Tirumala Laddu controversy : తిరుమల తిరుపతి దేవస్థానం ప్రపంచ ప్రఖ్యాతి పొందింది. నిత్య కళ్యాణం పచ్చ తోరణంగా ఈ క్షేత్రం విలసిల్లుతోంది. తిరుమల వెంకటేశ్వర స్వామి ఎంత అయితే ప్రత్యేకమో… స్వామి వారి లడ్డు కూడా అంతే ప్రత్యేకం.. ఈ లడ్డుకు సంబంధించి పేటెంట్ రైట్స్ కూడా తిరుమల తిరుపతి దేవస్థానం సొంతం చేసుకుంది.. ప్రపంచంలో ఏ క్షేత్రానికి లేని విశిష్టత ఈ ఆలయానికి ఉంది. ప్రతిరోజు స్వామి వారి అన్నదాన కేంద్రంలో 90,000 మంది దాకా ఉచిత భోజనం చేస్తుంటారు.. ధూప దీప నైవేద్యాల నుంచి మొదలు పెడితే లడ్డు ప్రసాదం వరకు తిరుమల క్షేత్రంలో ప్రతిదీ ప్రత్యేకమే.. స్వామివారి దర్శనం తర్వాత లడ్డు ప్రసాదాన్ని కొనుగోలు చేయడాన్ని భక్తులు తమ అదృష్టంగా భావిస్తుంటారు.
ఎంతో విశిష్టమైన చరిత్ర ఉన్న తిరుమల లడ్డు ప్రాశస్త్యం 2019 నుంచి 2024 వరకు దెబ్బ తిన్నది. 2019 నుంచి 2024 వరకు ఏపీలో వైసిపి ప్రభుత్వం అధికారంలో ఉంది. ఆ సమయంలో తిరుమల దేవస్థానం లో లడ్డూ తయారీకి బోలే బాబా ఆర్గానిక్ డెయిరీ నుంచి 68 లక్షల కిలోల నెయ్యిని తిరుమల తిరుపతి దేవస్థానం కొనుగోలు చేసింది. ఆ సంస్థ పాలు లేదా వెన్న లేదా నెయ్యి తయారుచేసిన దాఖలాలు లేవు. 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వెంకటేశ్వర స్వామి లడ్డుకు సంబంధించిన వ్యవహారం బయటపడింది. ఆ సమయంలో లడ్డు తయారీలో కల్తీ నెయ్యి వాడారని తెరపైకి సరికొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ఈ కేసును సీబీఐకి అప్పగించింది. సీబీఐ కొంతకాలంగా లడ్డు తయారీలో చోటు చేసుకున్న అక్రమాలపై ప్రత్యేక దర్యాప్తు చేపడుతోంది..
ఆ దర్యాప్తుకు సంబంధించిన నివేదికను ప్రభుత్వానికి సిబిఐ అందించింది. ఈ నివేదికలో దారుణమైన విషయాలు వెలుగు చూశాయి. తిరుమల తిరుపతి దేవస్థానం లో 2019 నుంచి 2024 వరకు లడ్డు తయారీలో అక్రమాలు చోటు చేస్తున్నాయని సిబిఐ నివేదికలో పేర్కొంది. లడ్డు తయారీలో కల్తీ నెయ్యి ఉపయోగించారని.. వెంకటేశ్వర స్వామి లడ్డు ప్రాశస్త్యాన్ని దెబ్బతీశారని సిబిఐ నివేదికలో వెల్లడించింది. 2019 నుంచి 2024 వరకు దాదాపు 64 లక్షల కిలోల నెయ్యిని కొనుగోలు చేశారని.. ఇందులో అనేక రకాలైన రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయని సిబిఐ తన నివేదికలో పేర్కొంది. ప్రపంచ వ్యాప్తంగా ఎంతోమంది భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్న అంశాన్ని “కమర్షియల్” చేశారని సిబిఐ తన నివేదికలో పేర్కొంది. ఇప్పటికే ఈ వ్యవహారంపై కూటమి ప్రభుత్వం ఆగ్రహంగా ఉంది. వైసిపి పై తీవ్రస్థాయిలో విమర్శలు చేసింది. ఇప్పుడు సిబిఐ నివేదికలో కూడా అక్రమాలు జరిగాయని తేలడంతో కూటమి ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుందో చూడాల్సి ఉంది.