత మరికొందరు కూటమి పార్టీల్లో చేరారు. దీంతో కూటమి పార్టీల బలం పెరిగింది. అందుకే వైసీపీకి చెందిన మేయర్ పై అవిశ్వాసం పెట్టి దించేశారు. టిడిపి నేత మేయర్ గా ఎన్నికయ్యారు. నాలుగు దశాబ్దాల తర్వాత టిడిపికి ఇక్కడ అవకాశం దక్కింది. అయితే తమకు పెరిగిన బలంతో డిప్యూటీ మేయర్ పదవి తమకు ఇవ్వాలని జనసేన కోరుతోంది. దీనికి సమ్మతించింది టిడిపి. అయితే జనసేన కాకుండా వైసిపి నుంచి ఆ పార్టీలోకి ఫిరాయించిన కార్పొరేటర్ కు డిప్యూటీ మేయర్ పదవి ఇచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీనిపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది తెలుగుదేశం పార్టీ.
* జనసేనకు 13 మంది కార్పొరేటర్లు సపోర్ట్..
జీవీఎంసీ ఎన్నికల( gvmc elections ) సమయంలో ముగ్గురు కార్పొరేటర్లు జనసేన నుంచి గెలిచారు. వారికే ఇప్పుడు డిప్యూటీ మేయర్ పదవి ఇవ్వాలన్న మెలిక పెడుతోంది తెలుగుదేశం. వైసీపీ నుంచి ఫిరాయించిన కార్పొరేటర్లకు ఎట్టి పరిస్థితుల్లో డిప్యూటీ మేయర్ పదవి ఇవ్వకూడదని షరతు పెడుతోంది. ఎన్నికల ఫలితాల తర్వాత ఓ 10 మంది కార్పొరేటర్లు జనసేనలో చేరారు. ఇలా చేరిన వారిలో ఒకరికి డిప్యూటీ మేయర్ పదవి ఇచ్చేందుకు జనసేన సిద్ధంగా ఉందని ప్రచారం సాగుతోంది. అయితే జనసేన నుంచి గెలిచిన ఆ ముగ్గురు కార్పొరేటర్ లలో ఒకరికి మాత్రమే డిప్యూటీ మేయర్ పదవి ఇవ్వాలని.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి చేరిన వారికి ఇస్తే మాత్రం ఊరుకునేది లేదని టిడిపి చెబుతోంది. దీంతో డిప్యూటీ మేయర్ ఎంపిక అనేది జఠిలంగా మారుతోంది.
* నాలుగు దశాబ్దాల తర్వాత..
విశాఖ నగరపాలక సంస్థను( Vishakha Municipal Corporation ) నాలుగు దశాబ్దాల తర్వాత గెలుచుకుంది.. తెలుగుదేశం పార్టీ. ఎట్టి పరిస్థితుల్లో పట్టు నిలుపుకోవాలని చూస్తోంది. జనసేనకు డిప్యూటీ మేయర్ పదవి ఇచ్చి.. కీలక భూమిక టిడిపి పోషించాలని భావిస్తోంది. అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి జనసేనలో చేరిన కార్పొరేటర్ కు డిప్యూటీ మేయర్ పదవి కట్టబెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అదే జరిగితే తమ పార్టీలో ఉన్న కార్పొరేటర్ ను డిప్యూటీ మేయర్ గా రంగంలోకి దించుతామని టిడిపి చెబుతోంది. దీంతో రెండు పార్టీల మధ్య కొంత వివాదం అయితే నడుస్తోంది. ఈరోజు డిప్యూటీ మేయర్ ఎన్నిక నిర్వహించేందుకు నిర్ణయించారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.