TTD: తిరుమలలో భక్తుల సౌకర్యార్థం టీటీడీ కట్టిన నిర్ణయాలు తీసుకుంటోంది. తిరుమల వచ్చే భక్తుల సౌకర్యాలపై ప్రత్యేకంగా ఫోకస్ చేసింది. తిరుమలలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచిత ప్రయాణం కల్పిస్తోంది. ఉచిత బస్సు సౌకర్యం అందుబాటులోకి తీసుకొచ్చింది. పవిత్ర పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న తిరుమలలో కాలుష్య రహిత చర్యలు చేపట్టింది. అందులో భాగంగా విద్యుత్ తో నడిచే బస్సులను తిప్పాలని ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే 50 ఎలక్ట్రిక్ బస్సులు తిరుమలలో తిరుగుతున్నాయి. మరో 350 బస్సులు విడతల వారీగా రానున్నాయి. కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాల ప్రజా రవాణాకుగాను ఎలక్ట్రిక్ బస్సులు అందించాలని నిర్ణయించింది. అందులో భాగంగా తిరుమల అవసరాల కోసం 300 బస్సులు కేటాయించింది. ఇది నిజంగా భక్తులకు శుభవార్త.
Also Read: ఆంధ్రజ్యోతిలో టార్చర్.. చనిపోతానంటూ రిపోర్టర్ వీడియో వైరల్
* ప్రధానమంత్రి ఈ బస్సు పథకం
ప్రధానమంత్రి ఈ బస్సు సేవా పథకం( Prime Minister e-bus scheme ) కింద పెద్ద ఎత్తున ఎలక్ట్రిక్ బస్సులను మంజూరు చేస్తోంది. ఈ తరుణంలో ప్రపంచవ్యాప్తంగా లక్షలాదిమంది భక్తులు వచ్చే తిరుమల విషయంలో కూడా కేంద్రం ఉదారంగా వ్యవహరిస్తోంది. తిరుపతి బస్టాండ్ ఆధునీకరణ పనులు.. పెద్ద ఎత్తున సౌకర్యాలు కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం అని చర్యలు చేపడుతోంది. ఇప్పుడు తిరుమల వచ్చే భక్తుల కోసం ఏకంగా 3 ఎలక్ట్రిక్ బస్సులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రస్తుతానికి 50 బస్సులు అందుబాటులోకి వచ్చాయి. వాటిని టీటీడీ అధికారులు ప్రారంభించారు. నిత్యం లక్షలాది మంది భక్తులు తిరుమల వస్తుంటారు. రవాణా కోసం ఇబ్బందులు పడుతుంటారు. అటువంటి వారికి ఇబ్బందులు లేకుండా భారీగా ఎలక్ట్రిక్ బస్సులను నడపాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది.
* మరో 300 బస్సులు
భవిష్యత్తులో తిరుమలకు మరో 300 ఎలక్ట్రిక్ బస్సులు( Electric buses ) రానున్నాయి. తిరుమల డిపోనకు 150, అలిపిరి డిపోనకు 50, తిరుపతి ఇంట్రా మోడల్ బస్సు స్టేషన్ నిర్మాణంలో భాగంగా కేటాయించి డిపోనకు 50, శ్రీకాళహస్తి- తిరుపతి మధ్యలో మరో 50 బస్సులు నడిపేలా ప్లాన్ చేస్తున్నారు. దీంతో తిరుమలలో 150 ఎలక్ట్రిక్ బస్సులకు అవసరమైన చార్జింగ్ స్టేషన్లు, ఇతర సాంకేతిక ఏర్పాట్లకు వీలుగా ఐదు ఎకరాల స్థలం అవసరం ఉందని అంచనా వేశారు. తిరుపతి సెంట్రల్ బస్ స్టేషన్ ను మరింత కమర్షియల్ అంశాలతో అభివృద్ధి చేసేందుకు ప్రణాళిక రూపొందించారు.
* స్కేవే ఏర్పాటు..
మరోవైపు తిరుపతిలో( Tirupati) స్కే వే సిద్ధం కానుంది. తిరుపతి బస్సు టర్మినల్ నుంచి రైల్వే స్టేషన్ వరకు దీనిని నిర్మించనున్నారు. దాదాపు 500 కోట్ల రూపాయలతో జి ప్లస్ 10 అంతస్తులతో భవన నిర్మాణం చేపట్టనున్నారు. కొత్త హంగులతో తిరుపతి బస్సు స్టేషన్ ఇంటిగ్రేటెడ్ బస్సు టెర్మినల్ గా మారబోతోంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళిక రూపొందించింది. 13 ఎకరాల్లో ఉన్న తిరుపతి బస్సు స్టేషన్లో ప్రస్తుతం 66 ప్లాట్ఫార్మ్ లు ఉన్నాయి. రోజుకు సగటున 1.60 లక్షల మంది రాకపోకలు సాగిస్తుంటారు.