AP Survey 2024: ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్నాయి. సార్వత్రిక ఎన్నికలతో పాటు ఏపీ అసెంబ్లీకి సంబంధించి షెడ్యూల్ ప్రకటించారు. అన్ని పార్టీలు దూకుడు పెంచాయి. వైసిపి ఒంటరి పోరు చేస్తుండగా.. ఏకకాలంలో అసెంబ్లీ తో పాటు పార్లమెంటు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. కూటమిలోని మూడు పార్టీలు దాదాపు అభ్యర్థులను ఖరారు చేశాయి. ప్రచార పర్వంలో అడుగుపెడుతున్నాయి. సీఎం జగన్ రాష్ట్రంలోని నాలుగు ప్రాంతాల్లో సిద్ధం సభలతో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు.ఈనెల 27 నుంచి బస్సు యాత్రను ప్రారంభించనున్నారు.చిలకలూరిపేట వద్ద భారీ బహిరంగ సభకు కూటమి పార్టీలు సైతం సమర శంఖం పూరించాయి.
మరోవైపు సర్వే సంస్థలు హల్చల్ చేస్తున్నాయి. తాజాగా ప్రముఖ సెఫాలజిస్ట్, ఎన్నికల సర్వే సంస్థ చాణక్య ప్రతినిధి పార్థదాస్ సర్వే చేపట్టారు.వాటి ఫలితాలను ప్రకటించారు.ఉమ్మడి తూర్పుగోదావరి తో పాటు కడప జిల్లాలో ఓటర్ల అభిప్రాయం ఇది అంటూ సర్వేను వెల్లడించారు.
తూర్పుగోదావరి జిల్లాలో అధికార వైసిపి నష్టపోతుందని అంచనా వేశారు. ఇక్కడ కూటమి స్పష్టమైన ఆధిక్యత వైపు దూసుకెళ్తోంది అని చెప్పుకొచ్చారు. కూటమికి 12 నుంచి 13 స్థానాలు దక్కే అవకాశం ఉందని తేల్చేశారు. వైసిపి కేవలం ఆరుస్థానాలకే పరిమితం కానుందని ప్రకటించారు. ఇక్కడ వైసిపికి 47.5% ఓట్లు, ఓటమికి 52.3% ఓట్లు వస్తాయని చెప్పారు. పురుషులకు సంబంధించి టిడిపికి 53% మంది జై కొట్టారు. 45.6% మంది మాత్రం వైసిపి వైపు మొగ్గు చూపారు. అయితే మహిళా ఓటర్లు మాత్రం వైసిపి వైపే ఆసక్తి చూపారు. ఆ పార్టీకి 52.6% మంది మొగ్గు చూపగా.. టిడిపికి 46.3 శాతం మంది మహిళలు జై కొట్టారు.
సీఎం జగన్ సొంత జిల్లా కడపలో మాత్రం వైసిపి స్పష్టమైన గెలుపు దిశగా ఉంది. వైసీపీకి 9 నుంచి 10 అసెంబ్లీ స్థానాలు దక్కే అవకాశం ఉంది. ఇక్కడ కూటమి ఖాతా తెరిచే అవకాశం లేనట్లు తెలుస్తోంది. ఒకవేళ గెలిచినా ఒక్క స్థానానికే పరిమితం కానుందని ఈ సర్వే తేల్చింది. ఇక్కడ వైసిపికి ఏకంగా 53.9% ఓట్లు దగ్గర ఛాన్స్ ఉంది. అందులో పురుషులు 50.1 శాతం కాగా.. మహిళలు 65.7% మేర ఓట్లు వేస్తారని తేల్చి చెప్పారు. ఇక్కడ కూటమికి పడే ఓట్లు 46%. అందులో పురుష ఓటర్లు 50.01 శాతం, మహిళా ఓట్లు మాత్రం 33.9% దక్కే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ రెండు జిల్లాల్లో ఫలితాలు వేర్వేరుగా రాగా.. మహిళా ఓటర్ల విషయానికి వచ్చేసరికి మాత్రం వైసీపీ వైపు మొగ్గు కనిపిస్తుంది. అటు జగన్ నమ్మకం కూడా అదే. సంక్షేమ పథకాలు మహిళల పేరుతో అమలు చేస్తున్నందున.. వారి మొగ్గు వైసిపి వైపే ఉంటుందన్నది ఈ సర్వే ద్వారా తేలింది.