Tuni incident: తుని ప్రాంతంలో బాలికపై జరిగిన దారుణానికి సంబంధించి వెలుగులోకి మరో సంచలన నిజం వచ్చింది. ఈ ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న నారాయణరావు చెరువులో దునికి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. బాలికపై దారుణం వెలుగులోకి వచ్చిన తర్వాత.. ఆ వీడియో సోషల్ మీడియాలో సంచలనం సృష్టించిన తర్వాత.. పోలీసులు నారాయణను అదుపులోకి తీసుకున్నారు. ఇది రాజకీయంగా పెను దుమారాన్ని రేపడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, హోం శాఖ మంత్రి అనిత, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తీవ్రగస్వాధ్యక్షుడు పోలీసులు నిందితుడిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.
నిందితుడిని అరెస్ట్ చేసిన తర్వాత మేజిస్ట్రేట్ ఎదుట హాజరపరచడానికి పోలీసులు బుధవారం అర్ధరాత్రి తీసుకెళ్తుండగా.. అతడు మూత్ర విసర్జన కోసం వెళ్లాలని పోలీసులను కోరడంతో.. సమీపంలో ఉన్న చెరువు దగ్గర ఆపారు. పోలీసుల కళ్ళు కప్పి నారాయణ చెరువులోకి దూకాడు. అప్రమత్తమైన పోలీసులు అతని గురించి గాలింపు చర్యలు చేపట్టారు. అతని ఆచూకీ లభించకపోవడంతో.. గురువారం ఉదయం కూడా గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టారు. చివరి అతని మృతదేహం కనిపించింది. దీంతో పోలీసులు శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించినట్లు తెలుస్తోంది.
నారాయణ చనిపోయిన తర్వాత ఓ నిజం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. తుని గురుకులంలో చదువుతున్న ఆ బాలిక కు తండ్రి లేడని తెలుస్తోంది. దీంతో తల్లి ఆ బాలికను గురుకుల పాఠశాలలో చేర్పించినట్టు తెలుస్తోంది. ఈ విషయం తెలిసిన నారాయణ ఆమెను పలుమార్లు గురుకుల పాఠశాలకు వెళ్లి తనతో పాటు తీసుకెళ్లినట్టు సమాచారం. ఇలా నాలుగైదు సార్లు తీసుకెళ్లి ఆమె పై దారుణానికి పాల్పడినట్లు సమాచారం. అందువల్లే ఎప్పటిలాగే బుధవారం కూడా నారాయణ గురుకులానికి వెళ్లి ఆ బాలికను బయటికి తీసుకెళ్లాడు. సపోటా తోటలో దారుణానికి పాల్పడ్డాడు. ఈసారి సపోటా తోట యజమాని ఆ వ్యవహారం మొత్తాన్ని వీడియో తీయడంతో అతడి దుర్మార్గం వెలుగులోకి వచ్చింది. భారత చట్టాల ప్రకారం నిర్ణీత వయసు వస్తేనే.. అది కూడా అమ్మాయిల అంగీకారంతోనే పురుషులు లైంగిక చర్యలకు పాల్పవచ్చు. అలా కాకుండా మైనారిటీ తీరని అమ్మాయిలపై దారుణాలకు పాల్పడితే దానిని అత్యాచారం గానే న్యాయస్థానాలు పరిగణిస్తాయి.