https://oktelugu.com/

Chandrababu : ఇండియాలో ధనిక ముఖ్యమంత్రి ఆయనే.. ఆస్తులు ఎంతో తెలుసా?

దేశంలో ఏపీ ఎప్పుడు ప్రత్యేకమే. రాజకీయంగానే పై చేయి సాధిస్తూ వస్తోంది. ఇప్పుడు ఎన్డీఏలో కీలక భాగస్వామిగా టిడిపి ఉంది. ఏపీలో కూటమి ప్రభుత్వం నడుస్తోంది. చంద్రబాబు నడిపిస్తున్నారు. ఆయన దేశంలోనే ప్రత్యేకంగా గుర్తించబడుతున్నారు.

Written By:
  • Dharma
  • , Updated On : December 31, 2024 / 11:27 AM IST

    The richest Chief Minister in India

    Follow us on

    Chandrababu :  ఏపీ సీఎం చంద్రబాబు మరో రికార్డ్ సృష్టించారు. దేశంలోనే అత్యంత ధనిక సీఎం గా నిలిచారు. ఆయన మొత్తం ఆస్తులు విలువ అక్షరాల రూ.9,31,83,70,656 కోట్లు. ఈ స్థాయిలో ఆస్తిపాస్తులను సంపాదించిన ముఖ్యమంత్రి దేశంలోనే మరొకరు లేరు. ఇక అతి తక్కువ ఆస్తులు ఉన్న ముఖ్యమంత్రిగా పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నిలిచారు. ముఖ్యమంత్రులకు చెందిన ఆస్తుల జాబితాను అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ తాజాగా విడుదల చేసింది. అన్ని రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్యమంత్రుల ఆస్తుల వివరాలతో కూడిన నివేదిక వెల్లడించింది. ఇందులో పలు అంశాలను పొందుపరిచింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆదాయ వివరాలు ప్రకారం ముఖ్యమంత్రుల ఆస్తులను ప్రకటించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో జాతీయ సగటు ఆదాయం రూ.1,85,854 ఉండగా.. ముఖ్యమంత్రుల స్వీయ సగటు ఆదాయం 13,64,310 రూపాయలుగా ఉంది. అంటే 7.3% ముఖ్యమంత్రుల ఆదాయం అధికం అన్నమాట.

    * ఆస్తుల విలువ అధికం
    మొత్తం దేశంలో ముఖ్యమంత్రుల సగటు ఆస్తుల విలువ 52.59 కోట్ల రూపాయలు. 31 రాష్ట్రాలకు సంబంధించి ముఖ్యమంత్రుల స్థిర, చరాస్తులు విలువ సగటు మొత్తం 1630 కోట్లు. ఇందులో చంద్రబాబు నాయుడు తొలి స్థానంలో నిలిచారు. ఆయనకు ఉన్న ఆస్తుల విలువ 931 కోట్ల రూపాయలు. ఇందులో స్థిరాస్తుల విలువ 1,21,41,41,609 రూపాయలు కాగా.. చరాస్తులు విలువ 8,10,42,29,047 రూపాయలుగా ఏడిఆర్ నివేదిక నిర్ధారించింది.
    * అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖండు రెండో స్థానంలో నిలిచారు. ఆయనకు ఉన్న ఆస్తుల విలువ 332 కోట్ల రూపాయలు.
    * కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మూడో స్థానంలో నిలిచారు. ఆయన ఆస్తులు విలువ 51 కోట్ల రూపాయలు.
    * తక్కువ ఆస్తులు ఉన్న ముగ్గురు ముఖ్యమంత్రుల్లో పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అగ్రస్థానంలో నిలిచారు. ఆమెకు ఎలాంటి స్థిరాస్తులు లేవు. 15 లక్షల 38 వేల రూపాయల మేరా చరాస్తులు మాత్రమే ఉన్నాయి. రెండో స్థానంలో జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా, మూడో స్థానంలో కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ ఉన్నారు.