Lady Constable: అమ్మాయిని ఎవరైనా అన్నారనో.. అమ్మాయి తమను మోసం చేసిందనో.. అమ్మాయి కోసం ఇద్దరు గొడవ పడో పోలీస్టేషన్‌కు రావడం చూస్తుంటాం. కానీ పోలీసులే ఓ అమ్మాయి కోసం.. అదీ లేడీ కానిస్టేబుల్ కోసం కాలర్ పట్టుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లా భీమవరం వనటౌన్ పోలీస్ స్టేషనలో జరిగింది.

లేడీ కానిస్టేబుల్ కోసం..
ఆంధ్రప్రదేశలోని పశ్చిమగోదావరి జిల్లా భీమవరం పోలీస్ స్టేషన్‌లో ఓ లేడీ కానిస్టేబుల్ పనిచేస్తోంది. అదే స్టేషన్ సీఐ కృష్ణ భగవాన్, అక్కడే పనిచేస్తున్న కానిస్టేబుల్ కొన్ని రోజులుగా లేడీ కానిస్టేబుల్ వెంట పడుతున్నారు. లేడీ కానిస్టేబుల్ ఇద్దరితో సన్నిహితంగానే ఉంటుంది. అందరిదీ పది మందికి సభ్యత సంస్కారం గురించి చెప్పే విధులే. కాన్నీ అక్కడ ఉన్నది లేడీ కానిస్టేబుల్. అమ్మాయి కావడంతో సీఐ, మగ కానిస్టేబుల్ తాము ఖాకీ యూనిఫాం ధరించామన్న విషయాన్ని కూడా మర్చిపోయారు. ఇద్దరం వెంటపడుతున్న విషయం ఇటీవల బయటపడింది. దీంతో ఇద్దరూ లేడీ కానిస్టేబుల్ కోసం ఘరషణకు దిగారు. సీఐ తన పై అధికారి అని కూడా కానిస్టేబుల్ వెనక్కు తగ్గలేదు. అమ్మాయి కాబట్టి తాను తగ్గేదే లే అన్నట్లు సీఐతో గొడవకు దిగారు. పరస్పరం దాడి కూడా చేసుకున్నట్లు తెలిసింది.
వీఆర్‌కు సీఐ..
లేడీ కానిస్టేబుల్ కోసం సీఐ, కానిస్టేబుల్ కొట్టుకున్న విషయం పోలీస్ ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. దీంతో అప్రమత్తమైన అధికారులు తమ విధులను మరిచి పరస్పరం దాడిచేసుకున్న సీఐని వీఆర్‌కు పంపించారు. ఇక కానిస్టేబుల్‌పై కూడా చర్యకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. మొత్తంగా ఈ వ్యవహారంలో పోలీసుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఆడదాని కోసం రాజ్యాలు పోయాయి.. రాజులు పోయారని చరిత్రలో చదువుకున్నాం. తాజాగా అమ్మాయి కోసం పోలీసులు కొట్టుకోవడమే ఇప్పుడు విచిత్రంగా ఉంటున్నారు. భీమవరం పట్టణ ప్రజలు. భీమవరం బుల్లెమ్మా ఎంత పని చేశావమ్మా అని వ్యాఖ్యానిస్తున్నారు