Tamoto price fall in Andra Pradesh : కొన్ని నెలల కిందట సామాన్య ప్రజలకు చుక్కలు చూపించింది టమాటా ధర. కానీ ఇప్పుడు అమాంతం ధర పడిపోవడంతో రైతులు నేలచూపులు చూస్తున్నారు. పెట్టిన పెట్టుబడి దక్కడం కూడా కష్టంగా ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం పంట చేతికి వచ్చే సమయానికి ధర పతనమై రైతులు అప్పుల్లో కూరుకు పోతున్నారు. దీనికి తోడు తెగుళ్ల ప్రభావం దిగుబడులపై చూపుతోంది. గిట్టుబాటు ధర క్రమేపి తగ్గుతోంది. మరోవైపు యార్డుల వద్ద దందా కొనసాగుతోంది. లారీ ఓనర్ల అసోసియేషన్ రవాణా చార్జీలు పెంచడంతో మరింత ఇబ్బందికరంగా మారింది.వాస్తవానికి మే, జూన్ నెలల్లో కిలో టమాట వంద రూపాయలకు ఎగబాకింది. రికార్డు స్థాయిలో ధర పలికింది. దీంతో రైతులు టమాటా పంట సాగును పెంచారు. అయితే తెగుళ్ల బెడదతో దిగుబడి తగ్గింది. సాధారణంగా దిగుబడి తగ్గితే టమాటా కొరత ఏర్పడుతుంది. అప్పుడు ధర పెరుగుతుంది. కానీ ఏపీలో మాత్రం పరిస్థితి అందుకు విరుద్ధం. టమాట దిగుబడి తగ్గినా.. ధర కూడా తగ్గిపోతోంది. అనంతపురం జిల్లాలో అయితే కిలో టమాట పది రూపాయలే పలుకుతుండడం విశేషం.
* వింత పరిస్థితి
ఏపీలో వింత పరిస్థితి ఉంది.దేశవ్యాప్తంగా టమాటా కొరత నాటికి ఏపీలో ఉత్పత్తులు ఉండడం లేదు. ధర పతనమైనప్పుడు మాత్రం దిగుబడులు అధికంగా ఉంటున్నాయి. చివరకు పంట సేకరణ కూడా గిట్టుబాటుకావడం లేదు. కనీసం సేకరించిన కూలీలకుడబ్బులు ఇచ్చుకునే పరిస్థితి ఉండదు.అందుకే రైతులు రోడ్డు పక్కన టమాటాను పారబోయాల్సిన దౌర్భాగ్య పరిస్థితి నెలకొంది.
* రాయలసీమలో సాగు అధికం
రాయలసీమలో పంట సాగు అధికం. ముఖ్యంగా అనంతపురం, కర్నూలు, చిత్తూరు జిల్లాలో ఎక్కువగా టమాటాను సాగు చేస్తారు. ప్రస్తుతం వర్షాలు కారణంగా దిగుబడులు తగ్గుముఖం పట్టాయి. టమాటా కోతలు, మార్కెట్ కు తరలింపు, రవాణా, ఎగుమతి, దిగుమతి ఖర్చులు లెక్కిస్తే తడిపి మోపెడవుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక మార్కెట్ యార్డుల వద్ద కమీషన్ల దందా కొనసాగుతోంది. రవాణా విషయంలో సైతం లారీ ఓనర్లు పెడుతున్న షరతులు ఇబ్బందికరంగా మారుతున్నాయి.
* ధర పతనం
సాధారణంగా మే, జూన్ లో ధరలు ఆశాజనకంగా ఉంటాయి. అయితే ఆ సమయంలో ఏపీలో పంటలు లేవు. వర్షాలు లేకపోవడంతో పంట చివరి దశకు వచ్చింది. అదే సమయంలో ధర అధికంగా ఉంది. దీంతో రైతులు అధికంగా సాగు చేయడం ప్రారంభించారు. కానీ ఇప్పుడు వర్షాలు పుణ్యమా అని దిగుబడులు తగ్గాయి. అదే సమయంలో చల్లటి వాతావరణం కావడంతో ఇతర రాష్ట్రాల్లో దిగుబడులు పెరిగాయి. దీంతో ధర పతనం అయ్యింది. టమాటా రైతుకు కన్నీళ్లు తప్పడం లేదు.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read MoreWeb Title: Tomoto affordability price in andhra is a crisis that is bringing tears to the farmer
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com