Homeఆంధ్రప్రదేశ్‌Hindupur Shocking video: మైనర్ బాలికలను వ‌ద‌ల‌ని దుండగుడు.. షాకింగ్ వీడియో

Hindupur Shocking video: మైనర్ బాలికలను వ‌ద‌ల‌ని దుండగుడు.. షాకింగ్ వీడియో

Hindupur Shocking video: సమాజంలో మహిళల పట్ల, చిన్నారుల పట్ల అమానుషాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఎప్పటికప్పుడు ఇవి వెలుగు చూస్తున్నా.. పోలీసులు కఠిన చర్యలకు దిగుతున్నా నియంత్రణలోకి రావడం లేదు. ఈ లైంగిక వేధింపులకు సంబంధించి రాజకీయ నేతలపై కూడా ఆరోపణలు వస్తున్నాయి. అటువంటిదే మరో ఘటన సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి వచ్చింది. ఉమ్మడి అనంతపురం జిల్లాలోని హిందూపురం నియోజకవర్గంలో ఓ మైనర్ బాలికపై.. ఓ పార్టీకి చెందిన గ్రామ నాయకుడు వేధింపులకు దిగాడు. వికృత చేష్టలకు పాల్పడ్డాడు. సోషల్ మీడియాలో పెడతానని బెదిరించి అఘాయిత్యానికి ప్రయత్నించాడు. ప్రస్తుతం ఈ వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది.

ఇటువంటి ఘటనలే అధికం..
ఇటీవల మహిళలపై లైంగిక వేధింపులకు సంబంధించిన వీడియోలు ఎక్కువగా వెలుగులోకి వస్తున్నాయి. ప్రధానంగా రాజకీయ పార్టీల నేతలు ఈ వేధింపులకు దిగుతున్నారు. బాధితులుగా మారుతున్న వారు ఆ వీడియోలను బయటపెట్టి న్యాయం చేయాలని కోరుతున్నారు. మరోవైపు నేరాలకు పాల్పడుతున్న వారు ఆ వీడియోలను తీసి పైశాచిక ఆనందం పొందుతున్నారు. ఈ క్రమంలో ఆ వీడియోలు బయటకు వస్తున్నాయి. అయితే ఈ మొత్తం వ్యవహారంలో మహిళలు, చిన్నారులు బాధితులుగా ఉండగా.. రాజకీయ ప్రయోజనాల కోసం ప్రత్యర్థులు ఈ వీడియోలను వైరల్ చేస్తున్నారు.

ప్రధాన నేత అనుచరుడు?
హిందూపురం నియోజకవర్గంలో ఓ గ్రామానికి చెందిన చోటా నాయకుడు.. ఓ మైనర్ బాలిక పట్ల అమానుషంగా ప్రదర్శించాడు. అసభ్యకరంగా ప్రవర్తిస్తూ లైంగిక దాడికి ప్రయత్నిస్తున్న వీడియోలు ఇప్పుడు బయటకు వచ్చాయి. సదరు నాయకుడు పాఠశాలకు వెళ్తున్న బాలికను ట్రాప్ చేసి.. ఓ ఇంటికి తీసుకెళ్లి లైంగిక దాడికి ప్రయత్నించే క్రమంలో.. వికృత చేష్టలకు పాల్పడ్డాడు. అలా చేసి సెల్ఫోన్లో చిత్రీకరించి.. తిరిగి బాధితురాలను బ్లాక్ మెయిల్ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ వీడియోలు బయటకు రావడంతో.. సదరు నేతపట్ల ఆరోపణలు వచ్చి పడుతున్నాయి. ప్రధాన నాయకుడికి అనుచరుడిగా ప్రచారం నడుస్తోంది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular