Pawankalyan : నా దగ్గరకి సమస్య చెప్పుకోవడానికి వస్తే బిడ్డని చంపించేసాడు ఈ ముఖ్యమంత్రి : పవన్ కళ్యాణ్ ఎమోషనల్ కామెంట్స్

చేపల మార్కెట్ కి అని చెప్పి వెళ్లి, ఇన్ని రోజులు ఏంటి అన్నయ్య అని అడగగా, ఇంటికి వచ్చాక చెప్తాను అన్నాడు, ఆ మరుసటి రోజే అతని శవాన్ని ఆటో లో తీసుకొచ్చి ఇంటి బయట వదిలేసి వెళ్లిపోయారు' అంటూ పవన్ కళ్యాణ్ వైసీపీ చేసిన అరాచకాలను ఎండగట్టాడు.

Written By: Vicky, Updated On : June 17, 2023 8:42 am
Follow us on

Pawankalyan : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు మొత్తం ఇప్పుడు పవన్ కళ్యాణ్ జనసేన ‘వారాహి యాత్ర’ చుట్టూ తిరుగుతున్నాయి. పవన్ కళ్యాణ్ ఈ యాత్ర ద్వారా అధికార పార్టీ కి వణుకు పుట్టిస్తున్నాడు అనడం లో ఎలాంటి అతిసయోక్తి లేదు. మొదటి రోజు యాత్ర అన్నవరం నుండి కత్తిపూడి వరకు సాగింది. కత్తిపూడి సభలో పవన్ కళ్యాణ్ ఇచ్చిన ప్రసంగం సెన్సేషన్ అయ్యింది. ఇక నేడు ఆయన పిఠాపురం సభలో నిర్వహించిన వారాహి యాత్ర కి అనూహ్యమైన స్పందన లభించింది.

అసలు పిఠాపురం లో ఉన్న జనాలు మొత్తం పవన్ కళ్యాణ్ సభలోనే ఉన్నారా.?, పిఠాపురం మొత్తం ఆయనని ర్యాలీగా ఒక దేవుడిని ఊరిగించినట్టు ఊరేగించి తీసుకెళ్ళరా? అని అనిపించింది. ఈ సభలో ఆయన ఇచ్చిన ప్రసంగం వైసీపీ పార్టీ పరువు పోయేలా చేసింది. తమకి ఎదురు తిరిగిన వారిపై ఎలాంటి దుశ్చర్యలకు ఈ ప్రభుత్వం పాల్పడిందో ఒక సంఘటన ని ఉదాహరణగా చెప్పాడు పవన్ కళ్యాణ్.

ఆయన చెప్పిన ఆ కటిక నిజాలు సగటు మనిషిని కనీతి పర్యంతం అయ్యేలా చేస్తుంది. ఇలాంటి ప్రభుత్వం పరిపాలనలోనా మనం బ్రతుకుతున్నది అని సిగ్గు పడక తప్పదు. పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ‘తాడేపల్లి లో ముఖ్యమంత్రి నివాసం ఉండే సమీపం లో ఒక ఆడబిడ్డ వాలంటీర్ గా పనిచేస్తుంది. ఆమె ఇల్లుని రోడ్డు విస్తరణలో భాగంగా కూల్చేశారు. ఆమె మాకు తగిన న్యాయం చేయాల్సిందిగా, నష్టపరిహారం చెల్లించాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరింది.కానీ వాళ్ళు ఆ అమ్మాయిని పట్టించుకోలేదు, అప్పుడు నా దగ్గరకి వచ్చి సమస్యని చెప్పుకుంది, నేను మీడియా ముందుకు తీసుకొచ్చాను, ఆ తర్వాత పదిరోజులకు ఇలాగే ఒక సభలో నేను మాట్లాడుతుండగా, ఆ అమ్మాయి అర్జెంటు గా మాట్లాడాలి సార్ అని కొన్ని పేపర్స్ ఎత్తి చూపిస్తూ పిలిచింది. నేను ఆ అమ్మాయిని గుర్తించి పైకి తీసుకెళ్లి మాట్లాడగా ఆమె అమ్మాయి చెప్పిన సంఘటన విని నా గుండె తరుక్కుపోయింది. నా దగ్గరకి వచ్చి సమస్యలు చెప్పుకున్నందుకు ఆ అమ్మాయిపై బెదిరింపు చర్యలకు పాల్పడ్డారు. ఒకరోజు ఆ అమ్మాయి అన్నయ్య చేపల మార్కెట్ కి వెళ్ళాడు. రాత్రి అయినా ఇంటికి తిరిగి రాలేదు, పక్కరోజు కూడా రాలేదు, ఆ మరుసటి రోజు ఒంగోలు లో ఉండగా ఆ అమ్మాయి అన్నయ్య నుండి ఫోన్ వచ్చింది. చేపల మార్కెట్ కి అని చెప్పి వెళ్లి, ఇన్ని రోజులు ఏంటి అన్నయ్య అని అడగగా, ఇంటికి వచ్చాక చెప్తాను అన్నాడు, ఆ మరుసటి రోజే అతని శవాన్ని ఆటో లో తీసుకొచ్చి ఇంటి బయట వదిలేసి వెళ్లిపోయారు’ అంటూ పవన్ కళ్యాణ్ వైసీపీ చేసిన అరాచకాలను ఎండగట్టాడు.