The Story of Electricity Bills: ఏపీలో( Andhra Pradesh) కూటమిపాలన ఏడాది పూర్తి చేసుకుంది. ప్రజలకు సుపరిపాలన అందిస్తున్నామని పాలకులు చెబుతున్నారు. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం సమస్యలు అలానే ఉన్నాయి. ముఖ్యంగా విద్యుత్ సమస్యలతో ప్రజలు విలవిలలాడుతున్నారు. విద్యుత్ చార్జీలు భారీగా పెంచాలని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సామాన్యుడికి సైతం ఎనిమిది వందల రూపాయలు దాటి విద్యుత్ బిల్లులు వస్తుండడంతో వారు బాహటంగానే విమర్శిస్తున్నారు. ప్రభుత్వం తీరుపై ప్రశ్నిస్తున్నారు. సూపర్ సిక్స్ పథకాల మాట దేవుడు ఎరుగు.. ప్రజలకు పన్నులు, చార్జీలతో పిప్పి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కార్యాలయాలు చుట్టూ తిరుగుతున్నా పనులు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఓ సామాన్యుడి ఆవేదన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
రెట్టింపు బిల్లులు..
సాధారణంగా సామాన్య మధ్య తరగతి కుటుంబాలకు 500 రూపాయల వరకు విద్యుత్ బిల్లులు( electrical bills) వచ్చేవి. కానీ ఉన్నపలంగా ఒకేసారి రెట్టింపు బిల్లులు వస్తుండడంతో వారు హడలెత్తిపోతున్నారు. విద్యుత్ సమస్యలు చెప్పుకోవడానికి కార్యాలయాలకు వెళ్తున్నారు. అక్కడ వారికి సరైన పరిష్కార మార్గం దొరకడం లేదు. నెలకు విద్యుత్ చార్జీలకే వెయ్యి రూపాయలు కేటాయించాల్సి రావడంతో సామాన్యుడు పడుతున్న బాధ వర్ణనాతీతం. అందుకే బాహాటంగానే ప్రభుత్వ తీరును తప్పుపడుతున్నారు. తిట్ల దండకం అందుకుంటున్నారు. ఆ కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నామని.. అయినా తమకు న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Also Read: Electricity Bill: ఈ చిట్కాలు పాటిస్తే కరెంట్ బిల్లును తగ్గించుకోవచ్చు.. అవేంటంటే
అక్కరకురాని సూపర్ సిక్స్
సూపర్ సిక్స్ ( Super 6 )పథకంలో భాగంగా ఉచితంగా గ్యాస్ సిలిండర్లు మూడు అందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే దానికి సంబంధించి రాయితీ నగదు బ్యాంకు ఖాతాల్లో పడడం లేదు. దీంతో వినియోగదారులు బ్యాంకుల చుట్టూ తిరగడం కనిపిస్తోంది. గ్యాస్ ఏజెన్సీల వద్దకు వెళ్తే ఆ రాయితీ సొమ్ము ఏనాడో వేశామని చెబుతున్నారు. బ్యాంకుల వద్దకు వెళ్లి చూస్తే ఖాతాల్లో నగదు కనిపించడం లేదు. దీంతో వినియోగదారులు ఏం చేయాలో పాలుపోవడం లేదు. ఒకవైపు పథకాలు ఇస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది. కానీ జమ కావడం లేదు. ఇంకోవైపు పన్నులు, చార్జీల బాధ తప్పడం లేదు. దీంతో సామాన్యుడు బాధ తట్టుకోలేక సోషల్ మీడియా వేదికగా మనసులో ఉన్న మాటలను, ఆవేదనను బయట పెడుతున్నాడు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఓ సాధారణ వ్యక్తి సోషల్ మీడియా వేదికగా తన ఆవేదనను వెలిబుచ్చాడు. అదే ఇప్పుడు వైరల్ గా మారింది.