AP Rains: ఏపీకి( Andhra Pradesh) చల్లటి కబురు వచ్చింది. ఈ నెలలో రాష్ట్రంలో వర్షాలు పడే అవకాశం ఉంది. బంగాళాఖాతంలో రెండు అల్పపీడనాలు ఏర్పడతాయని వాతావరణ శాఖ చెబుతోంది. ప్రస్తుతం హిందూ మహాసముద్రం, ఆగ్నేయ బంగాళాఖాతం పరిసర ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఈ ప్రభావంతో ఈ నెల 15 నాటికి అల్పపీడనం ఏర్పడే ఛాన్స్ కనిపిస్తోంది. బంగాళాఖాతంలో ఈనెల 19 తర్వాత ఉపరితల ఆవర్తనం లేదా అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. వీటి ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు పడే పరిస్థితి ఉంది. ప్రధానంగా దక్షిణ కోస్తాకు వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. రాయలసీమలో సైతం వర్షాలు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.
* చలి తీవ్రత..
ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా చలి తీవ్రత కొనసాగుతోంది. ఇంకా చలి తగ్గడం లేదు. శివరాత్రి తరువాత చలి తగ్గుముఖం పట్టి పరిస్థితి కనిపిస్తోంది. అయితే శని, ఆదివారాల వరకు చలి తీవ్రత అలానే కొనసాగనుందట. అదే సమయంలో ఎండల తీవ్రత సైతం పెరుగుతోంది. రాష్ట్రంలో 30 నుంచి 35 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. చలి తీవ్రత తగ్గక ముందే ఎండలు మండిపోతున్నాయి. ఇటీవల నెల్లూరు జిల్లా కావలిలో ఏకంగా 35 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. పశ్చిమగోదావరి, బాపట్ల,ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుంచి నాలుగు డిగ్రీలు పెరిగాయి. దక్షిణ కోస్తాలో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. అదే సమయంలో రాత్రిపూట చలి తీవ్రత అధికంగా ఉంది.
* అకాల వర్ష సూచన
అయితే ఫిబ్రవరిలో( February ) అకాల వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ ముందుగానే హెచ్చరించింది. అందుకు తగ్గట్టుగానే ఇప్పుడు ఫిబ్రవరిలో రెండు ఉపరితల ఆవర్తనాలు ఏర్పడనున్నాయని స్పష్టం అవుతుంది. అరేబియా సముద్రంలో ఎల్ నినో ప్రభావంతో ఉపరితల ఆవర్తనాలు కొనసాగనున్నాయి. అయితే ప్రధానంగా తమిళనాడు తో పాటు రాయలసీమ పై ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. దక్షిణ కోస్తా పై కూడా ప్రభావం చూపనుంది. వేసవి ప్రారంభంలో వర్షాలు పడడం ప్రజలకు ఉపశమనం కలిగించే విషయం.