Third Marriage : ప్రపంచంలో నిత్యం అనేక వింతలు జరుగుతుంటాయి. అలాంటి వింతే ఓ భర్తకు జరిగింది. పరాయి మహిళను కన్నెత్తి చూస్తేనే భార్యలు సహించరు. మరొకరితో చనువుగా ఉంటే చీల్చి చెండాడుతారు. కానీ, ఆ భక్తకు ఎంతోమందికి రాని అదృష్టం వచ్చింది. భార్య రెండో పెళ్లికి ఒప్పుకుంది. తర్వాత ఇద్దరు భార్యలు కలిసి మూడో పెళ్లికీ సిద్ధమయ్యారు. అంతేకాదు దగ్గరుండి మరీ పెళ్లి శుభలేఖలు పంచుతూ మా ఆయన పెళ్లికి రండి అని బంధుమిత్రులను ఆహ్వానిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో విచిత్ర ఘటన
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అల్లూరి జీతారామరాజు జిల్లా కించూరు గ్రామానికి చెంది సాగేని పండన్నకి పార్వతమ్మతో మొదటి పెళ్లి జరిగింది. ఆ తర్వాత ఆమెను ఒప్పించి అప్పలమ్మ అనే ఆమెని రెండో వివాహం చేసుకున్నాడు. ఇద్దరు భార్యల ముద్దుల మొగుడిగా ఉంటూ సంసార సాగరాన్ని ఈదుతున్నాడు. పండన్న సంసారం ఇద్దరు భార్యలతో హ్యాపీగా సాగిపోతుంది. ఈ క్రమంలో పండన్న జీవితంలోకి లక్ష్మి అనే మహిళ వచ్చింది. పండన్న ఆమెపై మనసు పారేసుకున్నారు. పెళ్లి చేసుకునేందుకు సిద్ధమయ్యారు. ఇదే విషయాన్ని తన భార్యలిద్దరికీ చెప్పాడు. వాళ్లు కూడా సరే అన్నారు. దీంతో మూడో పెళ్లికి ఇద్దరు భార్యలు పెళ్లి పెద్దలుగా మారారు. పండన్నకు అమ్మానాన్న లేకపోవడంతో భార్యలే లక్ష్మి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. పెళ్లికి ముహూర్తం పెట్టారు.
శుభలేఖలు ముద్రించి..
లక్ష్మి ఇంట్లో వాళ్లు కూడా పండన్నతో పెళ్లికి ఒప్పుకున్నారు. వివాహం నిశ్చయం కావడంతో ముహూర్తం పెట్టి శుభలేకలు అచ్చువేయించారు. పార్వతమ్మ, అప్పలమ్మ ఇద్దరూ తమ భర్త మూడో పెళ్లికి ఆహ్వానిస్తున్నట్లు శుభలేఖలో ముద్రించారు. మీ రాకను ప్రేమతో ఆహ్వానిస్తున్నామని ముద్రించారు. ఈ వివాహం జూన్ 25న ఉదయం 10 గంటలకు జరిపించారు. నవ వధువు లక్ష్మి తరపు బంధువులు, పాత వరుడు పండన్న బంధు మిత్రులు, గ్రామ పెద్దలు వచ్చి దంపతులను ఆశీర్వదించారు. ఈ పెళ్లి కార్డు ఇప్పుడు బయటకు రావడంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎంత లక్కీ మామ నువ్వు.. ఇలాంటి భార్యలు ఉంటే నిత్యపెళ్లికొడుకులా ఉండచ్చు అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.