AP Liquor Policy 2024: మద్యం ప్రియులకు ఇది సూపర్ గుడ్ న్యూస్.. ఇక హాయిగా తాగండి

మొదటి రోజు నుంచే మద్యం షాపులు కిక్కిరిసిపోతున్నాయి. మొన్నటి అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వంలో ఏవేవో కొత్త కొత్త బ్రాండ్లను విక్రయించారు. అందులోనూ మద్యం షాపులను ప్రభుత్వమే నిర్వహించింది.

Written By: Srinivas, Updated On : October 16, 2024 4:10 pm

AP Liquor Policy 2024

Follow us on

AP Liquor Policy 2024: ఏపీలో ఎట్టకేలకు కొత్త మద్యం పాలసీ అమల్లోకి వచ్చేసింది. ఇప్పటికే టెండర్ల ప్రక్రియ ముగియగా.. నేటి నుంచి కొత్త మద్యం షాపులు ప్రారంభం అయ్యాయి. దీంతో మద్యం బాటిళ్లతో షాపులు కళకళలాడుతున్నాయి. అయితే.. మందు బాబులకు కొత్త మద్యం షాపులతోపాటే రెండు కిక్కిచ్చే న్యూస్ చెప్పింది ఏపీ ప్రభుత్వం. దీంతో మందుబాబులు షాపుల ముందు క్యూ కట్టారు.

మొదటి రోజు నుంచే మద్యం షాపులు కిక్కిరిసిపోతున్నాయి. మొన్నటి అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వంలో ఏవేవో కొత్త కొత్త బ్రాండ్లను విక్రయించారు. అందులోనూ మద్యం షాపులను ప్రభుత్వమే నిర్వహించింది. భారీగా ధరలు పెంచి.. గతంలో ఎప్పుడూ వినిపించని బ్రాండ్లను విక్రయించింది. దాంతో చాలా మంది మద్యంప్రియులు వాటిని కొనుగోలు చేయలేకోయారు. అయితే.. 2019కి ముందు ఉన్న బ్రాండ్లను తాజాగా ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో మందుబాబుల్లో ఫుల్ ఖుషీలో ఉన్నారు. కింగ్ ఫిషర్, రాయల్ స్టాగ్, మెన్షన్ హౌజ్, ఇంపీరియల్ బ్లూ వంటి బ్రాండ్లు అందుబాటులోకి వచ్చాయి. దీంతో వారంతా ఆనందంలో తేలియాడుతున్నారు.

గత ప్రభుత్వం విక్రయించిన మద్యం బ్రాండ్లకు ఈ ప్రభుత్వం ఫుల్ స్టాప్ పెట్టింది. వాటన్నింటినీ రిజక్ట్ చేసేసింది. అంతేకాకుండా మద్యం రేట్లను కూడా తగ్గించేసింది. రూ.99లకే మద్యాన్ని విక్రయిస్తోంది. ఇప్పటికే ఆయా షాపుల నుంచి వచ్చిన డిమాండ్ ప్రకారం.. అన్ని మద్యం షాపులకు పాత బ్రాండ్ల మద్యం సరఫరా చేసినట్లు ఎక్సైజ్ శాఖ కూడా తెలిపింది. వారి నుంచి వచ్చిన డిమాండ్ ప్రకారం మద్యం సరఫరా చేస్తామని ఎక్సైజ్ శాఖ చెప్పింది. అన్ని బ్రాండ్లపై రూ.50 నుంచి రూ.100 వరకు తగ్గాయని అధికారులు పేర్కొన్నారు.

మరోవైపు.. ఎక్సైజ్ శాఖ వారు మద్యం ధరలు తగ్గించామని చెబుతున్నప్పటికీ.. షాపుల్లో మాత్రం పాత ధరలకే అమ్ముతున్నారని మద్యం ప్రియులు అంటున్నారు. అన్ని బ్రాండ్ల మీద రూ.100 చొప్పున తగ్గించినట్లు ప్రభుత్వం జీవోలోనూ పేర్కొంది. ఇదిలా ఉండగా.. విస్కీలో హార్సెస్ సెలెక్టెడ్ విస్కీ 180 ఎంఎల్ రూ.130, 750 ఎంఎల్ రూ.750గా నిర్ణయించారు. నేవీ బ్లూ క్లాసిక్ విస్కీ రేటు 180 ఎంఎల్ రూ.150, ఓల్డ్ టైమర్ బ్లూ క్లాసిక్ విస్కీ రేటు 750 ఎంఎల్ రూ.490గా నిర్ణయించి విక్రయిస్తున్నారు. ఇక బ్లెండెడ్ స్కాచ్ విస్కీ రేటు 750 ఎంఎల్ రూ.2,500, 350 ఎంఎల్ రూ.1,250గా నిర్ణయించారు. విస్కీ స్కాచ్ ధరకు వచ్చేసరికి రూ.130 నుంచి రూ.2,500 మధ్య పెట్టారు.

జిన్ సెక్షన్‌లో 750 ఎంఎల్ ధర రూ.2,250గా నిర్ణయించారు. బ్రీజర్‌లో బ్రీజర్ ప్లాటినమ్ టాంగీ క్రాన్ బెర్రీ ధర రూ.130గా ఉంది. బీర్ల విషయానికి వస్తే..కింగ్ ఫిషర్, నాకౌట్ బ్రాండ్స్ రూ.180 నుంచి రూ.270 వరకు విక్రయిస్తున్నారు. బ్రాండీ విభాగంలో కైరోన్ రేరీ బ్రాండీ 180 ఎంఎల్ ధర రూ.300, నెపోలియన్ బ్రాండ్ విస్కీ 750 ఎంఎల్ రూ.1,180గా నిర్ణయించారు. బ్రాండీలో రూ.300 నుంచి రూ.1200 వరకు ధరల్లో వివిధ బ్రాండ్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. రమ్ పరంగా ఓల్డ్ మంక్ స్పెషల్ రమ్ 180 ఎంఎల్ రూ.230, బకార్డి లైమన్ అల్ట్రా ప్లాటినమ్ ఒరిజినల్ సిట్రస్ రమ్ 750 ఎంఎల్ ధర రూ.1320గా నిర్ణయించారు.