Tirupati Laddu Ghee Adulteration Controversy: కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరుడు( Lord Sri Venkateswara ). కోట్లాదిమంది భక్తుల ప్రగాఢ నమ్మకం కూడా అదే. అటువంటి స్వామివారి ప్రసాదం లడ్డూ తయారీ లో కల్తీ నెయ్యి వాడారు అన్నది వివాదాస్పదంగా మారింది. అధికార విపక్షం మధ్య గట్టిగానే యుద్ధం నడుస్తోంది. అయితే కల్తీ జరిగింది అనేది ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణలో తేలింది. కానీ వైయస్సార్ కాంగ్రెస్ మాత్రం.. జంతు కొవ్వు లేదని వాదిస్తోంది. కల్తీ జరిగిందన్న విషయాన్ని మరిచిపోతోంది. అయితే ఇప్పటికే ఆ పార్టీపై హిందూ వ్యతిరేక ముద్ర ఉంది. ఇటువంటి సమయంలో ఈ వివాదం బయటికి రావడం.. దాని నుంచి బయటపడే ప్రయత్నంలో భాగంగా ఆ పార్టీ చేస్తున్న అతి కూడా మూల్యం చెల్లించేలా ఉంది.
* ప్రజల్లో బలమైన చర్చ..
ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు( assembly sessions ) జరుగుతున్నాయి. కానీ శాసనసభకు వైయస్సార్ కాంగ్రెస్ హాజరు కావడం లేదు. మెజారిటీ ఎక్కువగా ఉన్న శాసనమండలికి మాత్రం వైసీపీ ఎమ్మెల్సీలు వెళ్తున్నారు. అయితే కల్తీ నెయ్యి వ్యవహారం విషయంలో వైసీపీ సభ్యులు శాసనమండలిలో వ్యవహరించిన తీరుపై ఇప్పుడు ప్రజల్లో బలంగా చర్చ నడుస్తోంది. శాసనమండలిలోకి దేవుడి పటాలు తీసుకెళ్లడమే కాకుండా.. చెప్పులు వేసుకుని దేవుడి పటాలతో హాజరవ్వడం మాత్రం హైలెట్ అవుతోంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మెడకు మరో కొత్త వివాదం చుట్టుకున్నట్టు అయింది. కాళ్లకు చెప్పులు వేసుకుని వెంకటేశ్వర స్వామి చిత్రపటాలతో వైసిపి ఎమ్మెల్సీ సభ్యులు కనిపించిన విషయం సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి వచ్చింది. అయితే అవి మార్ఫింగ్ అంటూ వైసిపి కొత్త వాయిస్ అందుకుంది. అయితే అవి ఒరిజినల్ అని ప్రజల్లోకి బలంగా కూడా.
* వైసీపీ పై ఆ ముద్ర..
దేవుడిని రాజకీయాల్లోకి లాగేశారు. అయితే వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress) పార్టీ పై అన్యమత ముద్ర ఉంది. సరిగ్గా ఇటువంటి సమయంలోనే కల్తీ నెయ్యి, ఆపై చెప్పులతో ఉంటూ దేవుడు చిత్రపటాలతో కనిపించడం వంటివి హిందూ సమాజం పై ప్రభావం చూపుతున్నాయి. పవిత్రమైన శ్రీవారి చిత్రపటాలను ప్లకార్డుల్లా వాడుతూ అగౌరవపరిచారని వైసీపీ నేతల తీరుపై నిరసన వ్యక్తం అవుతోంది. అయితే వైసీపీ సభ్యుల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పడింది. మొదట చెప్పులు ధరించలేదని బుకాయించారు. అయితే ఆ వీడియోలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కానీ మార్ఫింగ్ చేసి అధికార పార్టీ గేమ్ ఆడుతోంది అని చెబుతోంది. అయితే సభలో వైసీపీ సభ్యుల వ్యవహార శైలిపై ఆ పార్టీకి చెందిన చైర్మన్ అసహనంతో ఉన్నట్లు తెలుస్తోంది.
* ముప్పేట విమర్శలు..
అయితే కల్తీ నెయ్యి వ్యవహారంలో హెరిటేజ్ సంస్థను తెచ్చి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టామని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ భావించింది. కానీ ఇంతలోనే వెంకటేశ్వర స్వామి చిత్రపటాలతో వైసిపి సభ్యులు శాసనమండలిలో కనిపించడం విమర్శలకు తావిచ్చింది. దీంతో వైసీపీ చుట్టూ వివాదం మరింత ముదిరింది. దీనికి తోడు సుప్రీంకోర్టు సైతం కూటమి ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించింది. అయితే ఇప్పుడు స్వామివారి చిత్రపటాల ఇష్యూ మాత్రం ప్రజల్లోకి బలంగా వెళ్ళింది. ప్రజల్లో ఆగ్రహాన్ని చూసి తప్పు ఒప్పుకోవాల్సింది పోయి.. సాకులు వెతుక్కోవడం వైసీపీ నేతలకు పరిపాటిగా మారిందన్న విమర్శలు ఉన్నాయి. అయితే చేజేతులా టిడిపి కూటమికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అస్త్రం ఇచ్చినట్లు అయింది. రాష్ట్ర వ్యాప్త ఆందోళనలకు మూడు పార్టీలు ఇప్పుడు సిద్ధమవుతున్నాయి