Balineni Srinivasa Reddy: జనసేనలో( janasena ) బాలినేని శ్రీనివాస్ రెడ్డి చేరి చాలా రోజులు అవుతుంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా ఉన్న ఆయన ఆ పార్టీకి గుడ్ బై చెప్పి జనసేనలో చేరారు. అయితే జనసేనలో పెద్ద పదవి ఆఫర్ చేయడంతోనే ఆయన పార్టీ మారారని అప్పట్లో ప్రచారం నడిచింది. కానీ ఇంతవరకు బాలినేనికి పదవి లభించలేదు. జనసేన పార్టీలో సైతం పెద్దగా ప్రాధాన్యత లేదు. అందుకే బాలినేని యుటర్న్ తీసుకుంటారని.. తిరిగి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతారని పెద్ద ఎత్తున ప్రచారం నడుస్తోంది. సరిగ్గా ఇటువంటి సమయంలోనే మరో వార్త ఒకటి బయటకు వచ్చింది. త్వరలో బాలినేని శ్రీనివాస్ రెడ్డికి పదవి ఖాయమని టాక్ నడుస్తోంది. పార్టీలో చేరినప్పుడు ఇచ్చిన హామీలు పవన్ కళ్యాణ్ అమలు చేయబోతున్నారు అనేది దాని సారాంశం. వచ్చే ఏడాది బాలినేనికి పదవి ఇస్తారని ప్రచారం సాగుతోంది.
రాజశేఖర్ రెడ్డి ప్రోత్సాహంతో..
వైయస్ రాజశేఖర్ రెడ్డి( Y S Rajasekhara Reddy) ప్రోత్సాహంతో యువజన కాంగ్రెస్లో పని చేసిన బాలినేని అసెంబ్లీలో అడుగుపెట్టగలిగారు. 2004లో తొలిసారిగా ఎమ్మెల్యే అయ్యారు. అయితే రాజశేఖర్ రెడ్డి తన క్యాబినెట్ లోకి తీసుకొని బాలినేని శ్రీనివాస్ రెడ్డికి ప్రమోషన్ కల్పించారు. 2009లో సైతం బాలినేని గెలిచేసరికి మంత్రివర్గంలోకి తీసుకున్నారు. అయితే రాజశేఖర్ రెడ్డి అకాల మరణంతో మంత్రి పదవిని వదులుకొని మరి జగన్ వెంట అడుగులు వేశారు బాలినేని. అది మొదలు 2024 ఎన్నికల వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. అయితే ఇచ్చిన మంత్రి పదవిని తొలగించేసరికి జగన్ పై మనస్థాపానికి గురయ్యారు బాలినేని. 2024 ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయేసరికి పునరాలోచనలో పడిపోయారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో తగిన గౌరవం దక్కడం లేదని భావించి జనసేనలో చేరారు. అయితే అక్కడ ఇంతకంటే పరిస్థితి ఘోరంగా ఉంది. పార్టీతో పాటు ప్రభుత్వంలో బాలినేనికి తగినంత ప్రాధాన్యం లేదు.
యూటర్న్ అని ప్రచారం జరుగుతుండగా..
అయితే బాలినేని ఒక్కరే కాదు చాలామంది పార్టీ నేతల పరిస్థితి అదే. పార్టీ మారిన వారికి సరైన గౌరవం మాత్రం దక్కడం లేదు. ఈ పరిస్థితుల్లో బాలినేని తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోతారని సోషల్ మీడియాలో ప్రచారం నడుస్తోంది. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం బాలినేనికి వచ్చే ఏడాది ఎమ్మెల్సీ పదవి ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది పెద్ద ఎత్తున ఎమ్మెల్సీ పదవులు ఖాళీగా ఉన్నాయి. ఆపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి చాలామంది ఎమ్మెల్సీలు కూటమి పార్టీలో చేరారు. న్యాయస్థానం ఆదేశాలతో వారి రాజీనామాలను సైతం మండలి చైర్మన్ ఆమోదించే అవకాశం ఉంది. అదే జరిగితే పెద్ద ఎత్తున ఎమ్మెల్యే అభ్యర్థి జరగాల్సి ఉంటుంది.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి తగినంత మంది సంఖ్యాబలం లేకపోవడంతో అలా ఖాళీ అయిన ఎమ్మెల్సీలు కూటమి పార్టీలకే వరిస్తాయి. జనసేన తరఫున బాలినేనికి అవకాశం పవన్ ఇస్తారని ప్రచారం సాగుతోంది. మరి అందులో ఎంత వాస్తవం ఉందో చూడాలి.