America vs Iran: వెనెజువెలాలో ఆధిపత్యం స్థాపించిన అమెరికా దృష్టి ఇప్పుడు గల్ఫ్ దేశం ఇరాన్‌పైకి తిరిగింది. ఇరాన్ ప్రభుత్వానికి వ్యతిరేక ప్రజా ఉద్యమాలు ఎన్నడూ లేని తీవ్రతను చూపుతున్నాయి. 31 రాష్ట్రాల్లో 11 రోజులుగా పట్టణాలు, నగరాలు తిరుగుబాటుతో అట్టుడుకుతున్నాయి. ప్రభుత్వ బలగాలు 35 మంది ఆందోళనకారులను కాల్చి చంపాయి. 2,200 మంది అరెస్టులు, పదుల మందికి గాయాలయ్యాయి. ఇదిలా ఉంటే టెహ్రాన్‌లో ప్రభుత్వ నియంత్రణ పూర్తిగా క్షీణించింది. పోలీసులు సరెండర్ అవుతూ ఆందోళనల్లో చేరారు. 47 తుపాకులు ప్రజల చేతిలోకి వచ్చి, ఇద్దరు అధికారులను చంపారు.
ఖమేనీ పాలన ఇక చరిత్రే..
87 ఏళ్ల అయతుల్లా ఖమేనీ పాలనలో ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ (ఐఆర్‌జీసీ), బాసిజ్ గూడచారులు ముఖ్య ఆయుధాలు. 2009 ఓటు మోసాలు, 2017–19 ఇంధన ధరల నిరసనలు, 2022 హిజాబ్ వ్యతిరేక పోరాటాల తర్వాత ఇప్పుడు ఆర్థిక సంక్షోభం ప్రజలను అణచివేసింది. తాజా నిరసనల్లో అన్ని వర్గాలు పాల్గొంటున్నాయి ఇరాన్ రాజు కుమారుడు తిరుగుబాటుకు పిలుపు ఇవ్వడంతో ఉద్యమం మరింత ఊపందుకుంది.
అమెరికా సైనిక చర్యలు..
అమెరికా మరోవైపు డెల్టా ఫోర్స్‌ను ఇరాక్ సరిహద్దుల్లో మోహరించింది. హై–రిస్క్ ఆపరేషన్లకు ప్రసిద్ధ ఈ బలగాలు ఇరాన్‌కు 450 కి.మీ. దూరంలో ఉన్నాయి. ఎర్బిల్ పట్టణంలో అమెరికా వాయు సేన ల్యాండ్ అయింది. స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ చుట్టూ అమెరికా బలగాలు చెక్కర్లు కొడుతున్నాయి. దాడి అమెరికా చేస్తుందా లేక ఇజ్రాయెల్ చేస్తుందా అనేది అనిశ్చితం, కానీ ఖాయమైనది దాడి జరగడమే.
ఇరాన్ బలాలు రెడీ..
ఇరాన్ వెనెజువెలా లాంటి బలహీన దేశం కాదు. హమాస్, హిజ్బుల్లా, హూతీల మద్దతు, 3 వేల అణ్వాయుధాలు, ఫతహ్–1, ఫతహ్–2 క్షిపణులు ఉన్నాయి. సిరియా అమెరికా–టర్కీ చేతిలోకి వెళ్లడంతో దాడి అవకాశాలు పెరిగాయి. అమెరికా జోక్యం చేస్తే రష్యా, చైనా స్పందించే ఆస్కారం ఉంది. ఇజ్రాయెల్‌పై ఇరాన్ ప్రతీకార దాడి సాధ్యమే.
ఇరాన్ 47 ఏళ్ల పాలనలో అతి పెద్ద సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ప్రజలు ఆర్థిక కష్టాలతో భద్రతా బలగాలపై భయం కోల్పోయారు. దీంతో ఇప్పుడు ఇరాన్ ముంద మూడు మార్గాలు ఉన్నాయి. సైన్యాన్ని రంగంలోకి దించడం, సడలింపులు ప్రకటించడం, లేదా అధికారం వదులుకోవడం. ఏమి జరుగుతుందో భవిష్యత్ చెబుతుంది.