Homeఆంధ్రప్రదేశ్‌వైసీపీ భయంలోనే వారాహి యాత్ర సక్సెస్

వైసీపీ భయంలోనే వారాహి యాత్ర సక్సెస్

Varahi Yatra : పవన్ కు రాజకీయం తెలియదంటారు. ఆయనకు రాజకీయాలు సూట్ కావంటారు. పార్ట్ టైమ్ పొలిటీషియన్ అని ఆరోపణలు చేస్తారు. రెండు పడవల మీద ప్రయాణం చేస్తారని నిష్టూరమాడతారు. ఇటు రాజకీయరంగం.. అటు సినిమా రంగం.. రెంటింటిలోనూ నష్టం తప్పదని విశ్లేషిస్తుంటారు. కానీ అదే పవన్ రాజకీయాలు మొదలు పెడితే ఇప్పుడు తట్టుకోలేకపోతున్నారు.తటపటాయిస్తున్నారు. ఏం చేయాలో తెలియక మల్లగుల్లాలు పడుతున్నారు. అన్నవరం సత్యదేవుని సన్నిధిలో ప్రారంభించి భీమవరంలో ముగించిన వారాహి తొలి విడత యాత్రతో ప్రత్యర్థుల వెన్నులో వణుకు పుట్టించడంలో పవన్ సక్సెస్ అయ్యారు.

సాధారణంగా పవన్ అంటే పవర్ స్టార్. ఆయన పర్యటనలకు జన సమీకరణ చెయ్యాల్సిన అవసరమే ఉండదు. ఆయన పిలుపునకే జనాలు ఉప్పొంగుతారు. అందుకే వారాహి జన జాతరగా మారింది. దారి పొడవునా జనంతో మమేకమయ్యారు. మధ్యలో అన్నవర్గాల ప్రజలను కలుసుకున్నారు. వారితో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి సమస్యలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేశారు. అన్నింటినీ నోట్ చేసుకున్నారు. జనసేన అధికారంలోకి వస్తే అన్నీ సెట్ చేస్తానని హామీ ఇచ్చారు. ముఖ్యంగా ప్రభుత్వ బాధిత వర్గాల వారికి భరోసా కల్పించారు.

ఫస్ట్ టైమ్ పవన్ వైసీపీ మార్కు రాజకీయంపై కౌంటర్ ఇచ్చారు. ముల్లును ముల్లుతోనే తియ్యాలని ఘాటైన, పదునైన విమర్శనాస్త్రాలు సంధించారు. వైసీపీ నేతలను పదునైన మాటలతో అష్ట దిగ్భంధం చేశారు. పవన్ ను ఎలా కంట్రోల్ చేయాలో తెలియక చిన్న కంటెంట్ ను పట్టుకొని ముద్రగడ పద్మనాభంను ప్రయోగించారు. కానీ అగ్నికి ఆజ్యం పోసినట్టు ఆయన పవన్ లో మరింత సెగలు పెంచారు. ముద్రగడను పవన్ లైట్ తీసుకోవడంతో ఆ బాధ్యతను జనసైనికులు తీసుకున్నారు. ప్లేట్లు, ఉప్మ ఖర్చంటూ రూ.1000 చొప్పున మనియార్డరు పంపించి ముద్రగడతో వారు ఆడేసుకున్నారు.

ఏదో అనుకున్నాం కానీ.. ఆయన రంగంలోకి దిగితే ఇలా ఉంటుందా? అని ప్రత్యర్థులు అనుకునేలా పవన్ రీ సౌండ్ చేశారు. సరిగ్గా రెండు వారాల యాత్రకే ఈ పరిస్థితి ఉందటే.. ఆయన సినిమాలు వదిలి పూర్తిస్థాయి రాజకీయాలు చేస్తే.. అమ్మో ఏమైనా ఉందా? అన్న రేంజ్ లో వైసీపీ నేతలు భయపడుతున్నారు. బయటకు మేకపోతు గాంభీర్యం ప్రకటించినా లోలోపల మాత్రం పవన్ సెగలు బాగానే తాకాయి. అందుకే ఇక నుంచి జాగ్రత్తగా ఉండాలని అధికార పార్టీ నుంచి ఒక రకమైన సంకేతాలు వస్తున్నాయి. వారాహి యాత్ర అంచనాలకు మించి సక్సెస్ అయ్యిందని వారి భయమే చెబుతోంది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular