Diwali Celebrations ప్రపంచ వ్యాప్తంగా దీపావళి సంబరాలు ప్రారంభమయ్యాయి. హిందువులు జరుపుకునే అతిపెద్ద పండుగల్లో దీపావళి ఒకటి. ఈ పండుగను చెడుపై మంచి సాధించిన విజయానికి సూచికగా జరుపుఉంటాం. ప్రజలను హించే రాక్షసుడు నరకాసురున్ని సత్యభామ వధించిన సందర్భంగా దీపాలు వెలిగించి పండుగ చేసుకున్నారని చెబుతారు. అప్పటి నుంచే ఏటా దీపావళి జరుపుకుంటున్నట్లు చరిత్ర. దీపావళిని దేశ ప్రజలంతా సంతోషంగా జరుపుకుంటారు. వేకువ జామునేలేచి అభ్యంగన స్నానాలు చేస్తారు. కొత్త బట్టలు ధరిస్తారు. పిండి వంటలు తయారు చేసి ఆరగిస్తారు. బంధుమిత్రులను ఇళ్లకు పిలుస్తారు. పండుగ శుభాకాంక్షలు తెలుసుకుంటారు. సాయంత్రం లక్ష్మీ పూజ చేస్తారు. కేదీరేశ్వర నోము నోముకుంటారు. తర్వాత ఇళ్ల ముంగిళ్లలో టపాసులు కాలుస్తారు. పిల్లలు, పెద్దలు అంతా సంబురంగా చేసుకునే పండుగ దీపావళి. దేశమంతా దీపావళిని జరుపుకుంటుంటే.. ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లి జిల్లాలో ఉన్న కిత్తంపేట గ్రామస్తులు మాత్రం 70 ఏళ్లుగా దీపావళికి దూరంగా ఉంటున్నారు.
కారణం ఇదే..
కిత్తంపేట గ్రామం రావికమతం మండలం జెడ్ బెన్నవరం పంచాయతీలో ఉంది. ఇక్కడ 450 ఇళ్లు, 1,500 జనాభా ఉంది. శివారు గ్రామమైనా జనాభా పరంగా జెడ్ బెన్నవరం కన్నా పెద్దది. రాజకీయంగా చైతన్యవంతం కావడంతో ఈ ఊరివారే సర్పంచ్‌గా ఎన్నికవుతూ వస్తున్నారు. ఇక ఈ ఊరు 70 ఏళ్లుగా దీపావళి పండుగను జరుపుకోవడం లేదు. దీనిని ఆచారంగా భావిస్తున్నారు. తమ చిన్నతనం నుంచి ఎన్నడూ టపాసులు కాల్చలేదని స్థానికులు తెలిపారు. గతంలో అందరిలగే పండుగ చేసుకునేవారని, టపాసుల కారణంగా ఊరు పండుగ జరుపుకోవడం మానేసిందని తెలిపారు.
అగ్నికి ఆహుతి..
70 ఏళ్ల క్రితం ఊరంతా పాకలే. గడ్డివాములు, పశువులు, ఉండేవి. దీపావళి రోజున దివిటీలు తిప్పుతుండగా నిప్పురవ్వలు పడి ఇళ్లన్నీ అగ్నికి ఆహుతయ్యాయి. మూగ జీవాలన్నీ మృతిచెందాయి. అప్పటి నుంచి అన్నీ అపశకునాలే జరుగుతున్నాయి. ఇక దీపావళి సమయంలోనేæ గ్రామంలో ఎక్కువ మంది మరణిస్తున్నారు. దీంతో కీడు జరుగుతుందని భావించిన పెద్దలు దీపావళికి దీపాలు వెలిగించడం మానేశారు. ఎవరూ పండుగ చేసుకోవద్దని నిర్ణయించారు. నాటి నుంచి అదే ఆనవాయితీ కొనసాగుతోంది.
Raj Sekhar is a senior content writer with good knoledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read MoreWeb Title: Villagers of kittampeta in anakapalli district of andhra pradesh have been staying away from diwali for 70 years
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com