Jagan: ఏపీలో ప్రముఖులు ఓటమి బాటలో ఉన్నారా? మరికొందరికి మెజారిటీ తగ్గనుందా? కొందరికి డేంజర్ బెల్స్ మోగుతున్నాయా?అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. తాజాగా ఏఎల్ఎన్ సర్వేలో ఆసక్తికర ఫలితాలు వచ్చాయి. జగన్, చంద్రబాబు, పవన్, లోకేష్, బాలకృష్ణ లకు ప్రమాదం తప్పదని తెలుస్తోంది. ఈ సర్వే కూడా ఇదే తేల్చి చెబుతోంది.వైసిపి149 స్థానాలు గెలుచుకుని అధికారంలోకి రాబోతుందని ఈ సర్వే తేల్చింది.టిడిపి కూటమి కేవలం 26 స్థానాలకి పరిమితం కానుందని కూడా తేల్చి చెప్పింది.
అయితే సీఎం జగన్ మెజారిటీ గణనీయంగా తగ్గుతుందని ఈ సర్వే తేల్చడం విశేషం.కేవలం ఆయన 21వేల ఓట్ల మెజారిటీతో మాత్రమే విజయం సాధిస్తారని ఈ సర్వే చెప్పింది. అటు చంద్రబాబు మెజారిటీ సైతం తగ్గుతుందని తేలింది. కేవలం 19 వేల మెజారిటీతో మాత్రమే చంద్రబాబు గెలుపొందే ఛాన్స్ ఉందని తేల్చింది. అటు మంగళగిరిలో లోకేష్ 2000 ఓట్లతో ఓడిపోతున్నారని సర్వే తేల్చడం విశేషం. పిఠాపురంలో పవన్ ఏడు వేల ఓట్లతో ఓడిపోతారని కూడా ఈ సర్వే తేల్చి చెప్పడం సంచలనం గా మారింది.
అయితే ఒకవైపు వైసీపీకి ఏకపక్ష విజయం దక్కుతుందని చెబుతూనే.. సీఎం జగన్ మెజారిటీ గణనీయంగా తగ్గుతుందని చెప్పడం అనుమానాలకు తావిస్తోంది. గత ఎన్నికల్లో రికార్డు స్థాయిలో ఆయన మెజారిటీ సాధించారు. ఇప్పుడు అందులో మూడో వంతు మెజారిటీ మాత్రమే వస్తుందని చెబుతుండడం దేనికి సంకేతం. ఇప్పటివరకు వెళ్లడైనా సర్వేలకు భిన్నంగా.. ఓటమికి చెందిన బలమైన అభ్యర్థులు సైతం ఓడిపోతారని ఈ సర్వే వెల్లడించడం సంచలనం గా మారింది. ఇటీవల పెయిడ్ సర్వేలు రాజ్యమేలుతున్న తరుణంలో అటువంటి సంకేతాలతో కూడిన ఈ సర్వే వెల్లడించడం కూడా అనుమానాలకు బలం చేకూరుస్తోంది. రాష్ట్రంలో వైసిపి అద్భుత పాలన సాగిస్తే.. సీఎం జగన్ కు పులివెందులలో ఓట్లు పెరగాలే తప్ప.. ఎందుకు తగ్గుతాయని.. ఇది పెయిడ్ సర్వేనని కూటమి పార్టీల నేతలు అభిప్రాయపడుతున్నారు. కేవలం సర్వేపై సానుకూలత రావాలన్న ఉద్దేశంతోనే జగన్ మెజారిటీ తగ్గించారని… చంద్రబాబు గెలుస్తారని చెబుతున్నారని.. అదే సమయంలో పవన్, లోకేష్ లు ఓడిపోతారని చెప్పడంద్వారా నెగిటివ్ ప్రచారానికి తెర తీశారని అనుమానిస్తున్నారు. అయితే లోగోట్టు ఏమిటో వారికే తెలియాలి.