https://oktelugu.com/

Tirumala : తిరుమల దర్శనాలపై కీలక నిర్ణయం తీసుకున్న టీటీడీ (ttd) చైర్మన్.. అవి రద్దు

తిరుమలలో రేపు విఐపి బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తూ టీటీడీ (ttd) కీలక నిర్ణయం తీసుకుంది. స్వామి వారి వైకుంఠ ద్వార దర్శనాలు నేపథ్యంలో రేపు కీలక ఘట్టం జరగనుంది.

Written By:
  • Dharma
  • , Updated On : January 6, 2025 / 04:15 PM IST

    TTD Break Dharshans Cancel Tomorrow

    Follow us on

    Tirumala :  వైకుంఠ ఏకాదశి వేడుకలకు తిరుమల ముస్తాబవుతోంది. టీటీడీ (Ttd) ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు చేస్తోంది. ఈనెల 10 నుంచి స్వామివారి ఉత్తర ద్వారా దర్శనం ప్రారంభం కానుంది. ఈనెల 19 వరకు కొనసాగనుంది. ఇప్పటికే ఆన్లైన్లో టోకెన్ల జారీ ప్రక్రియ పూర్తయింది. కొన్ని గంటల వ్యవధిలోనే టోకెన్ల విక్రయాలు పూర్తయ్యాయి. మరోవైపు ఆఫ్ లైన్ లో టోకెన్ల విక్రయానికి 96 కౌంటర్లు ఏర్పాటు చేశారు. సాధారణ రోజులు కంటే అధికంగా భక్తులు వస్తారని టీటీడీ (ttd) అంచనా వేస్తోంది. అందుకు తగ్గట్టు ఏర్పాట్లు చేస్తోంది. మరోవైపు ఈనెల 7 మంగళవారం కోయిల్ ఆల్వార్ తిరుమంజనం జరగనుంది. దీంతో భక్తులు భారీగా తరలివస్తుండడంతో బ్రేక్ దర్శనాలను రద్దు చేసింది టిటిడి. మరోవైపు వైకుంఠ ద్వార దర్శనాలపై టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు (br naidu) కీలక ప్రకటన చేశారు. టోకెన్లు, టికెట్లపై నిర్దేశించిన సమయం ప్రకారం మాత్రమే భక్తులకు దర్శనం కల్పిస్తామని టీటీడీ చైర్మన్ స్పష్టం చేశారు. తిరుమలలో జరుగుతున్న ఏర్పాట్లను ఆయన సమీక్షించారు.

    * పక్కాగా ఏర్పాట్లు
    గత అనుభవాల దృష్ట్యా తిరుమల తిరుపతి దేవస్థానంలో పక్కాగా ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. ఈ విషయంలో అన్ని రకాల చర్యలు చేపడుతున్నారు. అన్ని శాఖలు సమన్వయంతో ముందుకు సాగుతున్నాయి. సాధారణంగా శ్రీవారి ఆలయంలో ఏడాదికి నాలుగు సార్లు కోయిల్ అళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు మంగళవారం ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. మంగళవారం ఉదయం 6 నుంచి 10 గంటల వరకు ఆలయ శుద్ధి కార్యక్రమాలను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. ఆనంద నిలయం మొదలుకొని బంగారు వాకిలి వరకు, శ్రీవారి ఆలయం లోపల ఉప దేవాలయాలు, ఆలయ ప్రాంగణం, పోటు, గోడలు, పూజ సామాగ్రి తదితర వస్తువులను నీటితో శుభ్రంగా కడుగుతారు. ఈ సమయంలో స్వామివారి మూలవిరాట్ ను వస్త్రంతో పూర్తిగా కప్పుతారు. ఆలయ సంప్రోక్షణ చేసి.. స్వామివారిని అందంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తారు. ఈ కారణంగానే రేపు విఐపి బ్రేక్ దర్శనాలను రద్దు చేసింది టిటిడి దేవస్థానం.

    * టోకెన్ల జారీకి కౌంటర్ల ఏర్పాటు
    స్వామివారి ఉత్తర ద్వార దర్శనానికి సంబంధించి.. ఆఫ్లైన్లో టోకెన్ల జారీ ప్రక్రియను చేపట్టనున్నారు. తిరుమల తో పాటు తిరుపతిలో కౌంటర్లను ఏర్పాటు చేశారు. భక్తులు నేరుగా వెళ్లి టోకెన్లను కొనుగోలు చేయవచ్చు. ఇప్పటికే తిరుమల వచ్చే భక్తుల భద్రత కోసం పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించింది. అటు మిగతా శాఖలు సైతం తమ సేవలను అందించనున్నాయి. ఉత్తర ద్వార దర్శనానికి సంబంధించి భారీగా భక్తులు వస్తుండడంతో.. తిరుమల రద్దీగా మారుతోంది. ప్రధానంగా 10,11,12 తేదీల్లో భక్తుల తాకిడి అధికంగా ఉంటుందని టిటిడి (ttd)అంచనా వేస్తోంది. అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేస్తోంది.