Homeఆంధ్రప్రదేశ్‌Vijayasai Reddy comeback: విజయసాయి రెడ్డి రీ ఎంట్రీ.. రంగంలోకి కీలక నేత!

Vijayasai Reddy comeback: విజయసాయి రెడ్డి రీ ఎంట్రీ.. రంగంలోకి కీలక నేత!

Vijayasai Reddy comeback: వైసీపీలోకి విజయసాయిరెడ్డి( Vijaya Sai Reddy ) వస్తారా? అందుకు అవసరమైన చర్చలు సాగుతున్నాయా? జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారా? విజయసాయిరెడ్డి సైతం మొగ్గు చూపారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇటీవల పార్టీ ముఖ్య నేత జగన్మోహన్ రెడ్డి వద్ద ఇదే విషయాన్ని ప్రస్తావించినట్లు తెలుస్తోంది. పార్టీ క్లిష్ట పరిస్థితుల్లో ఉందని.. విజయసాయి రెడ్డి లాంటి నేత ఉంటే బాగుంటుందని.. విజయసాయిరెడ్డిని పార్టీలోకి పెద్దమంటూ ఆయన ప్రతిపాదన పెట్టినట్లు సమాచారం. అయితే సాయి రెడ్డి వస్తే తనకు ఎటువంటి అభ్యంతరం లేదని జగన్మోహన్ రెడ్డి చెప్పినట్లు ప్రచారం సాగుతోంది. ఒకవేళ విజయసాయిరెడ్డి వైసీపీలోకి వస్తే అది సంచలన అంశంగా మారనుంది.

కుటుంబ ఆడిటర్ గా..
వైయస్ రాజశేఖర్ రెడ్డి( y s Rajasekhar Reddy ) కుటుంబంతో విజయసాయి రెడ్డికి సుదీర్ఘ అనుబంధం ఉంది. ఆ కుటుంబ ఆడిటర్ గా ఉండే విజయసాయిరెడ్డి జగన్మోహన్ రెడ్డికి దగ్గరయ్యారు. ఆయన పరిశ్రమలకు సంబంధించి అన్ని కార్యకలాపాలను చూసుకునేవారు. అందులో భాగంగానే జగన్ పై వచ్చిన అవినీతి కేసుల్లో కూడా విజయసాయిరెడ్డి నిందితుడిగా మారారు. జగన్మోహన్ రెడ్డి తో పాటు 16 నెలల పాటు జైలు జీవితం కూడా అనుభవించారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు, ఆ పార్టీ విస్తరణ, కేంద్ర పెద్దలతో సాన్నిహిత్యం, పార్టీని అధికారంలోకి తీసుకుని రావడం వెనుక విజయసాయిరెడ్డి కృషి ఉంది. అయితే 2024 ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత విజయసాయిరెడ్డి అనూహ్యంగా పార్టీకి గుడ్ బై చెప్పారు. అయినా సరే ఎక్కడా జగన్మోహన్ రెడ్డి పై వ్యతిరేకంగా మాట్లాడలేదు.

Also Read: జగన్ తోనే వంశీ.. ఈ కలయిక వైరల్

ఎనలేని ప్రాధాన్యం
వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీ సైతం విజయసాయి రెడ్డికి ఎనలేని ప్రాధాన్యం ఇచ్చింది. 2014లో 67 సీట్లతో గౌరవప్రదమైన ప్రతిపక్ష హోదాను దక్కించుకుంది. దీంతో తొలి రాజ్యసభ పదవిని దక్కించుకున్నారు విజయసాయిరెడ్డి. అది మొదలు కేంద్ర పెద్దలతో సాన్నిహిత్యం పెంచుకున్నారు. వైయస్సార్ కాంగ్రెస్ తో పాటు జగన్మోహన్ రెడ్డి కోసం కేంద్ర పెద్దలకు సాగిలాలు పడిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా విజయసాయిరెడ్డి ప్రాధాన్యం పెరిగింది. పార్టీతో పాటు ప్రభుత్వంలో కీలకపాత్ర పోషించారు. అయితే అనూహ్యంగా సజ్జల రామకృష్ణారెడ్డి పాత్ర పెరిగి.. విజయసాయిరెడ్డి ప్రాధాన్యతను తగ్గించారు. ఒకానొక దశలో పార్టీకి గుడ్ బై చెబుతారన్న క్రమంలో మళ్లీ దగ్గరకు తీసుకుని నెల్లూరు పార్లమెంట్ సీటు ఇచ్చారు. అయితే అక్కడ విజయసాయి రెడ్డికి ఓటమి ఎదురైంది.

ప్రాధాన్యత తగ్గడంతో..
ఎన్నికల ఫలితాలు( elections result ) వచ్చిన తర్వాత చాలా రకాల కేసులు విజయసాయిరెడ్డికి ఎదురయ్యాయి. అదే సమయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో జగన్ చుట్టూ విజయసాయి రెడ్డికి వ్యతిరేకంగా కోటరి పెరిగింది. దీనిని తట్టుకోలేక పోయారు విజయసాయిరెడ్డి. ఒకవైపు కేసులు ఎదురు కావడం.. ఇంకోవైపు ప్రాధాన్యత తగ్గడంతో పార్టీకి గుడ్ బై చెప్పారు. ఇకనుంచి ఏ పార్టీలో చేరనని.. వ్యవసాయం చేసుకుంటానని చెప్పుకొచ్చారు. కానీ తరచూ రాజకీయ వ్యాఖ్యానాలు చేస్తూ.. తనలో ఇంకా రాజకీయ ఆసక్తి తగ్గలేదని సంకేతాలు పంపారు.

Also Read: ఆ వైసీపీ కీలక నేతకు అండగా కూటమి ఎంపీలు?

తొలుత విజయసాయిరెడ్డి బిజెపిలో చేరుతారని పెద్ద ఎత్తున ప్రచారం నడిచింది. కానీ అటువంటిదేమీ జరగలేదు. అయితే వైసిపి హయాంలో జరిగిన కేసులకు సంబంధించి వాంగ్మూలం ఇచ్చారు ప్రత్యేక దర్యాప్తు బృందం ఎదుట. దీనిపై జగన్మోహన్ రెడ్డి ఘాటుగా వ్యాఖ్యానించారు కూడా. అయినా సరే విజయసాయిరెడ్డి జగన్ విషయంలో ఎటువంటి విమర్శలు చేయలేదు. అయితే ఇప్పుడు విజయసాయిరెడ్డిని పార్టీలోకి తెస్తే బాగుంటుందన్న సీనియర్ నేతల అభిప్రాయాన్ని జగన్ ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం విజయసాయిరెడ్డి తో వైసీపీ కీలక నేత చర్చలు జరుపుతున్నారని.. త్వరలో ఆయన రావడం ఖాయమని వైసిపిలో ప్రచారం జరుగుతుంది. ఒకవేళ ఆయన కానీ వైసీపీలోకి వస్తే ఇదో సంచలన అంశంగా మారే అవకాశం ఉంది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Exit mobile version