Maredumilli : ఆ విద్యార్థుల విహారయాత్ర విషాదయాత్రగా మారింది. జలపాతంలో దిగు సేదతీరుతుండగా ఒక్కసారిగా ప్రవాహం కొట్టుకు వచ్చింది. భారీ వర్షాలతో పొంగి ప్రవహించింది. దీంతో ఐదుగురు విద్యార్థులు గల్లంతయ్యారు. అందులో ఇద్దరిని స్థానికులు కాపాడారు. ముగ్గురి ఆచూకీ కనిపించకుండా పోయింది.ప్రస్తుతం జలపాతం వద్ద గాలింపు చర్యలు చేపడుతున్నారు.అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లిలో వెలుగు చూసింది ఈ ఘటన. ఏలూరులోని ఆశ్రమం కళాశాల ఎంబిబిఎస్ మృతి సంవత్సరం విద్యార్థులు 14 మంది విహారయాత్రకు ఆదివారం బయలుదేరారు. ప్రత్యేక ట్రావెల్ వాహనంలో మారేడుమిల్లి నుంచి చింతూరు వెళ్తుండగా జల తరంగిణి జలపాతం వద్ద వారు ఆగారు.అందులో దిగారు. ఇంతలో భారీ వర్షం కురిసింది. జల ఉధృతి పెరగడంతో ఐదుగురు విద్యార్థులు గల్లంతయ్యారు.అయితే హరిణి ప్రియ, గాయత్రి పుష్ప అనే ఇద్దరిని స్థానికులు కాపాడారు. రంపచోడవరం ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. హరిణి ప్రియ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
*మంచి స్నేహితులు
ఈ 14 మంది విద్యార్థులు మంచి స్నేహితులు. అరకు విహారయాత్రకు బయలుదేరారు.మధ్యలో జలపాతం వద్ద కొద్దిసేపు గడపాలని భావించారు.అయితే వర్షాలకు జలపాతం వద్ద నీటి ఉధృతి అమాంతం పెరిగింది. అయితే ఇది గమనించని ఐదుగురు విద్యార్థులు నీటి ప్రవాహానికి కొట్టుకుపోయారు. మిగతా విద్యార్థులు హాహాకారాలు చేయడంతో పక్కనే ఉన్న పర్యాటకులు, స్థానికులు అలర్ట్ అయ్యారు. ఇద్దరు విద్యార్థులను కాపాడారు. ప్రాణాలతో బయటపడిన వీరిద్దరూ విజయనగరానికి చెందినవారు.
* గల్లంతయిన వారు వీరే
గల్లంతయిన వారిలో ప్రకాశం జిల్లా మార్కాపురానికి చెందిన సిహెచ్ హరదీప్, విజయనగరానికి చెందిన కొసిరెడ్డి సౌమ్య, బాపట్ల కు చెందిన బి అమృత ఉన్నారు. పోలీసులతోపాటు సిబిఐటి సిబ్బంది గాలింపు చర్యలు చేపడుతున్నారు. గల్లంతైన సౌమ్య స్వస్థలం విజయనగరం జిల్లా బొబ్బిలి పట్టణం. కుమార్తె గల్లంతైన సమాచారం అందుకున్న తల్లిదండ్రులు అప్పలనాయుడు, రమాలు కన్నీటి పర్యాంతమయ్యారు. ఘటనా స్థలానికి చేరుకున్నారు.
* పెరిగిన పర్యాటకుల తాకిడీ
దసరా సెలవులు సమీపిస్తున్న నేపథ్యంలో అరకు పర్యాటక ప్రాంతానికి పర్యాటకుల తాకిడి పెరిగింది. అంతర్ రాష్ట్ర రహదారి వాహనాలతో రద్దీగా మారింది. జలపాతాల వద్ద సైతం జనం తాకిడి అధికంగా ఉంది. అయితే అక్కడ ఎటువంటి భద్రతా చర్యలు లేకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read MoreWeb Title: The medical students who were washed away in the maredumilli waterfall three drowned in the surge
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com