Tirumala Laddu: టీటీడీ( Tirumala Tirupati Devasthanam ) లడ్డూ వివాదం ఒక కొలిక్కి వచ్చేలా కనిపిస్తోంది. గత కొద్ది రోజులుగా ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ చేపడుతున్న సంగతి తెలిసిందే. వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తిరుమల లడ్డులో జంతు కొవ్వు కలిపారని సీఎం చంద్రబాబు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో ఇది పెను వివాదానికి దారి తీసింది. దీంతో సుప్రీంకోర్టు స్పందించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో సంయుక్తంగా ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించింది. గత కొద్ది నెలలుగా ఈ బృందం తిరుమల కేంద్రంగా విచారణ చేపట్టింది. లడ్డు వివాదానికి సంబంధించి విచారణ ఒక కొలిక్కి తెచ్చే ప్రయత్నం జరిగింది. అయితే శ్రీవారి లడ్డు తయారీకే కాకుండా.. రాష్ట్రవ్యాప్తంగా ప్రముఖ దేవాలయాల్లో సైతం ప్రసాదం తయారీకి కల్తీ నెయ్యి సరఫరా జరిగిందని ఈ ప్రత్యేక దర్యాప్తు బృందం కోర్టుకు నివేదించడం విశేషం.
Also Read: జగన్ ఐదు వారాల వ్రతాలు చేస్తున్నాడా? ఏబీఎన్ వెంకటకృష్ణ సూపర్ సిక్స్ అమలు పై ఇలానే మాట్లాడగలడా?
* కొనసాగుతున్న విచారణ
గత కొద్ది రోజులుగా సిబిఐ( Central Bureau of Investigation ) అధికారి నేతృత్వంలో ఈ విచారణ కొనసాగుతోంది. అయితే ఇటీవల విచారణ నివేదికను హైకోర్టుకు అందించింది ఈ బృందం. తిరుమల తో పాటు కాణిపాకం, శ్రీకాళహస్తి, శ్రీశైలం, విజయవాడ, కనకదుర్గ, ద్వారకాతిరుమల, పెనుగంచిప్రోలు తిరుపతమ్మ ఆలయాల్లో ప్రసాదం తయారీకి కల్తీ నెయ్యి సరఫరా జరిగిందని తమ దర్యాప్తులో తేలినట్లు సిబిఐ అడ్వకేట్ హైకోర్టుకు నివేదించారు. అయితే ఇది కల్తీ నెయ్యి అనడం కంటే ఆవు నెయ్యి పేరుతో పామాయిల్ లో కెమికల్స్ కలిపి ఆవు నెయ్యిల కనబడేలా, సువాసన వచ్చేలా చేసి ప్రసాదాలకు సరఫరా చేశారని కోర్టుకు నివేదించారు. దీంతో జంతువు అనే పదం రాకుండా.. పామాయిల్ అని నివేదించడం ఈ కేసులో కీలక పరిణామంగా భావిస్తున్నారు.
* భక్తుల ఆందోళన తిరుమలలో( Tirumala) తయారీకి వినియోగించే నెయ్యిలో జంతువు కలిసిందనే వార్త యావత్ ప్రపంచంలో ఉన్న శ్రీవారి భక్తులను కలచివేసింది. అయితే దీనిపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ స్పందించింది. సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. రాజకీయ దురుద్దేశంతోనే కూటమి ప్రభుత్వం తిరుమలలో జంతువు కలిపారని ఆరోపిస్తున్నారని.. నిష్పక్షపాత విచారణ జరగాలని టీటీడీ పూర్వపు అధ్యక్షుడు వైవి సుబ్బారెడ్డి పిటిషన్ వేశారు. దీనిపై స్పందించిన అత్యున్నత న్యాయస్థానం దర్యాప్తు కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో ప్రత్యేక బృందాన్ని నియమించింది. దీనికి సిబిఐ అధికారి నేతృత్వం వహిస్తున్నారు. అయితే ఇప్పటికే దీనికి సంబంధించి చాలా మంది అరెస్టులు కూడా జరిగాయి. అయితే ఇప్పుడు కేసు తుది దశకు చేరుకుంటోంది. నెయ్యిలో కల్తీ అయితే జరిగిందని.. అది పామాయిల్ తో కూడిన కెమికల్ అని ప్రాథమికంగా నిర్ధారణ అయింది. కానీ అసలు విషయం పై క్లారిటీ రానుంది కొద్దిరోజుల్లో.. అంతవరకు వెయిట్ చేయక తప్పదు.
అసలు పెద్ద ఆరోపణ జంతువుల కొవ్వు కలిపారు అని…
కానీ CBI చెప్పింది పామాయిల్ …
ఇలాంటివి పసిగట్టి వెనక్కి పంపే విధానం TTD లో వుంది… pic.twitter.com/tKPVzQYCnQ
— For A Reason (@far_in_x) June 26, 2025