Homeఆంధ్రప్రదేశ్‌Tornadoes in Andhra Pradesh: ఏపీలో టోర్నడోలు.. చూస్తుండగానే బీభత్సం. .. ముప్పు ఏమైనా పొంచి...

Tornadoes in Andhra Pradesh: ఏపీలో టోర్నడోలు.. చూస్తుండగానే బీభత్సం. .. ముప్పు ఏమైనా పొంచి ఉందా?

Tornadoes in Andhra Pradesh: సాధారణంగా టోర్నడోలు ఎక్కడో విదేశాలలో చోటుచేసుకుంటాయి. అమెరికా వంటి దేశాలలో సుడిగుండాలు సర్వసాధారణం. సముద్రంలో ఏర్పడే సుడిగుండాలు విపరీతమైన నష్టాన్ని కలగజేస్తాయి. ప్రాణ నష్టం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

విదేశాలలో ఏర్పడే సుడిగుండాలు.. ఇప్పుడు ఏపీలో కూడా చోటుచేసుకున్నాయి. ఏపీలో కోస్తా ప్రాంతంలో ఉన్న అనకాపల్లి పట్టణంలో సుడిగుండం ఏర్పడింది. ఎన్టీఆర్ స్టేడియంలో ఒక్కసారిగా సుడిగుండం ఏర్పడి బీభత్సం సృష్టించింది. సుమారు 100 అడుగుల ఎత్తున ఎగిసిన సుడిగుండం.. పట్టణంలో భయాందోళనకు కారణమైంది. కొంతమంది సుడిగుండాన్ని వీడియో తీసి సామాజిక మాధ్యమాలలో పోస్ట్ చేశారు.

ఈ వీడియో కాస్త విపరీతంగా సర్కులేట్ అయింది. ఫలితంగా ఏపీలో ఏదో జరుగుతోందనే అనుమానం మొదలైంది. ఇటీవల కాలంలో ఏపీలో స్వల్ప భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు సుడిగాలుల వంటి సంఘటనలు చోటు చేసుకున్న దాఖలాలు లేకపోయినప్పటికీ.. ఈ తరహా సుడిగాలులు సముద్ర తీర ప్రాంతమైన విశాఖపట్నంలో చోటుచేసుకున్నాయని ఏపీ వాసులు చెబుతున్నారు. ఎన్నడూ కూడా సుడిగాలులు ఈ స్థాయిలో ఏర్పడలేదని ఏపీ ప్రజలు చెబుతున్నారు.

దీనివల్ల ఏమైనా నష్టం జరుగుతుందా? భవిష్యత్తు కాలంలో జరిగే నష్టానికి ప్రకృతి ఇప్పుడే సంకేతాలు పంపించిందా? అనే ప్రశ్నలు ఏపీ ప్రజలలో వ్యక్తం అవుతున్నాయి. ఇటీవల అంబేద్కర్ కోనసీమ జిల్లాలో బ్లో అవుట్ సంభవించింది. చాలా రోజుల వరకు ఆ మంటలు తగ్గలేదు. ఇప్పుడిప్పుడే ప్రజలు ఆ ఘటన నుంచి తేరుకుంటున్నారు. దానిని మర్చిపోకముందే ఇప్పుడు సుడి గుండం ఏర్పడటం సంచలనం కలిగిస్తోంది.

“ఉన్నట్టుండి వాతావరణం పూర్తిగా మారిపోయింది. అకస్మాత్తుగా గాలి వచ్చేసింది. భారీగా శబ్దం కూడా వచ్చింది. ఆ సమయంలో ఏం జరుగుతుందో అర్థం కాలేదు.. మొత్తానికి ఏదో విపత్తు మాదిరిగానే కనిపించింది. ఇటువంటి సుడిగుండాలు గతంలో మేము ఎన్నడూ చూడలేదని” అనకాపల్లి పట్టణవాసులు చెబుతున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version