TTD: శ్రీవారి( Lord Venkateswara) దర్శనానికి వచ్చే భక్తుల కోసం టీటీడీ కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. సామాన్య భక్తులు సైతం స్వామివారిని దర్శించుకునే వీలుగా ఏర్పాట్లు చేస్తోంది. అయితే దర్శనాన్ని మరింత సులభం గా జరిగేలా మార్పులు చేస్తోంది. మరోవైపు అన్న ప్రసాదంలో నాణ్యత పెంచాలని భావిస్తోంది. మరో పదార్థం చేర్చాలని కూడా నిర్ణయించింది. తిరుమలలో ఉన్న వ్యక్తుల పేర్లతో ఉన్న అతిథి గృహాలను.. ఆధ్యాత్మిక, ధార్మిక పేర్లుగా మార్పు చేస్తోంది. సాధారణంగా వేసవిలో స్వామివారిని ఎక్కువమంది భక్తులు దర్శించుకుంటారు. వేసవి సెలవులు కావడంతో.. ఆ సమయంలో టీటీడీ టూర్ ప్లాన్ చేసుకుంటారు ఎక్కువమంది. ఈ నేపథ్యంలో ఏప్రిల్ నెలకు సంబంధించి ప్రత్యేక ప్రవేశ దర్శనం, వసతి టోకెన్లను ఈరోజు టిటిడి విడుదల చేయనుంది. ఇప్పటికే ఏప్రిల్ నెలకు సంబంధించి శ్రీవారి ఆర్జిత సేవా టిక్కెట్లను విడుదల చేశారు.
* ఉచిత ప్రత్యేక దర్శన టికెట్లు జారీ
మరోవైపు వయోవృద్ధులు( old age persons ), దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా.. మార్చి నెలకు సంబంధించి ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్లను సైతం టీటీడీ అధికారులు విడుదల చేశారు. ఏప్రిల్ నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ ద్వారదర్శన టికెట్ల కోటాను ఈరోజు 10 గంటలకు టీటీడీ ఆన్లైన్ లో విడుదల చేసింది. ఇదే సమయంలో తిరుమల, తిరుపతిలో ఏప్రిల్ నెల గదుల కోటాను ఈరోజు మధ్యాహ్నం మూడు గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనుంది. భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తిరుమల తిరుపతి ట్రస్ట్ బోర్డు ఒక ప్రకటనలో కోరింది.
* అతిథి గృహాల పేర్లు మార్పు
ఇప్పటికే తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డు కీలక నిర్ణయాలు తీసుకున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా వ్యక్తుల పేర్ల మీద ఉన్న అతిథి గృహాలను( guest houses) ఆధ్యాత్మిక, ధార్మిక పేర్లుగా మార్చాలని నిర్ణయం తీసుకున్న సంగతి విధితమే. అందులో భాగంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ప్రశాంతి దంపతుల విరాళంతో నిర్మించిన విపిఆర్ భవనం పేరును లక్ష్మీ భవన్ గా మార్పు చేశారు. అదేవిధంగా 45 భవనాల పేరు మార్పు పైన దాతలు అంగీకరించారు. ఇక తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటనపై ప్రభుత్వం న్యాయ విచారణ కోసం హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తిని నియమించిన సంగతి తెలిసిందే. మరో వారం రోజుల్లో విచారణ మొదలుకానుంది. ఆరు నెలల్లో నివేదికను ఇవ్వాల్సి ఉంటుంది.
* మొన్నటి ఘటనతో
అయితే మొన్నటి ఘటనతో టీటీడీలో( TTD) ఒక రకమైన కలవరం ప్రారంభం అయింది. అందుకే ముందస్తు చర్యలు చేపట్టింది. గత పరిస్థితులు పునరావృత్తం కాకుండా అన్ని చర్యలు చేపడుతోంది. వాస్తవానికి టీటీడీలో సమూలం ప్రక్షాళన చేయాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. కానీ దురదృష్టవశాత్తు మొన్న తొక్కిసలాట ఘటన చోటుచేసుకుంది. టీటీడీ చరిత్రలోనే పెను విషాదంగా మారింది. అందుకే ఎప్పటికప్పుడు ప్రభుత్వం సైతం టీటీడీపై దృష్టి పెడుతోంది. టీటీడీలో సమూల మార్పులను తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తోంది.