spot_img
Homeఆంధ్రప్రదేశ్‌Pink Diamond Conspiracy: తేలిపోనున్న 'పింక్ డైమండ్' కుట్ర!

Pink Diamond Conspiracy: తేలిపోనున్న ‘పింక్ డైమండ్’ కుట్ర!

Pink Diamond Conspiracy: 2019 ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు గట్టి ప్రయత్నాలు చేసింది. 2014 నుంచి 2019 వరకు టిడిపి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేందుకు చేయని ప్రయత్నం అంటూ లేదు. అందులో ప్రధానమైనది తిరుమల పింక్ డైమండ్. టిడిపి ప్రభుత్వ హయాంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆ పింక్ డైమండ్ కనిపించకుండా పోయింది అంటూ రమణా దీక్షితులతోపాటు అప్పటి వైసీపీ నేత విజయసాయిరెడ్డి ఆరోపించారు. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యంగా సంచలన ఆరోపణలు చేశారు. వారు ఆశించినట్టుగా పొలిటికల్ మైలేజ్ వచ్చింది. అయితే తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టను దిగజార్చేలా అవాస్తవాలు ప్రచారం చేశారంటూ గతంలో 200 కోట్ల రూపాయల పరువు నష్టం దావా దాఖలయింది. ఈ కేసు విచారణ వేగవంతం అయింది. అందులో భాగంగా టీటీడీ జేఈవో వెంకయ్య చౌదరి క్రాస్ ఎగ్జామినేషన్ సక్సెస్ ఫుల్ గా పూర్తయింది. ప్రతివాదులుగా ఉన్న శ్రీవారి ఆలయ మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు, విజయసాయిరెడ్డి లకు చట్టపరంగా శిక్ష పడి అవకాశాలు కనిపిస్తున్నాయి.

* ఎన్నికల్లో లబ్దికోసం..
2019 ఎన్నికలకు ముందు రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేసేలా రమణ దీక్షితులు, విజయసాయిరెడ్డి పక్కా వ్యూహం ప్రకారం వ్యవహరించారు. శ్రీవారి ఆభరణాల్లోని అత్యంత విలువైన పింక్ డైమండ్ మాయమైందని.. ఇది చంద్రబాబు నివాసంలో ఉందంటూ రమణ దీక్షితులు మీడియా సమావేశాలు పెట్టి తీవ్ర ఆరోపణలు చేశారు. దీనిని రాజకీయం జోడించి మరింత రక్తి కట్టించారు విజయసాయిరెడ్డి. అయితే స్వామివారి ఆభరణాలు భద్రంగా ఉన్నాయని.. టిటిడి పవిత్రతను, భద్రతను దెబ్బతీసేందుకు పనిన కుట్రగా అభివర్ణించింది టీటీడీ యంత్రాంగం. రమణ దీక్షితులతో పాటు విజయసాయిరెడ్డి పై 200 కోట్ల రూపాయలకు పరువు నష్టం దావా వేసింది.

* కేసు నీరు గార్డ్చేందుకు ప్రయత్నం..
అయితే ఆ ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈ ప్రచారంతో రాజకీయ లబ్ధి పొందింది. అధికారంలోకి రాగలిగింది. అప్పట్లో ఈ కేసును నీరు గార్చేందుకు చాలా రకాలుగా ప్రయత్నించింది. అసలు శ్రీవారి వద్ద పింక్ డైమండ్ లేదని.. అది ఒక గులాబీ రంగు రాయి మాత్రమేనని అసెంబ్లీలో సైతం ప్రస్తావించింది. తద్వారా అప్పట్లో చేసిన ఆరోపణలు రాజకీయ లబ్ధి కోసమేనని తేలిపోయింది. మరోవైపు 200 కోట్ల రూపాయల పరువు నష్టం దావాకు సంబంధించి టిటిడి యంత్రాంగంతో వెనక్కి తీసుకోవాలని చూసింది. కానీ న్యాయపరమైన చిక్కులు ఎదుర్కావడంతో అది వీలుపడలేదు. ప్రస్తుతం ఈ కేసు విచారణలో భాగంగా, క్రాస్ ఎగ్జామినేషన్ పూర్తయింది. తుది విచారణపై చర్యలు ప్రారంభం అయ్యాయి. దీంతో రమణ దీక్షితులు, విజయసాయిరెడ్డిలు ఇరకాటంలో పడటం ఖాయం. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Chiranjeevi

Chiranjeevi: చిరంజీవి కెరియర్ లో చేసిన మూడు తప్పులు ఇవే…

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి హీరోగా చేసిన సినిమాలు అతన్ని టాప్ లెవెల్లో నిల్చోబెట్టాయి. ఒక సామాన్య మానవుడు సైతం సినిమా ఇండస్ట్రీకి వచ్చి ఇక్కడ హీరోగా మారవచ్చు అని ప్రూవ్ చేసిన...
Vijay Deverakonda

Vijay Deverakonda: విజయ్ దేవరకొండ మూవీ రిలీజ్ పోస్ట్ పోన్ వెనక ఇన్ని కారణాలున్నాయి…

Vijay Deverakonda: 'అర్జున్ రెడ్డి' సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోగా మారిపోయిన నటుడు విజయ్ దేవరకొండ... ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాల విషయంలో చాలా కేర్ ఫుల్ గా...
Ramayana Trailer Postponed

Ramayana Trailer Postponed: ‘రామాయన్ ‘ ట్రైలర్ విడుదల వాయిదా.. సంచలనం రేపుతున్న పోస్ట్..

Ramayana Trailer Postponed: బాలీవుడ్ లో నితీష్ తివారీ దర్శకత్వం లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన 'రామాయన్' మూవీ కి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ ని నేడు గ్రాండ్ గా విడుదల చెయ్యాలని...
Super El Nino

Super El Nino: వచ్చే రోజుల్లో సూపర్ ఎల్ నినో.. తెలుగు రాష్ట్రాల్లో ప్రభావం ఎలా ఉంటుందంటే..

Super El Nino: సాంకేతిక పరిజ్ఞానం పెరిగింది. గతంతో పోల్చి చూస్తే వాతావరణం మీద శాస్త్రవేత్తలకు అవగాహన మరింత పెరిగింది. అందువల్లే వర్షాలు.. ఎండలు.. కరువు కాటకాల గురించి అత్యంత స్పష్టంగా...
Oktelugu Epaper