https://oktelugu.com/

Software engineer  : వర్క్ ఫ్రం హోం ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ప్రాణాలు తీసింది!

Software engineer  : వర్క్ ఫ్రం హోం ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ప్రాణాలు తీసింది.. కరోనా కల్లోలంతో ఇంటి నుంచే పనిచేస్తున్న ఓ టెకీకి ఊహించని ఉపద్రవం ల్యాప్ టాప్ తో వచ్చింది. ల్యాప్ ట్యాప్ తో ఇంటినుంచే పనిచేస్తున్న ఓ లేడీని అదే ఇలా కబళిస్తుందని ఎవరూ ఊహించలేకపోయారు. తీవ్ర గాయాలపాలైన ఆ యువతి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. ఏపీలోని కడప జిల్లా బి.కోడూరు మండలంలోని మేకవారి పల్లె గ్రామానికి చెందిన […]

Written By:
  • NARESH
  • , Updated On : April 22, 2022 / 08:43 PM IST
    Follow us on

    Software engineer  : వర్క్ ఫ్రం హోం ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ప్రాణాలు తీసింది.. కరోనా కల్లోలంతో ఇంటి నుంచే పనిచేస్తున్న ఓ టెకీకి ఊహించని ఉపద్రవం ల్యాప్ టాప్ తో వచ్చింది. ల్యాప్ ట్యాప్ తో ఇంటినుంచే పనిచేస్తున్న ఓ లేడీని అదే ఇలా కబళిస్తుందని ఎవరూ ఊహించలేకపోయారు. తీవ్ర గాయాలపాలైన ఆ యువతి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది.

    ఏపీలోని కడప జిల్లా బి.కోడూరు మండలంలోని మేకవారి పల్లె గ్రామానికి చెందిన సుమలత(22) అనే సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ప్రస్తుతం వర్క్ ఫ్రం హోం పద్ధతిలో ఇంటి నుంచే ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తోంది. ఈ క్రమంలోనే సోమవారం ఉదయం వర్క్ ఫ్రం హోంలో ల్యాప్ ట్యాప్ పై పనిచేస్తోంది. ల్యాప్ ట్యాప్ చార్జింగ్ అయిపోవడం గమనించి ఛార్జింగ్ పెట్టేందుకు వైర్ ను స్విచ్ బోర్డులో పెట్టింది. చార్జింగ్ పెడుతూ వర్క్ చేస్తున్న క్రమంలో ల్యాప్ ట్యాప్ వేడెక్కింది. ఒక్కసారిగా ల్యాప్ ట్యాప్ పేలిపోయింది. ఒడిలో పెట్టుకొని పనిచేస్తున్న సుమలతకు తీవ్ర గాయాలయ్యాయి.

    80 శాతం కాలిన గాయాలతో ప్రైవేటు ఆస్పత్రిలో చేరిన ఆమె పరిస్థితి విషమించడంతో కడప రిమ్స్ కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం కన్నుమూసింది. దీంతో కుటుంబంలో .. గ్రామంలో విషాదం అలుముకుంది.

    ఉన్నత ఉద్యోగం చేస్తున్న ఆ యువతిని ఆ ల్యాప్ ట్యాప్ బలి తీసుకుంది. నాణ్యత లేని ల్యాప్ ట్యాప్ నో లేక మరేదైనా సాంకేతిక సమస్యనో కానీ ఎంతో ఉజ్వల భవిష్యత్ ఉన్న యువ టెకీ ప్రాణాలు పోయాయి. ఈ వార్త తెలిసాక అయినా టెకీలు వర్క్ ఫ్రంట్ చేస్తున్న వారు జాగ్రత్తలు వహించాలి. చార్జింగ్ పెట్టినప్పుడు ఒడిలో కాకుండా టేబుల్ పై పెట్టుకొని పనిచేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ ఘటనతోనైనా టెకీలు ల్యాప్ ట్యాప్ హీట్ ఎక్కినా.. ఇతర ఏదైనా సాంకేతిక లోపం తలెత్తినా జాగ్రత్తలు వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
    Recommended Videos