Undavalli Arun Kumar: సమకాలిన రాజకీయ అంశాలపై యాక్టివ్ గా ఉంటారు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్( Undavalli Arun Kumar) . తాను చెప్పాల్సిన అభిప్రాయాన్ని కుండ బద్దలు కొట్టినట్లు చెబుతారు. తాజాగా మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ఆయన జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో మాజీ ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల పై కేసులను తప్పుపట్టారు. వారి అరెస్టులపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ముంబై కేసును ఏపీలో విచారించడం సరికాదన్నారు. ఉగ్రవాదం పై కేంద్రం చర్యలను సమర్ధించాలని కోరారు. మత విద్వేషాలను రెచ్చగొట్టవద్దని సూచించారు. అయితే ప్రస్తుత కక్ష సాధింపు చర్యలు జగన్మోహన్ రెడ్డి పుణ్యం అని అర్థం వచ్చేలా మాట్లాడారు ఉండవల్లి అరుణ్ కుమార్.
Also Read: కూటమిపై విష ప్రచారం.. ప్రత్యేక బృందం వ్యూహం!
* కక్ష సాధింపులు వద్దన్నా..
2019లో వైయస్సార్ కాంగ్రెస్ ( YSR Congress ) అధికారంలోకి వచ్చింది. జగన్ ముఖ్యమంత్రి అయిన వెంటనే కక్ష సాధింపు చర్యలకు దిగవద్దని సూచించిన విషయాన్ని గుర్తు చేశారు. ఏపీ పునర్విభజన చెల్లదని సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన విషయాన్ని కూడా ప్రస్తావించారు. పవన్ కళ్యాణ్ ఈ విషయంలో ఒక ఆశాజ్యోతి అని అభివర్ణించారు. జగన్ తప్పు చేస్తే ఆయనను జైల్లో పెట్టాలే కానీ.. ఆయన హయాంలో పనిచేసిన పోలీసులను జైల్లో పెట్టకూడదన్నారు. చాలామంది ఐపీఎస్, ఐఏఎస్ అధికారులు తనకు స్నేహితులుగా ఉన్నారని.. వారిలో మాజీ ఇంటలిజెన్స్ చీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయులు ఒకరని.. అందుకే జైలులో ఉన్న ఆయనను కలిసినట్లు చెప్పుకొచ్చారు ఉండవెల్లి అరుణ్ కుమార్. పీజీ స్థాయి అధికారిని జైల్లో పెట్టడం ఇదే మొదటిసారి అని వ్యాఖ్యానించారు.
* ఆ కేసును ఎలా విచారిస్తారు..
ముంబై నటి( Mumbai actor) ఫిర్యాదు పై అక్కడ కేసు పరిష్కారం కాకుండా ఏపీలో ఎలా విచారణ ప్రారంభిస్తారని ప్రశ్నించారు. పి ఎస్ ఆర్ అరెస్టు పోలీస్ శాఖపై చాలా ప్రభావం చూపుతోందని.. తాను మరి కొంతకాలం జైల్లో ఉండడానికి మానసికంగా సిద్ధంగా ఉన్నానని ఆయన తనతో చెప్పిన విషయాన్ని కూడా చెప్పుకొచ్చారు. ఈ కేసుకు సంబంధించి ముంబైలో పూర్తి సమాచారాన్ని సేకరించి త్వరలో మరిన్ని వివరాలు వెల్లడిస్తానన్నారు. ఏపీ పునర్విభజన చల్లదని సుప్రీంకోర్టులో పిటిషన్ వేశానని ఉండవల్లి అరుణ్ కుమార్ తెలిపారు. ఈ పిటిషన్ వేసి 11 ఏళ్లు పూర్తయిందని గుర్తు చేశారు. అందుకే చేర్పులు మార్పులు చేసి మళ్లీ పిటిషన్ వేసినట్లు చెప్పారు. 2014 ఫిబ్రవరి 18న పార్లమెంట్లో బిల్లు పాస్ కాకుండానే ఏపీ విభజన చేశారని సంచలన ఆరోపణలు చేశారు. ఏపీ ప్రభుత్వం ఒక సీనియర్ న్యాయవాదిని ఏర్పాటు చేసి సుప్రీంకోర్టులో కేసును పర్యవేక్షించాలని కోరారు. ఈ కేసును ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒక ఆశాజ్యోతి అన్నారు. పవన్ కళ్యాణ్ కు ఈ విషయంపై లేఖ రాశాను అని కూడా గుర్తు చేశారు.
* కేంద్రం చర్యలను సమర్థించాలి..
ఉగ్రవాదుల విషయంలో కేంద్ర ప్రభుత్వం( central government) తీసుకుంటున్న చర్యలను అందరూ సమర్థించాలని కోరారు ఉండవెల్లి అరుణ్ కుమార్. భారత్ తో యుద్ధం చేసే శక్తి పాకిస్తాన్ కు లేదని.. యుద్ధం జరిగితే పాకిస్తాన్ నష్టపోతుందని అభిప్రాయపడ్డారు. మనదేశంలో మొత్తం ప్రధానమనేది సరికాదని.. ఇండియాలో 12% ముస్లింలు ఉన్న విషయాన్ని గుర్తు చేసుకోవాలన్నారు. పాకిస్తాన్లో హిందువులు ఒక్క శాతం మాత్రమే ఉన్నారన్నారు. ముస్లింలపై వ్యతిరేకత సరికాదని.. పాకిస్తాన్ పై మాత్రం వ్యతిరేకించాలన్నారు.
Also Read: జగన్ కు ముందే జిల్లాల పర్యటన.. షర్మిల స్కెచ్ అదే!