https://oktelugu.com/

Janasena: జనసేన చెప్పిన గుడ్ న్యూస్ ఇదీ.. వారికి గొప్ప అవకాశం

మత్స్యకారులకు గుడ్ న్యూస్ చెప్పింది కూటమి ప్రభుత్వం. వారి ఉపాధికి గండి కొట్టే జీవోను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ స్వయంగా ప్రకటించారు.

Written By:
  • Dharma
  • , Updated On : November 12, 2024 9:48 am
    Janasena

    Janasena

    Follow us on

    Janasena: కూటమి ప్రభుత్వం దూకుడు మీద ఉంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీల దిశగా అడుగులు వేస్తోంది.నిన్న శాసనసభలో ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. అభివృద్ధితో పాటు సంక్షేమానికి ప్రాధాన్యం ఇచ్చారు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన అన్నదాత సుఖీభవ,తల్లికి వందనం వంటి పథకాలకు కేటాయింపులు చేయడంతో..త్వరలో పథకాలు అమలు చేస్తారని ఆశాభావం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా వ్యవసాయ బడ్జెట్లో కేటాయింపులు బాగున్నాయని హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి.అదే సమయంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మత్స్యకారుల జీవనానికి విఘాతం కలిగించే 217 జీవోను రద్దు చేస్తున్నట్లు పయ్యావుల కేశవ్ ప్రకటించారు.దానినే హైలెట్ చేస్తూ జనసేన ట్వీట్ చేసింది.గతంలో పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారని..మత్స్యకారుల జీవనానికి విగాతం కలిగించే 217 జీవోను వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిందని.. తాము అధికారంలోకి వస్తే రద్దు చేస్తామని పవన్ కళ్యాణ్ నాడు హామీ ఇచ్చిన విషయాన్ని ప్రస్తావించింది.జనసేన చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ విషయాన్ని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెనాయుడు స్పష్టమైన ప్రకటన కూడా చేశారు. మత్స్య శాఖ మంత్రిగా అదనపు బాధ్యతలు చూస్తున్న ఆయన ఈ విషయంలో అప్పుడే క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడు ఆర్థిక శాఖ మంత్రి బడ్జెట్ ప్రసంగంలో ఈ విషయంపై మరింత స్పష్టత ఇవ్వడంతో మత్స్యకారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

    * ఉపాధికి గండి
    వైసిపి ప్రభుత్వ హయాంలో 217 జీవోను జారీ చేశారు. చెరువుల్లో చేపలు పట్టడానికి టెండర్లు పిలిచేవారు. కేవలం టెండర్ల దక్కించుకున్న వారికి మాత్రమే చేపలు పట్టుకునే అవకాశం లభించేది. అంతకుముందు చెరువులపై పూర్తి హక్కులను మత్స్యకారులకు,మత్స్యకార సంఘాలకు, సొసైటీలకు ఇచ్చేవారు. కానీ వైసీపీ ప్రభుత్వం మాత్రం 217 జీవోను జారీ చేసి వారి హక్కులను కాల రాసింది.అప్పట్లో పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ మత్స్యకార సదస్సు నిర్వహించింది.వారిలో ధైర్యం నింపే ప్రయత్నం చేసింది.తాము అధికారంలోకి వస్తే ఆ జీవోను రద్దు చేస్తామని హామీ ఇచ్చింది.ఇప్పుడు ఆ హామీని నెరవేర్చుకుంది.

    * జీవోను సమర్ధించిన వైసిపి
    అయితే అప్పట్లో ఈ జీవోను సమర్ధించుకుంది వైసిపి. 100 ఎకరాల కంటే ఎక్కువ ఉన్న చెరువులకే ఈ జీవో వర్తిస్తుందని స్పష్టం చేసింది. అయితే అప్పట్లో జగన్ సర్కార్ ఎన్ని రకాల స్పష్టత ఇచ్చినా..మత్స్యకార కుటుంబాల్లో మాత్రం అభద్రతాభావం కొనసాగింది. మత్స్యకారుల్లో ఆందోళనకు కారణమవుతున్న ఈ జీవోను రద్దు చేస్తామని చంద్రబాబుతో పాటు పవన్ ఎన్నికల్లో హామీ ఇచ్చారు. ఆ హామీని అమలు చేశారు ఇప్పుడు. అయితే ఈ జీవో విషయంలో జనసేన ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది. అందుకే తమ పార్టీ విజయం గా జనసేన చెప్పుకుంటుంది.