Vallabhaneni Vamsi Mohan: జగన్మోహన్ రెడ్డి ( Y S Jagan Mohan Reddy ) కొత్త రాజధాని మావిగన్ ప్రతిపాదనపై రకరకాల రచ్చ నడిచింది. సోషల్ మీడియా వేదికగా ట్రోల్స్ నడిచాయి. రాజధానుల విషయంలో జగన్మోహన్ రెడ్డి ఎప్పటికప్పుడు స్టాండ్స్ మార్చడంపై విమర్శలు కూడా వ్యక్తమయ్యాయి. చివరకు అనుకూల ఎనలిస్టులతో పాటు సోషల్ మీడియా యాక్టివిస్టులు కూడా ఏకిపారేశారు. ఇప్పుడు ఆ జాబితాలో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ చేరారు. మావిగన్ లేదు తొక్క లేదు అంటూ ఆయన వ్యాఖ్యానించినట్టు సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది. అయితే ఆ వీడియోలో స్పష్టత లేదు కానీ ఆయన మాత్రం మావిగన్ ప్రతిపాదనను గట్టిగానే వ్యతిరేకిస్తున్నట్లు అర్థమవుతోంది. విపరీతంగా ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. టిడిపి శ్రేణులు అదే పనిగా ట్రోల్ చేస్తున్నాయి.
* ఇప్పుడిప్పుడే యాక్టివ్…
కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వల్లభనేని వంశీ మోహన్ ( Vamsi Mohan ) అరెస్టయ్యారు. సుదీర్ఘకాలం ఆయన జైల్లోనే ఉండిపోయారు. చాలా రోజుల తర్వాత బెయిల్ పై జైలు నుంచి బయటకు వచ్చారు. ఈ క్రమంలో తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డిని ప్రత్యేకంగా కలుసుకున్నారు. ఇప్పుడిప్పుడే గన్నవరం నియోజకవర్గంలో యాక్టివ్ అవుతున్నారు. అయితే ఇంతలో జగన్మోహన్ రెడ్డి మావిగన్ ప్రతిపాదన తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వల్లభనేని వంశీ కొందరు సన్నిహితులతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. మందుతో పాటు విందు సాగింది ఆ సమావేశంలో. ఈ క్రమంలో వారి మధ్య మావిగన్ చర్చ వచ్చింది. ఈ క్రమంలోనే వల్లభనేని వంశీ స్ట్రాంగ్ గా రియాక్ట్ అయినట్లు ప్రచారం నడుస్తోంది. అయితే ఆ పార్టీ వీడియోను తీసిన వారు సోషల్ మీడియాలో పెట్టారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.
* వ్యతిరేకత ఎక్కువ..
వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి మావిగన్( mavigun ) ప్రతిపాదన చేసిన తర్వాత అనుకూల ఎనలిస్టులతో పాటు సోషల్ మీడియా యాక్టివిస్టులు, వైసిపి అనుకూల యూట్యూబర్లు సైతం ఆశ్చర్యపోయారు. జగన్మోహన్ రెడ్డి రాజధానుల స్టాండ్స్ మార్చడం పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన వారు ఉన్నారు. పార్టీకి నిర్ణయం డ్యామేజ్ చేస్తుందని సీనియర్లు కూడా భావించారు. మరికొందరు వ్యూహాత్మకంగా సైలెంట్ అయ్యారు. ఈ నిర్ణయంతో కృష్ణాజిల్లా నేతలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు ప్రచారం నడిచింది. మాజీమంత్రి కొడాలి నాని అయితే కనీస స్థాయిలో కూడా స్పందించలేదు. వల్లభనేని వంశీ మోహన్ సైతం బాహటంగా స్పందించలేదు. కానీ మందు పార్టీలో సన్నిహితుల వద్ద మావిగన్పై ఆయన వ్యాఖ్యలు చేసినట్లు మాత్రం సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.. ఎందుకంటే కనీస స్థాయిలో వల్లభనేని వంశీ వ్యతిరేకించకపోతే ఈ వార్త బయటకు వచ్చి ఉండేది కాదు. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డికి హార్ట్ కోర్ ఫ్యాన్ వల్లభనేని వంశీ మోహన్. అటువంటి జగన్మోహన్ రెడ్డి నిర్ణయాన్ని వంశీ వ్యతిరేకించారు అంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
