YS Jagan Mohan Reddy : జగన్మోహన్ రెడ్డికి( Y S Jagan Mohan Reddy) మరో సీనియర్ షాక్ ఇవ్వబోతున్నారా? పార్టీకి గుడ్ బై చెబుతారా? పార్టీలో పరిస్థితులపై మనస్థాపంతో ఉన్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి నెల్లూరు జిల్లా వెన్నుదన్నుగా నిలుస్తూ వచ్చింది. 2024 ఎన్నికల కు ముందు చాలామంది సీనియర్లు పార్టీని వీడారు. ఎన్నికల అనంతరం అదే జిల్లాకు చెందిన వైసిపి కీలక నేత విజయసాయిరెడ్డి సైతం గుడ్ బై చెప్పారు. అప్పటినుంచి నెల్లూరులో పరిస్థితి మరింత తీసికట్టు గా మారింది. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అన్ని అనుభవించిన మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ జాడలేకుండా పోయింది. కాకాని గోవర్ధన్ రెడ్డి ఉన్న పరిస్థితుల్లో ఏమంత ఆశాజనకం కనిపించడం లేదు. ఇటువంటి తరుణంలో సీనియర్ నేత మేకపాటి రాజమోహన్ రెడ్డి ఈరోజు సంచలన వ్యాఖ్యలు చేశారు.
* వైయస్సార్ కుటుంబ విధేయుడు..
వైయస్సార్ కుటుంబానికి అత్యంత విధేయుడు మేకపాటి రాజమోహన్ రెడ్డి(Raja Mohan Reddy) . అటు తర్వాత జగన్మోహన్ రెడ్డికి అండగా నిలిచారు కూడా. ఎంపీగా కూడా ఆయనకు అవకాశం దక్కింది. ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డికి సన్నిహితంగా మెలిగారు.. ఎంతో 2019లో గెలిచిన మేకపాటి గౌతం రెడ్డికి మంత్రి పదవి ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. ఐటీతో పాటు పరిశ్రమల శాఖ మంత్రిగా అవకాశం ఇచ్చారు. గౌతమ్ రెడ్డి ఆ శాఖలో తనదైన మార్క్ చూపించారు. కానీ అకాల మరణంతో మేకపాటి కుటుంబంలో విషాదం అలముకుంది. మేకపాటి రెండో కుమారుడు ఎమ్మెల్యేగా ఉప ఎన్నికల్లో గెలిచారు. కానీ ఆయనకు మంత్రి పదవి ఇవ్వలేదు. మొన్నటి ఎన్నికల్లో రెండు చోట్ల మేకపాటి కుటుంబానికి అవకాశం ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. అయితే రెండింత ఆ కుటుంబ సభ్యులకు అపజయం ఎదురయింది. అయితే గత కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాలతో మేకపాటి రాజమోహన్ రెడ్డి అసంతృప్తితో ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది. ఒకానొక సమయంలో ఆయన తెలుగుదేశం పార్టీలో చేరతారని కూడా టాక్ నడిచింది. కానీ ఇన్నాళ్లకు ఆయన నోటి నుంచి అసంతృప్తి మాటలు రావడం హాట్ టాపిక్ అవుతోంది.
* భజన పరులపై వ్యాఖ్యలు..
తాజాగా మీడియా ముందు సంచలన వ్యాఖ్యలు చేశారు రాజమోహన్ రెడ్డి. జగన్ చుట్టూ భజన పరులు ఉన్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వారే ఆయనను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆవేదనతో అన్నారు. జగన్ చుట్టూ కోటరీ ఉందన్నట్టు మాట్లాడారు. జగన్ సైతం భజన పరులకే నమ్ముతున్నారని అభిప్రాయంతో మాట్లాడారు. అయితే ఇదివరకే జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు, పార్టీలో నెంబర్ 2 గా ఎదిగిన విజయసాయిరెడ్డి సైతం ఇదే తరహా ఆరోపణలు చేశారు. ఇప్పుడు ఆయన మాదిరిగానే రాజమోహన్ రెడ్డి అలానే మాట్లాడుతుండడంతో చర్చకు దారితీస్తోంది. అయితే ఇప్పుడు భజనపరులు అన్న పదం మాజీమంత్రి అనిల్ కుమార్ యాదవ్ను ఉద్దేశించి చేసినదా అన్న అనుమానం కలుగుతోంది. నిన్ననే అనిల్ కుమార్ యాదవ్ మీడియా ముందుకు వచ్చి ఆరోపణలు చేశారు. మాజీమంత్రి జోగి రమేష్ అరెస్ట్ పై మాట్లాడారు. అయితే ఇప్పుడు రాజమోహన్ రెడ్డి బూతులు మాట్లాడవద్దు అంటూ వైసీపీ నేతలకు సూచించారు. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే రాజమోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి షాక్ ఇస్తారా అన్న అనుమానం కలుగుతోంది. దీనిపై భవిష్యత్తులో క్లారిటీ రానుంది.