Civil 2021 Rankers In Telugu States: మన దేశంలో అత్యున్నత సర్వీసులు ఐఏఎస్ అని తెలిసిందే. వీరు దేశంలో ఎక్కడైనా పనిచేయాల్సి ఉంటుంది. దీంతో సివిల్సి సాధించాలనేది ప్రతి ఒక్కరి ఆశ. అందుకే అందరు కేంద్ర సర్వీసులో ఉద్యోగం సాధించాలని సర్వ శక్తులు ఒడ్డుతారు. ఎంతో శ్రమించి అనుకున్న లక్ష్యాన్ని నెరవేర్చుకుంటారు. ఒక తపస్సులా బావించి సివిల్స్ కు ప్రిపేర్ అవుతుంటారు. రోజుకు కనీసం పదిహేను గంటల నుంచి పద్దెనమిది గంటలు చదువులోనే ఉండటం విశేషం. అంతటి ప్రతిభావంతమైన సివిల్స్ లో ఉద్యోగం రావడం నిజంగా అదృష్టమే. దీని కోసం ఎందరో కలలు కంటుంటారు.

ఇటీవల ప్రకటించిన 2021 సివిల్స్ ఫలితాల్లో మన తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు ఉండటం గమనార్హం. దీంతో వారి సంతోషానికి అవధులు లేకుండా పోతున్నాయి. అకుంఠిత దీక్ష, కఠోర శ్రమ వంటి చర్యలతోనే వారు అనుకున్నది సాధించారు. గుర్తింపు పొందారు. ఈ నేపథ్యంలో సివిల్స్ సర్వీసుల కోసం అహర్నిశలు శ్రమించి అనుకున్నది తమ సొంతం చేసుకున్నారు. సివిల్స్ ఫలితాల్లో మన తెలుగతేజాలు ఉండటం మనకు గర్వకారణమే.
Also Read: Jagan Politics Konaseema Issue: కోనసీమ పరిష్కారమా? దోషిగా జనసేనాననా?
వరంగల్ జిల్లాకు చెందిన బొక్క చైతన్య రెడ్డి 161వ ర్యాంకు సాధించారు. ఆయన తండ్రి డీసీవోగా పనిచేస్తున్నారు. ప్రస్తుతం చైతన్య నీటిపారుదల శాఖలో ఏఈగా పనిచేస్తున్నారు. సివిల్స్ ర్యాంకు సాధించడంపై హర్షం వ్యక్తం చేశారు. తన జీవితాశయం నెరవేరిందని ఆశాబావం వ్యక్తం చేశారు. ప్రజలకు సేవ చేసే అవకాశం ఉన్న ఉద్యోగం కావడంతో నిస్వార్థంగా సేవలందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెబుతున్నారు మొత్తానికి చైతన్య తన లక్ష్యం నెరవేరినందుకు సంతోషంగా ఉన్నారు.

తిరుమాని శ్రీపూజ సివిల్ సర్వీస్ లో అఖిల బారత స్థాయిలో 62వ ర్యాంకు సాధించింది. ఆమె తండ్రి వెంకటేశ్వర్లు. పంచాయతీరాజ్ శాఖలో పనిచేస్తున్నారు. శ్రీపూజది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని భీమవరం మండలం దొంగపిండి గ్రామం. శ్రీపూజ కూడా సివిల్ సర్వీస్ కు ఎంపిక కావడంపై అందరు హర్షం వ్యక్తం చేస్తున్నారు. భారతదేశంలో ప్రజల కష్టాలు తీర్చే అత్యున్నత ఉద్యోగం సాధించడంపై ఆమె సంతోషపడుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి సివిల్స్ కు ఎంపిక కావడంపై ప్రజలు కూడా తమకు సంతోషంగా ఉందని చెబుతుండటం విశేషం.
Recommended Videos:
[…] […]