Vasireddy Padma: వైసీపీకి షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి.ఆ పార్టీకి ఓటమి ఎదురైన తర్వాత చాలామంది నేతలు గుడ్ బై చెబుతున్నారు.మరి కొంతమంది సైలెంట్ అయిపోయారు.పరిస్థితిని చూసి అడుగులు వేయాలని భావిస్తున్నారు.అయితే వైసిపి హయాంలో పదవులు అనుభవించిన వారు సైతం ఇప్పుడుపక్క చూపులు చూస్తుండడం విశేషం. తాజాగా ఓ మహిళా నేత పార్టీకి గుడ్ బై చెప్పారు. అదే బాటలో మరికొందరు ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో జగన్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో మరి చూడాలి.గత ఐదేళ్ల వైసిపి హయాంలో మహిళా కమిషన్ చైర్పర్సన్ గా వ్యవహరించిన వాసిరెడ్డి పద్మ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు పార్టీ అధినేత జగన్ కు రాజీనామా లేఖ పంపించారు. ఈమె వైసిపిలో చాలా యాక్టివ్ గా పని చేశారు.పార్టీ ఆవిర్భావం నుంచి సేవలందించారు.గట్టి వాయిస్ ఉన్న ఈమెకు జగన్ పార్టీ అధికార ప్రతినిధిగా అవకాశం ఇచ్చారు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా ఛాన్స్ ఇచ్చారు. ఆ పదవి క్యాబినెట్ హోదా తో సమానమైనది. గత ఐదేళ్లపాటు ఆ పదవిలో కొనసాగారు వాసిరెడ్డి పద్మ. అయితే ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉన్నారు. ఇప్పుడు ఏకంగా రాజీనామా చేశారు. జనసేనలో చేరతారని ప్రచారం సాగుతోంది.
* జగ్గయ్యపేట సీటు ఆశించి
ఈ ఎన్నికల్లో జగ్గయ్యపేట అసెంబ్లీ సీటును ఆశించారు. తనకు కానీ.. తన భర్తకు కానీ టికెట్ ఇవ్వాలని అధినేత జగన్ ను కోరారు. కానీ జగన్ పట్టించుకోలేదు. సీటు దక్కకపోయేసరికి మౌనం దాల్చారు పద్మ. అయితే ఎన్నికలకు ముందే ఆమె పార్టీని వీడుతారని ప్రచారం సాగింది. కానీ సైలెంట్ గా ఉండి పోయారే తప్ప పార్టీకి గుడ్ బై చెప్పలేదు. ఇప్పుడు కాజా గారి నిర్ణయం తీసుకున్నారు. వైసీపీని వరుసుగా నేతలు గుడ్ బై చెబుతున్నారు. ఇప్పటికే బాలినేని శ్రీనివాస్ రెడ్డి, సామినేని ఉదయభాను జనసేనలో చేరారు. ఈమె సైతం వారినే అనుసరించనున్నట్లు తెలుస్తోంది.
* పీఆర్పీ ద్వారా పొలిటికల్ ఎంట్రీ
ప్రజారాజ్యం పార్టీ ద్వారా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు వాసిరెడ్డి పద్మ. అప్పట్లో ప్రజా రాజ్యం అధికార ప్రతినిధిగా సేవలందించారు. చిరంజీవితో పాటు పవన్ కళ్యాణ్ తో ఆమెకు సంబంధాలు ఉన్నాయి. కానీ ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయడంతో.. జగన్ పార్టీ వెంట నడిచారు. వైసిపి ఆవిర్భావం నుంచి సేవలందిస్తున్నారు. అయితేఅసెంబ్లీకి ఎన్నికై చట్టసభలకు వెళ్లాలన్నది పద్మ లక్ష్యం.కానీ జగన్ పట్టించుకోకపోయేసరికి ఆమెలో ఒక రకమైన అసంతృప్తి బయటపడింది. అదే పార్టీకి గుడ్ బై చెప్పడానికి కారణం అయ్యింది. త్వరలో ఆమె జనసేనలో చేరతారని ప్రచారం సాగుతోంది. అయితే పార్టీలు వీడియో క్రమంలో జగన్ గుడ్ బుక్ ప్రస్తావన తీసుకొచ్చారు వాసిరెడ్డి పద్మ. పార్టీ కోసం పనిచేసే వారిని గుర్తించుకుంటానని జగన్ చెప్పుకొచ్చారు. అయితే గత పదేళ్లుగా పార్టీ కోసం పనిచేసిన తనకు గుర్తింపు ఇవ్వకపోవడాన్ని ప్రస్తావించారు. మొత్తానికైతే వరుసగా నేతలు పార్టీకి గుడ్ బై చెబుతుండడంతో జగన్ ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.