Homeఆంధ్రప్రదేశ్‌Tirupati Stampede: తిరుపతి తొక్కిసలాట.. కలచి వేస్తున్న దృశ్యాలు..

Tirupati Stampede: తిరుపతి తొక్కిసలాట.. కలచి వేస్తున్న దృశ్యాలు..

Tirupati Stampede: తిరుమల క్షేత్రంలో తొలిసారిగా తొక్కిసలాట జరిగి మరణాలు సంభవించడం విశేషం. తిరుమలలో(tirumala) గురువారం అర్ధరాత్రి నుంచి వైకుంఠ ద్వారాలు తెరుచుకోనున్నాయి. దీనికోసం టోకెన్ జారీ కౌంటర్ భక్తుల పాలిట మృత్యువేదికగా మారింది. సామాన్య భక్తులకు ఈసారి వైకుంఠ ద్వార దర్శనం(vaikunta dwara darshanam) కల్పించడానికి తిరుపతిలో 9 ప్రాంతాలలో 90 టోకెన్ జారీ కేంద్రాలను ఏర్పాటు చేశారు. బుధవారం రాత్రి గేట్లను తెరవగానే భక్తులు పరుగులు పెట్టారు. దీంతో తొక్కిసలాట(Tirupati stampede) జరిగింది. ముఖ్యంగా బైరాగిపట్టెడ కేంద్రం వద్ద పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఈ తొక్కిసలాటలో భక్తులు ఊపిరి ఆడక ఇబ్బంది పడ్డారు. మహిళలు నరకం చూశారు.. ఈ విషాదంలో ఆరుగురు చనిపోయారు. వారిలో ఐదుగురు మహిళలు ఉండడం విశేషం. తొక్కిసలాటలో భారీగానే భక్తులు గాయపడ్డారు. వారికి తిరుపతిలోని స్విమ్స్, రుయా ఆస్పత్రులలో చికిత్స అందిస్తున్నారు.. గతంలో వైకుంఠ ద్వారదర్శన టోకెన్ జారీ చేసే సమయంలో భక్తులు గాయపడ్డారు.. అయితే మరణాలు మాత్రం చోటు చేసుకోవడం ఇదే తొలిసారి.

కలచి వేస్తున్న దృశ్యాలు

సోషల్ మీడియాలో తిరుమల లో చోటు తీసుకున్న తొక్కిసలాటకు సంబంధించిన దృశ్యాలు కలచివేస్తున్నాయి. ఒకేసారి గేట్లను తెరవడంతో భక్తులు భారీగా పరుగులు పెట్టారు. ఈ సమయంలో తొక్కిసలాట జరిగింది.. దీంతో చాలామంది కింద పడిపోయారు. మరి కొంతమంది ఊపిరి ఆడక ఇబ్బంది పడ్డారు. ఆ సమయంలో పోలీసులు వ్యవహరించిన తీరు భక్తులను ఇబ్బందికి గురి చేసింది. కొంతమంది పోలీసులు భక్తులపై దురుసుగా ప్రవర్తించారు. భక్తులను అదుపు చేసే సమయంలో వారు తమ చేతిలో ఉన్న లాఠీలకు పని చెప్పారు. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి. ” తొక్కిసలాట జరుగుతున్న సందర్భంలో పోలీసులు ఇలా వ్యవహరించడం సరికాదు. చూస్తుంటే భక్తులపై కర్కశంగా ప్రవర్తిస్తున్నారు. ఇలా అయితే తిరుమల చరిత్ర మసకబారుతుంది. తిరుమలలో ఇలాంటి దారుణం చోటు చేసుకోవడం దురదృష్టకరమని” నెటిజన్లు వాపోతున్నారు.

తిరుపతిలో ఈ తరహా దారుణాలు గతంలో చోటు చేసుకోలేదు. గతంలో టికెట్ల జారీ సమయంలో తొక్కిసలాటలు చోటుచేసుకున్నాయి. అయితే ఆ సందర్భంలో మరణాలు సంభవించలేదు. అయితే ఈసారి టోకెన్ల జారి సమయంలో ఒకేసారి గేట్లు ఎత్తడంతో భక్తులు భారీగా వచ్చారు. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. భక్తులు ఒకరిని ఒకరు తోసుకోవడంతో గాయాలు తగిలాయి. ఊపిరి ఆడక చాలామంది ఇబ్బంది పడ్డారు. ముఖ్యంగా మహిళలైతే నరకం చూశారు. చనిపోయిన వారిలో అధికంగా మహిళలు ఉండడాన్ని బట్టి అక్కడ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే చనిపోయిన వారికి ఎక్స్ గ్రేషియా విషయంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఇవాళ కీలక ప్రకటన చేయనుంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular