Vallabhaneni Vamsi Collector Office: అధికారం ఉన్నప్పుడు నాయకులకు కన్ను మిన్ను కనిపించదు. ఇష్టానుసారంగా మాట్లాడుతుంటారు. ఇష్టానుసారంగా ప్రత్యర్థుల మీద దాడులు చేస్తుంటారు. ఇక నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతుంటారు. నీతి..రీతి అనే విషయాలను పక్కనపెడతారు. సభ్యతను పూర్తిగా మర్చిపోతుంటారు. అదే అధికారాన్ని కోల్పోయిన తర్వాత ఒక్కసారిగా కిందికి వస్తారు. ప్రజల్లో కలిసిపోతారు. సామాన్యుల మాదిరిగా కవరింగ్ ఇస్తూ ఉంటారు.
ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే.. ఓ నాయకుడి గురించి.. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయన సాగించిన వ్యవహారాలు గురించి.. ఇప్పుడు ఆయన పరిస్థితి ఎలా మారిపోయింది అంట.. గడ్డం పెరిగిపోయింది.. నెరిసిన జుట్టు అలానే ఉంది. కంటి చూపుతో శాసించిన నాయకుడు ఇప్పుడు కలెక్టర్ కార్యాలయానికి వచ్చారు. సామాన్యుడిగా క్యూలో నిలబడ్డారు. ఏదో సమస్య మీద వినతిపత్రం ఇచ్చారు. ఆ నాయకుడు మరెవరో కాదు గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ.
వల్లభనేని వంశీ 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టిడిపి టికెట్ మీద గెలిచారు. ఆ తర్వాత వైసీపీలోకి వెళ్లిపోయారు. వైసిపి ప్రభుత్వం అధికారంలో ఉండడంతో వల్లభనేని వంశీ ఇష్టానుసారంగా ప్రవర్తించారని ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా టిడిపి నేతల మీద ఒత్తిడి తీసుకొచ్చారని.. వారిని భయభ్రాంతులకు గురిచేసారని విమర్శలు కూడా ఉన్నాయి. అప్పట్లో టిడిపి కార్యాలయం మీద జరిగిన దాడిలో వంశి కూడా ఉన్నారని సమాచారం. పైగా ఆయన కొద్ది రోజులపాటు జైల్లో కూడా ఉండి వచ్చారు. ఈ నేపథ్యంలో వల్లభనేని వంశీ జైలు నుంచి విడుదలయ్యారు. తీవ్రమైన అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న ఆయన ఆ మధ్య ఆసుపత్రిలో కూడా చేరారు. ప్రస్తుతం ఆరోగ్యంగానే కనిపిస్తున్నారు.
ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నలుపు రంగు జుట్టుతో.. గంభీరమైన మీసాలతో కనిపించేవారు. ఇప్పుడు జుట్టు తెల్ల రంగులోకి మారిపోయింది. గడ్డం పెరిగిపోయింది. ఖద్దరు చొక్కాలు వేసుకునే ఆయన.. రంగుల అంగీలలోకి మారిపోయారు. అదే కాదు సోమవారం మచిలీపట్నం కలెక్టర్ కార్యాలయంలో దర్శనమిచ్చారు. పిజిఆర్ఎస్ అధికారులకు ఆర్జీ కూడా పెట్టుకున్నారు. మల్ల వల్లిలో పంపిణీ సిద్ధంగా ఉన్న 2,400 ఇళ్ల పట్టాలను లగ్గారులకు అందజేయాలని కోరారు. గన్నవరం విమానాశ్రయం విస్తరణలో భూములు కోల్పోయిన రైతులకు అమరావతిలో పట్టాలు ఇవ్వాలని వంశీ విజ్ఞప్తి చేశారు.
గన్నవరం ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ సమస్యలను వంశీ పట్టించుకోలేదు. అమరావతి రాజధాని కి వ్యతిరేకంగా జరిగిన వ్యవహారాలలో వంశీ పరోక్ష పాత్రలు పోషించారని ఇప్పటికి టిడిపి నేతలు ఆరోపిస్తుంటారు. ఇప్పుడు ఎమ్మెల్యే కాదు కాబట్టి.. గన్నవరం ప్రజలు 2024లో తిరస్కరించారు కాబట్టి.. వంశీ మళ్లీ నియోజకవర్గ ప్రజలకు దగ్గరకావడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారని.. అంత ఈజీగా ఆయనను గన్నవరం ప్రజలు నమ్మరని ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు అనుచరులు అంటున్నారు. ఏది ఏమైనప్పటికీ వైసిపి అధికారంలో ఉన్నప్పుడు ఒక దర్జా చూపించిన వంశీ ఇప్పుడు ఇలా మారిపోడాన్ని రాజకీయ విశ్లేషకులు ఆశ్చర్యంగా చూస్తున్నారు.
మచిలీపట్నం కలెక్టర్ కార్యాలయంలో పీజీఆర్ఎస్ లో అధికారులకు అర్జీ అందజేసిన మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ
మల్లవల్లిలో పంపిణీకి సిద్ధంగా ఉన్న 2,400 ఇళ్ల పట్టాలను సత్వరమే లబ్ధిదారులకు అందజేయాలని కోరిన వంశీ
గన్నవరం ఎయిర్ పోర్ట్ విస్తరణలో భూముల కోల్పోయిన రైతులకు అమరావతిలో పట్టాలు… pic.twitter.com/wPU85BWA4j
— Telugu360 (@Telugu360) February 9, 2026