Uttarandhra cabinet minister : ఏపీలో( Andhra Pradesh) కూటమి ఏడాది పాలన పూర్తి చేసుకోనుంది. ఈనెల 4తో కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవుతుంది. గత ఏడాది జూన్ 12న టిడిపి కూటమి అధికారం చేపట్టింది. అయితే ఏడాది పాలన పూర్తి చేసుకున్న నేపథ్యంలో సీఎం చంద్రబాబు మంత్రివర్గ విస్తరణ చేపడతారని పెద్ద ఎత్తున ప్రచారం నడుస్తోంది. దీనికి కారణం లేకపోలేదు. మంత్రివర్గంలో ఒక పదవి ఖాళీగా ఉంది. 25 మంది మంత్రుల గాను అప్పట్లో 24 మందిని మాత్రమే క్యాబినెట్ లోకి తీసుకున్నారు చంద్రబాబు. ఒక మంత్రి పదవిని ఖాళీగా ఉంచారు. అయితే దానిని మెగా బ్రదర్ నాగబాబుతో భర్తీ చేస్తారని ఎప్పటినుంచో ప్రచారం ఉంది. రాజ్యసభ పదవుల సర్దుబాటులో భాగంగా నాగబాబు కు ఛాన్స్ దక్కకుండా పోయింది. దీంతో నాగబాబును క్యాబినెట్ లోకి తీసుకుంటామని స్వయంగా చంద్రబాబు ప్రకటించారు. ఆయన ఎమ్మెల్సీ అయ్యారు. త్వరలో మంత్రివర్గంలోకి చేరుతారని తెలుస్తోంది.
Also Read : ఏపీలో మందుబాబులకు షాక్.. అక్కడ తాగకూడదు!
* పదిమంది కొత్త వారే..
అయితే ఈసారి మంత్రివర్గ( cabinet ) కూర్పు విచిత్రంగా సాగింది. అసెంబ్లీకి కొత్తగా ఎన్నికైన పదిమందిని క్యాబినెట్లోకి తీసుకొని ఆశ్చర్యపరిచారు చంద్రబాబు. జనసేనకు మూడు మంత్రి పదవులు ఇచ్చారు. బిజెపికి సైతం చాన్స్ ఇచ్చారు. అయితే ఏడాదిలో మంత్రివర్గ విస్తరణ చేపడతారని ఎవరూ భావించలేదు. కానీ ఓ ముగ్గురు మంత్రుల పనితీరు బాగాలేదని నివేదికలు చెబుతున్నట్లు తెలుస్తోంది. ఓ ముగ్గురిని మార్చుతారని ఎప్పటినుంచో ప్రచారం ఉంది. అయితే అధికారం చేపట్టి ఏడాది కూడా కాలేదు. వారి పనితీరును ఎలా గుర్తిస్తారు అనేది ఇప్పుడు ప్రశ్న. కానీ సీఎం చంద్రబాబు ఎప్పటికప్పుడు మంత్రులకు ర్యాంకింగులు ఇస్తున్నారు. కొంతమంది మంత్రులకు నేరుగా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. వారి పనితీరులో మార్పు రాకపోవడంతో మంత్రివర్గ విస్తరణలో వారిని మార్చేస్తారని ప్రచారం సాగుతోంది.
* అచ్చెనాయుడు విషయంలో నో డౌట్..
ప్రధానంగా ఉత్తరాంధ్రలో( North Andhra ) ఒక మంత్రి పనితీరు బాగోలేదని తెగ ప్రచారం నడుస్తోంది. అయితే ఎప్పటినుంచో ఈ ప్రచారం ఉంది. ఉత్తరాంధ్రలో తెలుగుదేశం పార్టీ తరఫున నలుగురు మంత్రులు ఉన్నారు. ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి వంగలపూడి అనిత.. ఉమ్మడి విజయనగరం జిల్లా నుంచి కొండపల్లి శ్రీనివాస్, గుమ్మడి సంధ్యారాణి… ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా నుంచి కింజరాపు అచ్చెనాయుడు మంత్రులుగా ఉన్నారు. అయితే ఇందులో ఒకరికి ఉద్వాసన ఖాయమని ప్రచారం నడుస్తోంది. అయితే అచ్చెనాయుడు విషయంలో నో డౌట్. ఆయన ఐదేళ్లపాటు మంత్రిగా ఉంటారు. మిగతా ముగ్గురిలో ఒకరికి ఉద్వాసన ఖాయమన్న ప్రచారం జోరుగా సాగుతోంది.
* చంద్రబాబు అనవసరంగా కెలుక్కుంటారా..
జనసేన నుంచి మెగా బ్రదర్ నాగబాబు( Mega brother Naga babu ) మంత్రివర్గంలో చేరడం ఖాయం. అయితే అది ఇప్పుడే అని చెప్పలేం. ఆయన ఎమ్మెల్సీగా ఎన్నికై నెలలు గడుస్తోంది. ముహూర్తాల మీద ముహూర్తాలు దాటిపోతున్నాయి. ఇప్పుడు జూన్లో శూన్యమాసం ప్రవేశించనుంది. చంద్రబాబుకు సెంటిమెంట్ ఎక్కువ. ఆగస్టులో ముహూర్తాలు ఉన్నాయి కానీ టిడిపికి సెంటిమెంట్. అందుకే మరో ఆరు నెలల వరకు మంత్రివర్గ విస్తరణ ఉండదని తెలుస్తోంది. పైగా జనసేనతో పాటు బిజెపి సైతం ఒక మంత్రి పదవి కోరుతోంది. ఇటువంటి పరిస్థితుల్లో ఆ రెండు పార్టీలకు ఆరు మంత్రి పదవులు వెళ్తాయి. టిడిపికి 19 మంది మంత్రులు మాత్రమే ఉంటారు. అందుకే అనవసరంగా ఎందుకని ఇప్పట్లో చంద్రబాబు మంత్రివర్గ విస్తరణ జోలికి వెళ్లరని టిడిపి వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి.