Kiran Royal : జనసేన నేత కిరణ్ రాయల్ ( Kiran rayal ) వివాదం ఇప్పట్లో తేలేలా లేదు. ఆయన చీకటి బాగోతాలు అంటూ సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అవుతున్నాయి. కొద్ది రోజుల కిందట తనను మోసం చేశాడు అంటూ కిరణ్ రాయల్ పై లక్ష్మీరెడ్డి అనే మహిళ సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. కోటి 20 లక్షల రూపాయల నగదు తో పాటు 25 సవర్ల బంగారం కాజేసి తన కుటుంబాన్ని ఆర్థిక ఇబ్బందుల్లో పెట్టాడు అంటూ ఆమె ఆరోపించారు. అందుకే తాను ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ సెల్ఫీ వీడియో సైతం ఆమె సోషల్ మీడియాలో పెట్టారు. బాధిత మహిళతో కిరణ్ రాయల్ సన్నిహితంగా ఉన్న వీడియో సైతం అప్పట్లో బయటకు వచ్చింది. అప్పటినుంచి రచ్చ జరుగుతూనే ఉంది. దీంతో జనసేన నాయకత్వం స్పందించింది. అంతర్గత విచారణ జరిగే వరకు జనసేన కార్యక్రమాలకు దూరంగా ఉండాలని కిరణ్ రాయల్ కు ఆదేశించింది.
* ఎన్నెన్నో సంచలనాలు
తాజాగా కిరణ్ రాయల్ కు సంబంధించి సంచలన ఆడియో కాల్ రికార్డు( audio call record) ఒకటి బయటకు వచ్చింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తమ అధికారిక సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అందులో కిరణ్ రాయల్ మాట్లాడుతున్నట్లు ఉంది. నాకు అమ్మాయిల వీక్నెస్ ఉంది. లైఫ్ లాంగ్ ఇలానే ఉంటా. నేను మారలేను. కానీ నిన్ను మాత్రం బాగా చూసుకుంటా అని చెప్పడం వినిపించింది. అయితే అంతటితో ఆగకుండా నా కూతురు మీద ఒట్టు. నేను చాలామంది అమ్మాయిలతో అక్రమ సంబంధం పెట్టుకున్న. నీకు 10 ఏళ్ల వయసు ఉండొచ్చేమో.. ఆ సమయంలోనే రోజుకు అమ్మాయితో తిరిగే వాడిని. నీకు నలుగురు గురించి మాత్రమే తెలుసు. కానీ నీకు తెలిసిన ఆరుగురితో నేను తిరిగాను. ఈ ఏడు నెలల్లోనే ఆరుగురితో తిరిగా. ఇప్పటికీ ఇద్దరు అమ్మాయిలతో వాళ్ళ ఇంటికి వెళ్తాను. మొత్తంగా నాకు 400 మందితో సంబంధం ఉండొచ్చని కిరణ్ రాయల్ మాటలతో కూడిన ఆడియో ఇప్పుడు బయటపడింది.
* పవన్ కే బ్లాక్ మెయిల్ చేస్తా..
అయితే రెండు రోజుల కిందట బాధితురాలు లక్ష్మీరెడ్డి ( Lakshmi Reddy)మీడియా ముందుకు వచ్చారు. సంచలన విషయాలు బయటపెట్టారు. నన్ను ఎవరూ ఏం చేయలేరని కిరణ్ రాయల్ చెప్పేవాడని.. పవన్ కళ్యాణ్ నే బ్లాక్ మెయిల్ చేస్తా.. నువ్వు ఎంత నాకు అంటూ కిరణ్ రాయల్ నన్ను బెదిరించాడని లక్ష్మీరెడ్డి చెప్పుకొచ్చారు. అయితే కిరణ్ రాయల్ చీకటి బాగోతం వెలుగు చూసినా ఆయనపై ఎటువంటి చర్యలకు ఉపక్రమించకపోవడం అనుమానాలకు తావిస్తోంది. దీనిపై వైయస్సార్ కాంగ్రెస్ నేతలు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు. ఆడపిల్లల రక్షణ గురించి ఎన్నికల ప్రచారంలో ప్రగల్బాలు పలికిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. తమ సొంత పార్టీ నాయకుడు అఘాయిత్యాలపై ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నిస్తున్నారు. మరి ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.
తిరుపతి జనసేన ఇంచార్జ్ కిరణ్ రాయల్ ఆడియో లీక్
నాకు రోజుకు ఒక అమ్మాయి కావాలి.. నాకు అమ్మాయిల పిచ్చి ఎక్కువ
నువ్వు పదేళ్లు ఉన్నప్పుడు 10 మంది అమ్మాయిలను మార్చాను.. నీకు తెలిసింది నలుగురే
ఈ 7 నెలల్లోనే ఐదు మందితో పడుకున్నా pic.twitter.com/XGmrztcClt
— Telugu Scribe (@TeluguScribe) February 18, 2025