Karimnagar : లంచావతారులు సెరుగుతున్నారు. భారత దేశం అభివృద్ధికన్నా.. అవినీతిలో వేగంగా పురోగతి సాధిస్తోంది. దీంతో ప్రతీ శాఖలో లంచావతారులు పుట్టుకొస్తున్నారు. ఇందు కలదు.. అందు లేదనేది లేకుండా అన్ని శాఖల్లో ఈ లంచావతారులు తయారవుతున్నారు. సామాన్యులను, సాయం కోసం వచ్చే వారిని పీడిస్తున్నారు. తాజాగా కరీంనగర్ జిల్లాలో ఓ సీఐ లంచం తీసుకుని లంచం ఇచ్చిన వ్యక్తిపై కేసు పెట్టడం సంచలనంగా మారింది. కేసు పెట్టినందుకు సీఐకే బాధితుడు వార్నింగ్(Warning) ఇచ్చాడు. జమ్మికుంట టౌన్ సీఐ, సామాజిక కార్యకర్త షేక్ సాబీర్ అలీతో డబ్బుల విషయమై మాట్లాడిన ఆడియో సోషల్ మీడియాలో చెక్కర్లుకొడుతోంది. సదరు ఆడియోలో ఎస్సీ,ఎస్టీ కేసులో సీఐకి రూ.3 లక్షలు లంచంగా సీఐ ఛాంబర్‌లోని వాష్‌రూంలో అందజేసినట్లు ఉంది. తాజాగా సీఐతో మాట్లాడిన మాటలు సామాజిక కార్యకర్త షేక్ సాబీర్ విడుదల చేశారు. ’జెర్రంశెట్టి కృష్ణారావు, గోవిందరెడ్డి, మర్రుతో పాటు ఎస్‌ఆర్కే డెయిరీ చైర్మన్ బండారు మాధురి మధ్య ఉన్న వివాదాల్లో మధ్యవర్తిత్వం కోసం కృష్ణారావు) నన్ను ఆశ్రయించారు. అక్టోబర్ 28 నుంచి 30 వరకు వివాదం పరిష్కారం కోసం సీఐ రవితో మాట్లాడడం జరిగింది. కృష్ణారావుపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయవద్దంటే రూ.3 లక్షలు లంచం ఇవ్వాలని సీఐ డిమాండ్ చేశాడు. బాధితులతో మాట్లాడి రూ.3 లక్షలు తీసుకొచ్చి సీఐ వద్దకు వెళ్లాను. డబ్బులను వాష్‌రూంలోని బకెట్‌లో పెట్టాలని సూచించాడు. డబ్బులు తీసుకున్న తర్వాత కృష్ణారావుపైనే కేసు నమోదు చేశాడు అని ఆ ఆడియోలో ఉంది.
సీఐకి ఫోన్ చేసి…
కేసు నమోదు కావడంతో డిసెంబర్ 30న సీఐకి ఫోన్ చేసిన సాబీర్ రూ.3 లక్షలు తీసుఉని బాధితుడిపైనే కేసు ఎలా పెడతారు అని అడిగాడు. దీంతో సీఐ తడబడ్డాడు. పైసలు తీసుకోలేదని మాత్రం చెప్పలేదు. డబ్బులు ఇచ్చేటప్పుడు స్పై కెమెరాలో రికార్డు చేశానని చెప్పడంతో నిన్ను నమ్మడం తప్పా అని ఆడియోలో సీఐ అన్నాడు. తర్వాతరోజు సాయంత్రం 7 గంటలకు మారేపల్లి రాజుతో రోడ్డుపై నడిచి వెళ్తుండగా మొబైల్‌నుæ పల్సర్ బైక్‌మీద వచ్చిన ఇద్దరు ప్రైవేటు వ్యక్తులు లాక్కుని పోయారని తెలిపాడు. అప్పటికే ఆడియోను మిత్రులకు షేర్ చేశానన్నాడు. గతంలో ప్రశ్నించినందుకు తనపై తప్పుడు కేసులు పెట్టారని తెలిపాడు. బాధితులను బెదిరించి డబ్బులు ఇవ్వలేదని చెప్పే అవకాశం ఉందని, తనపై తప్పుడు కేసులు కూడా పెడతాడని వెల్లడించారు. పోలీస్ ఉన్నతాధికారులు పోలీస్ స్టేషన్ సీసీ కెమెరా ఫుటేజీలు అక్టోబర్ 28 నుంచి 30 వరకు పరిశీలిస్తే అసలు విషయం బయట పడుతుందని వెల్లడించాడు.
పోలీసుల మౌనం..
బాధితుడు ఆడియో, వీడియో విడుదల చేసినా పోలీసులు స్పందించకపోవడం అనుమానాలకు తావిస్తోంది. లీకైన ఆడియోలో సాబీర్ సీఐని ఏకవచనంతో సంబోధించడం, సీఐ మాత్రం స్టేషన్‌కు రా మాట్లాడుకుందాం అంటూ రిక్వెస్ట్ చేయడం.. నిన్ను నమ్మడం తప్పా అని సీఐ అనడంలో ఆంతర్యం ఏంటా అని జిల్లాలో చర్చ జరుగుతోంది.