Vidadala Rajini PA: శనివారం ఉమ్మడి గుంటూరు జిల్లా మానుకొండ వారి పాలెం లో వైసీపీ కార్యకర్తను పరామర్శించడానికి విడుదల రజిని తన అనుచరులతో కలిసి వెళ్లారు. సందర్భంగా అక్కడికి వెళ్లిన పోలీసులు విడుదల రజిని అనుచరుడు శ్రీకాంత్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులకు, విడుదల రజనికి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.”సిఐ గారు ఏం జరుగుతోంది.. సిఐ గారు ఏం జరుగుతోంది” అంటూ పోలీసులను రజిని ప్రశ్నించగా..”మాజీ మంత్రి అయివుండి.. మా విధులకు అడ్డు రాకండి మేడం. మా విధులకు అడ్డువస్తే మీపై కూడా కేసు బుక్ చేయాల్సి వస్తుందని” సీఐ ఆమెను హెచ్చరించారు. ఈ సందర్భంగా అక్కడ వైసీపీ నాయకులకు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఆ తర్వాత శ్రీకాంత్ రెడ్డిని పోలీసులు తమ వాహనంలో ఎక్కించుకొని నాదెండ్ల తీసుకెళ్లారు.. దీంతో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా హైదరాబాద్ చేసుకుంది. ఆ తర్వాత నాదెండ్ల పోలీస్ స్టేషన్ కు వైసిపి నాయకులు వెళ్లారు. అక్కడ పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేయడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది.
Also Read: భూమిపై కూలనున్న ‘కాస్మోస్ 482’.. అసలేంటిది..?
ఇటీవల గోపీనాథ్ అరెస్ట్..
విడదల రజిని మరిది విడదల గోపీనాథ్ ను ఇటీవల ఏపీ పోలీసులు అరెస్టు చేశారు. గోపీనాథ్ 2021లో ఓ స్టోన్ క్రషర్ యజమానిని బెదిరించి డబ్బులు వసూలు చేశారని.. ఇటీవల ఆంధ్రప్రదేశ్ ఏసీబీ అధికారులు గోపీనాథ్ ను హైదరాబాదులో అరెస్ట్ చేశారు. దీనిని విడుదల రజని తీవ్రంగా ఖండించారు. కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు పాల్పడుతోందని ఆరోపించారు. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తోందని మండిపడ్డారు. గోపీనాథ్ అరెస్టును మర్చిపోకముందే విడుదల రజనికి మరో షాకిచ్చారు ఏపీ పోలీసులు. రజిని వ్యక్తిగత కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డిని అరెస్ట్ చేశారు. అతని అరెస్టును రజిని తీవ్రంగా ఖండించారు. ఎందుకు తీసుకెళ్తున్నారని అడిగితే పోలీసులు.. దురుసుగా సమాధానం చెప్పారు. పోలీసులను అడ్డుకోవడానికి రజనీ ప్రయత్నించినప్పటికీ.. వారు లక్ష్య పెట్టలేదు. పైగా రజినిపై కేసులు పెడతామని హెచ్చరించారు. మొత్తంగా చూస్తే తదుపరి అరెస్టు రజిని అని.. కూటమి నేతలు వ్యాఖ్యానిస్తున్నారు..” రజనీ మంత్రిగా ఉన్నప్పుడు అనేక అక్రమాలకు పాల్పడ్డారు. ఇష్టానుసారంగా వ్యవహరించారు. వ్యవస్థలను మొత్తం నాశనం చేశారు. ఇప్పుడు ఆమె బాగోతాలు మొత్తం బయటపడుతున్నాయి. త్వరలో ఆమె కూడా అరెస్ట్ అవుతారు. ప్రజల్లో సానుభూతి పెంచుకోవడానికి ఆమె ఏదో పోలీసుల మీద అరిచారు గాని.. పోలీసులు ముందస్తుగా అనుమతి తీసుకొని మరీ శ్రీకాంత్ రెడ్డిని అరెస్ట్ చేశారు. ఆ విషయం తెలిసి కూడా విడుదల రజని అడ్డుకోవడానికి ప్రయత్నించారు. చివరికి ఆమె తన పాచికలు పారకపోవడంతో.. ఇలా అరచి గోల పెడుతున్నారు. అరచి గోల పెట్టినంత మాత్రాన పోలీసులు వారి పని వారు చేసుకోకుండా ఆగలేరు కదా అంటూ” కూటమి నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు.