* జగన్ కోటరీలో విభేదాలు
వాస్తవానికి జగన్( Jagan Mohan Reddy) కోటరీలో విభేదాలు వచ్చాయన్నది బహిరంగ రహస్యం. తాడేపల్లి ప్యాలెస్ అనేది ఒక రాజకీయాల పుట్టగా మారింది. అక్కడ ఆ నలుగురు పెత్తనం చేస్తారన్న కామెంట్స్ ఉండేవి. అందులో విజయసాయిరెడ్డి కూడా ఒకరు. అయితే చాలా రోజులుగా అక్కడ రారాజుగా వెలుగొందిన విజయసాయిని తొక్కేశారన్న కామెంట్స్ వినిపించేవి. ఈ క్రమంలోనే అక్కడ సజ్జల ప్రాధాన్యత పెరిగింది. వై వి సుబ్బారెడ్డి కి ఎనలేని గౌరవం దక్కుతోంది. ఇక కొత్తగా చేరిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి కొత్త బాధ్యతలు అందించారు. అనుబంధ విభాగాల బాధ్యతలను అప్పగించారు. అయితే ఆ ముగ్గురికి భారతీ రెడ్డి సహకారం ఉంది. కానీ ఏళ్ల నుంచి జగన్ కోసం పనిచేస్తున్న విజయసాయిరెడ్డి విషయంలో మాత్రం ఆమె కఠినంగా వ్యవహరించారన్న విమర్శ ఉంది. అందుకే రాజీనామా పత్రంలో ఆమె పేరు ప్రముఖంగా ప్రస్తావించినట్లు తెలుస్తోంది.
* అక్కడే అనుమానం
సాధారణంగా విజయసాయి రెడ్డి ( Vijaya Sai Reddy )లాంటి స్థాయి గల నేతలు పార్టీకి గుడ్ బై చెప్పినప్పుడు.. మరో పార్టీలో చేరతామని భావిస్తారు. కానీ తాను ఏ పార్టీలో చేరనని.. వ్యవసాయం చేసుకుంటానని విజయసాయిరెడ్డి చెప్పడం వెనుక మర్మం దాగి ఉంది. కచ్చితంగా అది మనసుకు బాధించింది. ఆయన వైసీపీని వీడలేక చేసిన ప్రకటనగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సాధారణంగా ఏ రంగంలో ఉన్న వారైనా.. తమకు కొద్దిపాటి భూములు ఉంటే.. వృత్తిపై, ఉద్యోగం పై విసుకు వస్తే.. ఊరెళ్ళి వ్యవసాయం చేసుకుంటానని చెబుతారు. అంతేతప్ప తమను ఇబ్బంది పెట్టే సంస్థలను, వ్యక్తులను వ్యతిరేకించరు. తమను తాము సర్దుబాటు చేసుకుని అవసరమైతే ఊరెళ్ళి వ్యవసాయం చేసుకుంటానని చెప్పుకొస్తుంటారు. ఇప్పుడు విజయసాయిరెడ్డి విషయంలో కూడా జరిగింది అదే. జగన్ తో పాటు ఆ కుటుంబం కోసం కష్టపడితే.. ఆ కృషికి తగిన గుర్తింపు లభించలేదన్నది విజయసాయిరెడ్డి ఆవేదనగా తెలుస్తోంది.
* కూటమి నేతతో చర్చలు
అయితే సాధారణంగా చాలామంది తమలో ఉన్న బాధను వ్యక్తపరుస్తుంటారు. ఈ క్రమంలోనే కూటమి నేత( Alliance leader ) ఒకరు ఒక కార్యక్రమంలో కలిశారు. ఎప్పుడూ చనువు తీసుకొని విజయసాయిరెడ్డి సదరు నేతను పిలిచారు. పక్కన కూర్చుని పెట్టి మాట్లాడారు. రాజకీయ వైరాగ్యం ప్రదర్శించారు. చాలండి ఇక రాజకీయం అంటూ చెప్పుకొచ్చారు. పనిలో పనిగా ఓపెన్ అయ్యారు. ఈనెల 25న తాను బాంబు పేల్చబోతున్నట్లు చెప్పుకొచ్చారు. అయితే సదరు కూటమినేత మాత్రం విజయసాయిరెడ్డి బిజెపిలోకి వెళ్తారని భావించారు. కానీ ఆయన చెప్పిన దానికి ఒక రోజు ముందుగానే బాంబు పేల్చారు. ఏకంగా రాజకీయాలకు గుడ్ బై చెబుతున్నట్లు చెప్పుకొచ్చారు. సో ఇది మనసుకు తగిలిన బాధతోనే నిర్ణయం తీసుకున్నారన్నమాట.