Pithapuram: పిఠాపురంలో ఓటు విలువ అక్షరాల రూ.1.6 లక్షలు

దాదాపు హైదరాబాదులో ఉన్న సెటిలర్స్ ఏపీకి వెళ్లారు. దీంతో సంక్రాంతి మాదిరిగానే భాగ్యనగరం ఖాళీగా కనిపించింది. ఒక్క హైదరాబాదు నుంచి ఎనిమిది లక్షలు మంది వాటర్లు వచ్చినట్లు గణాంకాలు చెబుతున్నాయి.

Written By: Dharma, Updated On : May 15, 2024 11:11 am

Pithapuram

Follow us on

Pithapuram: ఏపీలో ఓటు ఉత్సాహం వెల్లి విరిసింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఓటింగ్ శాతం పెరిగింది. 82% ఓటింగ్ నమోదు అయింది. ఎన్నికల షెడ్యూల్ ప్రకటన తరువాత తెలుగువారు ఓటు వేసేందుకు నిర్ణయించుకున్నారు. అందుకు తగ్గ ఏర్పాట్లు చేసుకున్నారు. ఈసారి విదేశాల నుంచి సైతం పెద్ద ఎత్తున ఎన్ఆర్ఐలు తరలి రావడం విశేషం. ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గంలో ఓటు వేసేందుకు వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు స్వచ్ఛందంగా రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ముఖ్యంగా పవన్ ఫ్యాక్టర్ పిఠాపురంలో బాగా పనిచేసింది. దేశం తో పాటు విదేశాలనుంచి పవన్ అభిమానులు ఓటు వేసేందుకు భారీగా తరలివచ్చారు.

దాదాపు హైదరాబాదులో ఉన్న సెటిలర్స్ ఏపీకి వెళ్లారు. దీంతో సంక్రాంతి మాదిరిగానే భాగ్యనగరం ఖాళీగా కనిపించింది. ఒక్క హైదరాబాదు నుంచి ఎనిమిది లక్షలు మంది వాటర్లు వచ్చినట్లు గణాంకాలు చెబుతున్నాయి. అటు ఎన్నికలకు ముందు హైదరాబాద్- విజయవాడ ప్రధాన రహదారి రద్దీగా మారింది. దారి పొడవునా వాహనాలు కనిపించాయి. భాగ్యనగరంలో ఈ ప్రాంతం ఆ ప్రాంతం అన్న తేడా లేకుండా.. అన్ని ప్రాంతాల నుంచి ఏపీ సెటిలర్స్ స్వస్థలాలకు వచ్చారు.

ఇక అమెరికా, లండన్, ఆస్ట్రేలియా, గల్ఫ్ దేశాల్లో ఉండే తెలుగు వారు తమ సొంత నియోజకవర్గంలో ఓటు వేసేందుకు వచ్చారు. ఎంత డబ్బైనా ఖర్చు పెట్టేందుకు వెనుకాడలేదు. లక్షలాది రూపాయల విమాన చార్జీలు కట్టుకొని మరీ వచ్చిన వారు ఉన్నారు. పిఠాపురానికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ అమెరికాలో పనిచేస్తున్నాడు. టెక్సాస్ లో పనిచేసే ప్రసన్న కుమార్ అనే యువకుడు పిఠాపురంలో ఓటు వేసేందుకు లక్ష అరవై వేల రూపాయలు ఖర్చు చేసి మరి వచ్చాడు. పిఠాపురంలో పవన్ పోటీ చేస్తున్న నేపథ్యంలో.. అక్కడ పోటీ ప్రతిష్టాత్మకంగా మారింది. అందుకే పిఠాపురానికి చెందిన ఓటర్లు ఎక్కడ ఉన్నా స్వస్థలాలకు రావడం కనిపించింది. మొత్తానికైతే గతంలో ఎన్నడూ లేని చిత్రవిచిత్రాలు ఎన్నికల్లో వెలుగు చూశాయి.