https://oktelugu.com/

CM Chandrababu: పిల్లలు లేకుంటే ఎన్నికల్లో పోటీ చేయడానికి లేదు.. సీఎం చంద్రబాబు సంచలన ప్రతిపాదన!

ఒకరు ముద్దు.. ఇద్దరి కంటే మించి వద్దు. జనాభా విషయంలో ప్రభుత్వ నినాదం ఇది. కానీ ఈరోజు మాత్రం ఇద్దరు ఉండాల్సిందేనని సాక్షాత్ సీఎం చంద్రబాబు చెబుతుండడం విశేషం.

Written By:
  • Dharma
  • , Updated On : November 12, 2024 / 09:51 AM IST

    CM Chandrababu(9)

    Follow us on

    CM Chandrababu: దేశంలో జనాభా పెరుగుతోంది. అదే సమయంలో పిల్లల సంఖ్య తగ్గుముఖపడుతోంది. ఈ కారణంగా వృద్ధ జనాభా పెరిగి.. యువత తగ్గుముఖం పడుతున్నారు. ఇది అభివృద్ధిపై పడుతోంది. జాతీయస్థాయిలో దీనిపైనే చర్చ నడుస్తోంది. అందుకే పిల్లల విషయంలో ఆంక్షలుతొలగించాలన్న డిమాండ్ వినిపిస్తోంది.సరిగ్గా ఇదే సమయంలో ఏపీ సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పిల్లలను ఎక్కువగా కణాలని సూచించారు. రాబోయే రోజుల్లో దేశంలో వృద్ధ జనాభా పెరిగి.. యువత శాతం తగ్గిపోయే ప్రమాదం ఉందని ఉందన్నారు.దేశ హితం,సమాజ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని జనాభా పెరుగుదలకు కృషి చేయాల్సిన అవసరం ఉందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డుల ప్రధానోత్సవం లో ఈ కీలక వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ అర్హతలపై కూడా మాట్లాడారు. స్థానిక సంస్థల్లో పోటీ చేయాలంటే ఇద్దరు పిల్లలు ఉండాల్సిందేనని.. అందుకు అవసరమైన చట్టం కూడా తీసుకొస్తామని చంద్రబాబు చెప్పారు.దీంతో ఆయన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

    *జనాభా నియంత్రణపై దృష్టి
    అయితే ఇప్పటివరకు దేశంలో జనాభా నియంత్రణ అనేది ప్రధాన అంశంగా మారింది. అన్ని ప్రభుత్వాలు ఈ స్లోగన్ ను పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లాయి కానీ ఇప్పుడు సీఎం చంద్రబాబు జనాభా పెరగాలని కోరుకుంటున్నాం ఆసక్తి రేపుతోంది. అయితే చంద్రబాబు ఆలోచన మరోలా ఉంది. పిల్లల సంఖ్య తగ్గుముఖం పట్టడంతో.. ఆ తరువాత ఉన్న యువతరం వయసు పెరిగి వృద్ధ తరానికి చేరుకుంటుంది.కానీ ఆ స్థాయిలో యువతరం వృద్ధి చెందడం లేదు. ఇది భవిష్యత్తులో ప్రమాదకరమని చంద్రబాబు హెచ్చరిస్తున్నారు. యువత ఉంటేనే అభివృద్ధి సాధ్యమని.. యువత ఆలోచనలతోనే ముందుకెళ్లగలమని గుర్తు చేస్తున్నారు ఆయన.కేవలం జనాభా నియంత్రణ అనేది మంచిదే అయినా.. దేశ హితం కోసం యువత రావాలంటే.. ప్రతి ఒక్కరూ ఇద్దరు పిల్లలను కనాల్సిందేనని తేల్చి చెప్తున్నారు.

    * కూటమి కీలక నిర్ణయం
    ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత స్థానిక సంస్థల పోటీ విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇద్దరికంటే ఎక్కువ మంది పిల్లలు ఉంటే పోటీకి అనర్హత అనే నిబంధనను తొలగించింది. ఈ బిల్లునకు ఏపీ మంత్రి వర్గం సైతం ఆమోదం తెలిపింది. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. సమావేశాల్లో ఈ బిల్లుకు ఆమోదముద్రవేసే అవకాశం ఉంది.అందుకే చంద్రబాబు ఈ కీలక వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.మొత్తానికైతే ఇప్పటివరకు జనాభా వద్దు అని నినదించిన ప్రభుత్వాలే.. జనాభా ముద్దు అని చెబుతుండడం విశేషం.