
ఈ మధ్య కాలంలో నకిలీ విత్తనాల వల్ల దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో రైతులు నష్టపోతున్నారు. ఈ నకిలీ విత్తనాల వల్ల సామాన్య రైతులే కాదు అధికార పార్టీ ఎమ్మెల్యే కూడా మోసపోవడం గమనార్హం. వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తన పొలంలో నాటిన విత్తనాలు నకిలీ విత్తనాలని తెలిసి షాక్ అయ్యారు. ఎమ్మెల్యే కాకముందు, ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా వ్యవసాయం చేస్తున్న ఆళ్ల రామకృష్ణారెడ్డి తన పొలంలో వరి పంట వేశారు.
నాట్లు పూర్తైన తర్వాత మొన్న వెళ్లి పంట పొలాన్ని పరిశీలించగా పొలంలో నారు సరిగ్గా పెరగలేదని ఎమ్మెల్యే ఆర్కేకు విత్తనాలు నకిలీ విత్తనాలు అని అర్థమైంది. ఎమ్మెల్యే తన ఫేస్ బుక్ ఖాతా ద్వారా ఈ విషయాలను వెల్లడించారు. తాను పొలానికి వెళ్లానని.. తాను ఏపీ సీడ్స్ దగ్గర కొనుగోలు చేసిన విత్తనాల్లో 20 శాతం నకిలీ విత్తనాలు ఉన్నట్లు గుర్తించానని తెలిపారు. అధికారులు సైతం క్షేత్రస్థాయికి వెళ్లి పంటను పరిశీలించి ఎమ్మెల్యే ఆర్కే చెప్పిన మాటలు నిజమేనని తేల్చారు.
గుంటూరు జిల్లా వ్యవసాయ అధికారులతో ఎమ్మెల్యే ఆర్కే ఇప్పటికే మాట్లాడారు. అధికారులు సదరు కంపెనీపై చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. కర్నూలు జిల్లా నంద్యాల మంజీరా సీడ్స్ కంపెనీ ఏపీ సీడ్స్ కు ఈ విత్తనాలను సరఫరా చేసినట్టు ప్రాథమికంగా తెలుస్తోంది. అధికార పార్టీ ఎమ్మెల్యే నకిలీ విత్తనాల వల్ల మోసపోవడం వైసీపీ వర్గాల్లో కలకలం రేపుతోంది.
ఎమ్మెల్యే ఆర్కే ఇప్పటికే ప్రభుత్వానికి, ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో వాళ్లు సదరు కంపెనీ ప్రతినిధులు ఏం చెబుతాతో చూడాల్సి ఉంది. ఎమ్మెల్యే ఆర్కే ఏపీ సీడ్స్ నుంచి విత్తనాలను కొనుగోలు చేసిన బిల్లులను కూడా చూపించడం గమనార్హం.
Comments are closed.